బాలకృష్ణకు జోడీగా రాధిక ఆప్టే
బాలకృష్ణకు జోడీగా రాధిక ఆప్టే
Published Sat, Sep 21 2013 1:02 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో ప్రధాన కథానాయిక ఎవరు? గత కొన్నాళ్లుగా అటు పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ ఇదే ప్రశ్న. ఎట్టకేలకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇక్కడున్న స్టిల్ చూశాక ఆ సమాధానమేంటో మీకూ అర్థమయ్యే ఉంటుంది.
రక్తచరిత్ర, ధోని చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే ఇందులో బాలయ్యతో జతకట్టనున్నారు. ఈ పాత్ర అభినయానికి ఆస్కారమున్నది కావడంతో ఏరికోరి మరీ రాధిక ఆప్టేను ఎంపిక చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌లో రాధిక పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ -‘‘ఇందులోని కథానాయిక పాత్రకు రాధిక ఆప్టే యాప్ట్.
అందుకే ఆమెను ఎంపిక చేశాం. ఇందులో మరో నాయికగా సోనాల్‌చౌహాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైనదే. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ‘సింహా’ను మించే సినిమా ఇది’’ అని చెప్పారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement