భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను హీరో రామ్ కంప్లీట్ చేశారు. హీరో రామ్, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో ఓ యాక్షన్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్. ఇటీవల మొదలైన ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తయింది. ‘‘24 రోజుల చిత్రీకరణతో ఈ సినిమా క్లైమాక్స్ పూర్తయింది.
ఇది క్లైమాక్స్ కాదు.. క్లైమ్యాక్స్’’ అని ట్వీట్ చేశారు రామ్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సంతోష్ డిటాకే.
Comments
Please login to add a commentAdd a comment