అక్కినేనికి కమల్ వాయిస్? | Kamal, Maddy to dub for ANR, Nag in Tamil version of Manam? | Sakshi
Sakshi News home page

అక్కినేనికి కమల్ వాయిస్?

Published Wed, Jun 25 2014 11:21 PM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

అక్కినేనికి కమల్ వాయిస్? - Sakshi

అక్కినేనికి కమల్ వాయిస్?

దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వ నాయకుడు కమలహాసన్ వాయిస్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరమైన అంశం ఇదే. అక్కనేనికి కమల్ వాయిస్ అవసరమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏఎన్‌ఆర్ చివరి చిత్రం మనం ఏఎన్‌ఆర్‌తో పాటు ఆయన కొడుకు, ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కొడుకు యువ నటుడు నాగచైతన్య కలసి నటించిన చిత్రం మనం. శ్రీయ, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిం ది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలోకి అనువాదం కానుంది. తమిళంలో అక్కినేని పాత్రకు కమలహాసన్‌తో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
 
 అదే విధంగా నాగార్జున పాత్రకు నటుడు మాధవన్ డబ్బింగ్ చెబితే బాగుంటుందనుకుంటున్నట్లు సమాచారం. కమలహాసన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా గౌరవం. ఆయన ఇటీవల మనం చిత్రం చూసి చాలా గొప్ప చిత్రం అంటూ ప్రశంసించడంతో పాటు ఏఎన్‌ఆర్ తన మానసిక గురువు అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఆయనకే వాయిస్ ఇచ్చే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయం. మరి కమల్ ఏఎన్‌ఆర్‌గా పాత్రకు డబ్బింగ్ చెబితే మనం చిత్రానికి అది మరింత ప్రత్యేక అంశంగా నిలిచిపోతుంది. మరో విషయం ఏమిటంటే మనం చిత్రం తెలుగు వెర్షన్ ఇప్పటికీ చైన్నైలోని ప్రముఖ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement