
‘రామాయణ్’ టైటిల్ ‘గాడ్ పవర్’గా మారిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి రాముడు, సీత పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటివరకూ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రామాయణం ఆధారంగా ‘రామాయణ్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.
అలాగే సీతారాముల గెటప్స్‌లో సాయి పల్లవి, రణ్‌బీర్ కపూర్ ఉన్న ఫొటోలు లీక్ అయి, వైరల్‌గా మారాయి. ముంబైలో చడీ చప్పుడూ లేకుండా కొన్ని రోజుల క్రితం ఈ చిత్రం షూటింగ్ ఆరంభించారు. ఆ లొకేషన్లోని రణ్‌బీర్, సాయి పల్లవి ఫొటోలే బయటికొచ్చాయి. కాగా.. ఈ చిత్రానికి ‘రామాయణ్’ టైటిల్‌కి బదులు ‘గాడ్ పవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందనే వార్త ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment