బోయపాటి యాక్షన్... బన్నీ వినోదం... | Boyapati started by new movie with Bunny | Sakshi
Sakshi News home page

బోయపాటి యాక్షన్... బన్నీ వినోదం...

Published Fri, Jun 12 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

బోయపాటి యాక్షన్...  బన్నీ వినోదం...

బోయపాటి యాక్షన్... బన్నీ వినోదం...

కథానాయకుడు అల్లు అర్జున్ కొత్త సినిమా పనులు వేగం పుంజుకున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు వారి అబ్బాయి నటించే ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని గీతా ఆర్ట్స్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. నిజానికి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత కాస్తంత విశ్రాంతి తీసుకొని, భార్యాబిడ్డలతో సేద తీరుతున్నారు అల్లు అర్జున్.
 
 ఆయన సకుటుంబంగా ఇప్పుడు విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. ఫలితంగా, ఈ లాంఛనప్రాయపు షూటింగ్ ప్రారంభానికి ఈ యువ కథానాయకుడు అందుబాటులో లేరు. అయితే, మంచి ముహూర్తాలు మళ్లీ దగ్గరలో లేకపోవడంతో, హీరో అల్లు అర్జున్ అందుబాటులో లేకపోయినప్పటికీ, చిత్ర యూనిట్ లాంఛనంగా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.
 
 వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ‘‘మరో రెండు రోజుల్లో షెడ్యూల్ ప్లానింగ్, వివరాలు పక్కాగా ఖరారవుతాయి’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. బోయపాటి శ్రీను మార్కు ఎమోషనల్ యాక్షన్ సన్నివేశాలు, అల్లు అర్జున్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ కలగలసిన చిత్రంగా ఈ తాజా సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement