క్లా..క్లా.. క్లాస్‌ మ..మ..మాస్‌ | bellamkonda srinivas new movie look released | Sakshi
Sakshi News home page

క్లా..క్లా.. క్లాస్‌ మ..మ..మాస్‌

Published Mon, Jan 2 2017 11:35 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

క్లా..క్లా.. క్లాస్‌ మ..మ..మాస్‌ - Sakshi

క్లా..క్లా.. క్లాస్‌ మ..మ..మాస్‌

మాస్‌ ప్రేక్షకులను ఎలా అలరించాలో.. క్లాస్‌ హీరోలను మాస్‌కు ఏ విధంగా దగ్గర చేయాలో తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను. ‘భద్ర‘ నుంచి ‘సరైనోడు‘ వరకూ హీరోలతో పాటు వాళ్ల పాత్రలను బోయపాటి చూపించిన విధానమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకూ చేసిన రెండు చిత్రాల్లో దాదాపు క్లాస్‌గానే కనిపించిన బెల్లంకొండ శ్రీనివాస్‌ను తాజా చిత్రంలో అందుకు భిన్నంగా చూపించనున్నారు బోయపాటి. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు బెల్లంకొండ  శ్రీనివాస్‌ బర్త్‌డే సందర్భంగా  లుక్‌ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘హీరో పాత్ర క్లాస్‌ ఆడియన్స్‌కి, మాస్‌ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది.

ఇది ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. హైదరాబాద్, వైజాగ్‌లలో జరిపిన షెడ్యూల్‌తో 20 శాతం పూర్తయింది. ఈ షెడ్యూల్‌లో శ్రీనివాస్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, జగపతిబాబు, శరత్‌ కుమార్, ధన్యా బాలకృష్ణ పాల్గొన్నారు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత మేం నిర్మిస్తోన్న ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement