ఏజెన్సీ సర్టిఫికెట్‌కు రూ. 10 వేలు ? | Rs. 10 thousand for Agency certificate | Sakshi
Sakshi News home page

ఏజెన్సీ సర్టిఫికెట్‌కు రూ. 10 వేలు ?

Published Mon, Sep 12 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

Rs. 10 thousand for Agency certificate

  •  ఉపాధ్యాయులకు ఏజెన్సీ సర్టిఫికెట్ల గుబులు 
  • ఏటూరునాగారం : ఏజెన్సీలో ఉపాధ్యాయుల పోస్టు పొందాలంటే ఏజెన్సీ సర్టిఫికెట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే గిరిజన సంక్షేమశాఖలో ఉపాధ్యాయ పోస్టులు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో కొంత మంది నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను పొందారని తెలుస్తోంది. ఐటీడీఏలోని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేలు చొప్పున వసూలు చేసి నకిలీ ఏజెన్సీ సర్టిఫికెట్లను తయారు చేసి అభ్యర్థులకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.
     
    ఇటీవల గిరిజన సంక్షేమశాఖ విభాగంలో కలకలం రేపిన తప్పుడు నిబంధనల ఉపాధ్యాయుల నియామకం విషయంలో కూడా ఏజెన్సీ సర్టిఫికెట్లు నకిలీవి ఉన్నట్లు తెలుస్తోంది. నకిలీల సరిఫికెట్లుగా గుర్తించే డీఎల్‌సీ కమిటీ డీఎస్సీ- 2013 ఎంపిక జాబితాను  రద్దు చేసింది. అయితే కొంత మంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విభాగంలో డీటీల ద్వారా చేయించారు. వెరిఫికేషన్‌ చేయించి ఇవి నకిలీలు కావని, అసలు సర్టిఫికెట్లే అని ధ్రువీకరించి గిరిజన సంక్షేమశాఖకు అందజేశారు. ఒక్కసారి ఒక అభ్యర్థి సర్టిఫికెట్‌ డుప్లికేట్‌ అని తేలిన తర్వాత అతడు ఏజెన్సీవాసుడే అని ఏజెన్సీ ధ్రువీకరణ పత్రం ఇవ్వడం బాధాకరం. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జారీ చేసిన వ్యక్తులు, ఇందుకు సహకరించిన ఉద్యోగస్తులపై కూడా చర్యలు చేపట్టాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు. 
     
    సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలి
    ఆగబోయిన రవి, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి. 
    గిరిజన సంక్షేమశాఖలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలి. నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన వ్యక్తులపై కూడా చర్యలు చేపట్టాలి.  
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement