సాగర తీరంలో బాలయ్య సరాగాలు | Balakrishna's Legend Movie Shooting in Vizag | Sakshi
Sakshi News home page

సాగర తీరంలో బాలయ్య సరాగాలు

Published Tue, Nov 19 2013 12:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సాగర తీరంలో బాలయ్య సరాగాలు - Sakshi

సాగర తీరంలో బాలయ్య సరాగాలు

 సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలకృష్ణ చేసిన సినిమాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా లేవనే చెప్పాలి. బాలయ్య సినిమాకు అన్నీ కుదిరితే.. ఆ సక్సెస్ ప్రభావం బాక్సాఫీస్‌పై చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకు ఆయన గత విజయాలే నిదర్శనాలు. ప్రస్తుతం బాలకృష్ణతో బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘లెజెండ్’ సినిమా కథ... బాలయ్య అభిమానులు పండగ చేసుకునే రీతిలో చాలా శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. మొన్నటివరకూ సాగరతీరంలో బాలయ్యపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.
 
  ప్రస్తుతం బాలయ్య, కథానాయిక రాధికా ఆప్టేపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. ఈ నెల 21 దాకా ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 23 నుంచి డిసెంబర్ 3 వరకూ జరిగే చిత్రీకరణతో ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తవుతుంది. జనవరిలో బాలకృష్ణ, చిత్ర కథానాయికలతో పాటు ఓ గెస్ట్ కథానాయికపై చిత్రీకరించే పాట ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని యూనిట్ వర్గాల  భోగట్టా. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్‌సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement