హర్లే డెవిడ్సన్ బైక్పై బాలయ్య | Nandamuri Balakrishna to drive custom-made Harley Davidson Motorbike | Sakshi
Sakshi News home page

హర్లే డెవిడ్సన్ బైక్పై బాలయ్య

Published Tue, Nov 5 2013 5:06 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

హర్లే డెవిడ్సన్ బైక్పై బాలయ్య - Sakshi

హర్లే డెవిడ్సన్ బైక్పై బాలయ్య

చెన్నై: హీరో నందమూరి బాలకృష్ణ హర్లే డెవిడ్సన్ మోటార్ బైక్పై దూసుకుపోనున్నాడు. 'లెజెండ్' సినిమాలో బాలయ్య ఈ ఫీట్ చేయనున్నాడు. ప్రత్యేకంగా తయారుచేసిన పసుపు రంగు హర్లే డెవిడ్సన్ బైక్పై ఆయన ఓ పాటలో కనిపించనున్నారు. దీన్ని తయారుచేయడానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు.  'లెజెండ్'లో ఓ పాట కోసం దీన్ని స్పెషల్గా తయారు చేయించారని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.

బాలకృష్ణ సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలు. 'లెజెండ్' సంక్రాంతికి సందడి చేయనున్నాడు. 'సింహా' తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement