
చిట్టిబాబు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత త్వరగా ఆ పాత్రను మరిచిపోలేము. ఆ పాత్రకు ప్రాణం పోసిన రామ్‌చరణ్‌ను మరిచిపోలేము. చిట్టిబాబు పాత్రలో చెర్రీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విదేశాల్లో, హైదరాబాద్‌లో రెండు షెడ్యుల్స్ కంప్లీట్ చేసిన చెర్రీ.. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలను ఆయన సతీమణి ఉపాసన అప్‌డేట్స్ ఇస్తుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న చెర్రీ ఫోటోను షేర్ చేశారు ఉపాసన. కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడో మాత్రం చెప్పలేదు.
Comments
Please login to add a commentAdd a comment