
హీరోయిన్ సాయిపల్లవి పేరు చెప్పగానే క్యూట్ ఫేస్, అద్భుతమైన డ్యాన్సులే గుర్తొస్తాయి. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఈమె.. టీనేజ్‌లోనే పలు రియాలిటీ షోల్లో చేసి బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న ఈమె ప్రస్తుతం హిందీలో ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంది. అలాంటి ఈమె ఇప్పుడు జపాన్‌లోని ఓ పబ్‌లో ఊరమాస్ డ్యాన్స్ చేయడం వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'సలార్' విలన్ పాన్ ఇండియా మూవీ.. ట్రైలర్ ఓ విజువల్ వండర్)
మలయాళ 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయిపల్లవి.. 'ఫిదా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం తదితర చిత్రాల్లోనూ అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వీటితో పాటు తమిళంలోనూ పలు హిట్ మూవీస్ చేసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా చిన్న బ్రేక్ తీసుకున్న సాయిపల్లవి.. తెలుగు, తమిళ, హిందీల్లో తలో చిత్రం చేస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్.. హీరోగా హిందీలో తొలి సినిమా చేస్తున్నాడు. ఇందులోనే సాయిపల్లవి హీరోయిన్. కొన్నాళ్లుగా జపాన్‌లో షూటింగ్ జరుగుతోంది. తాజాగా షెడ్యూల్ పూర్తవడంతో.. టీమ్ అంతా చిన్న పార్టీ చేసుకున్నారు. ఇందులో సాయిపల్లవి ఓ హిందీ పాటకు క్రేజీ స్టెప్పులేసింది. ఆ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: శరత్‌బాబుతో బిడ్డను కనాలనుకున్నా: సీనియర్ నటి జయలలిత)
Queen Sai Pallavi Dance at #EkDin japan schedule wraps up party 🥹♥️#SaiPallavi @Sai_Pallavi92 #Japan pic.twitter.com/j10iQTYQqd
— Sai Pallavi FC™ (@SaipallaviFC) March 8, 2024