నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య | Nizamabad Rural MRO Giridhar Rao Committed Suicide | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌ ఆత్మహత్య

Oct 3 2019 12:25 PM | Updated on Oct 3 2019 12:53 PM

Nizamabad Rural MRO Giridhar Rao Committed Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ఓ తహశీల్దార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌లో కలకలం సృష్టించింది. నిజామాబాద్‌ రూరల్‌ తహసీల్దార్‌గా ఉన్న గిరిధర్‌రావు..ఆర్యనగర్‌లో అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న  జిల్లా కలెక్టర్‌, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. నల్లగొండ జిల్లా రామగిరి మండలానికి చెందిన గిరిధర్‌.. ఏడాది క్రితమే నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో ఉండగా..ఆయన ఒక్కరే ఆర్యనగర్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement