ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం | TDP MLA Bollineni Rama Rao Serious On Sub Collector At Renigunta Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం

Published Fri, Jul 27 2018 9:44 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

చిత్తూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్‌ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్‌.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్‌ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్‌ ఎంట్రెన్స్‌ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్‌ అధికారులు వేచి ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement