వైజాగ్‌లో వైభవంగా...
సెలైంట్ గా ‘సరైనోడు’ పాటలు మార్కెట్లోకి వచ్చేశాయ్. కానీ, అభిమానులే వేడుక చేసి ఉంటే బాగుండేదని అనుకున్నారు. ఆ కొరతను తీర్చేయనుంది ‘సరైనోడు’ చిత్రబృందం. ఈ నెల 10న అత్యంత భారీ ఎత్తున ఆడియో సెలబ్రేషన్స్ చేయనున్నారు. ఈ వేడుకను విశాఖపట్నంలో చేయడానికి సర్వ సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, క్యాథెరిన్ త్రెస్సా ముఖ్య తారలుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఇక.. వైజాగ్‌లో జరగబోయే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి వైజాగ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ-‘‘కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా షూటి ంగ్లు జరగాలని, ఇక్కడ కూడా పరిశ్రమ స్థిరపడాలని కోరకుంటున్నాను. ‘సరైనోడు’ ఫంక్షన్ ఘనంగా వైజాగ్‌లో చేస్తున్నందకు చిత్ర నిర్మాతకు ధన్యవాదాలు.
సినిమా షూటింగ్స్‌కు ఇక్కడ సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇస్తాం’’ అని అన్నారు. ‘‘బన్నీకి వైజాగ్‌తో మంచి అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అతి పెద్ద ఫంక్షన్ ఇది. బన్నీతో పాటు ముగ్గురు హీరోయిన్స్ హాజరు కానున్నారు. ఇంకా ఇతర యూనిట్ సభ్యులు పాల్గొంటారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ షోలో పెర్ఫార్మ్ చేయనున్నాడు’’ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు.