శ్రీను సెంటిమెంట్‌తో...
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. దర్శకుడు బోయపాటి శ్రీనుకీ ఓ సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి సినిమా మొదటి రోజు సన్నివేశాన్ని హైదరాబాద్, గచ్చిబౌలిలోని వనదేవత గుడిలో చిత్రీకరిస్తారు. ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణను ఆదివారం వనదేవత గుడిలో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో, డిసెంబర్ 3 నుంచి 45 రోజుల పాటు విశాఖలో చిత్రీకరణ చేసి, ఫిబ్రవరిలో కీలక సీన్లు, పాటలు తీయడానికి బ్యాంకాక్ వెళ్లనున్నారు.