bollineni ramarao
-
SPSR Nellore: డబ్బు మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా?
టీడీపీలో టికెట్ల ఆట మొదలైంది. నేతలు ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులమంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని, తనని కాదని మరొకరికి ఇవ్వరని చెబుతుండడం గమనార్హం. నేతల సంగతి అటుంచితే కేడర్ మాత్రం టికెట్ ఎవరికిస్తారో అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నారు. ఏ నాయకుడి వద్దకు వెళితే మిగిలిన వారు ఏమనుకుంటారోనని అందరికీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో టీడీపీ ఇంకా తమ అభ్యర్థులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేకపోయినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ దఫా దండిగా పార్టీ ఫండ్‌తోపాటు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసే వారికే టికెట్ ఇస్తామంటోందని సమాచారం. పైకం తూకంతోనే టికెట్ల కేటాయింపులు ఉంటాయన్న సంకేతంతో ఉదయగిరి టీడీపీలో అలజడి రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు సాయపడుతున్న తనకే టికెట్ ఖాయం అంటూ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగైదు రోజులుగా ఉదయగిరి టికెట్ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే ఓకే అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను ఇప్పటికే లోకేశ్‌కు డబ్బు సంచులు అందించానని, టికెట్ తనకే అంటూ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇందులో నిజం ఉంటుందని పార్టీ కేడర్ కూడా బలంగా విశ్వసిస్తోంది. మరి ఆ ఇద్దరి పరిస్థితి అలా ఉంటే వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకే టికెట్ అని చెబుతుందగా, బీసీ సామాజికవర్గం నుంచి ఈ దఫా తనకే టికెట్ వస్తుందంటూ బీసీ నేత చెంచలబాబు కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బుకే ప్రాధాన్యమా.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే అవకాశం ఉంటుందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాకర్లకు లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలతోపాటు ఆశీస్సులు కూడా ఉన్నట్లు సమాచారం. కాకర్ల విదేశాల్లో తనకున్న పరిచయాలతో పార్టీ ఫండ్ కోసం భారీగా వసూలు చేసి ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే లోకేశ్ వద్ద హామీ కూడా పొందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. లోకేశ్ హామీతోనే సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానంటూ కాకర్ల బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా అధిష్టానం తనకే టికెట్ ఓకే చేసిందంటూ ప్రచారం ప్రారంభించడంతోపాటు చినబాబు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా వింజమూరు ప్రాంతంలో భారీగా కార్యకర్తలను పోగేసి విందు ఇచ్చారని తెలుస్తోంది. టికెట్ నాదేనంటూ సందేశమిచ్చి తనకు సాయం చేయాలని కోరడంతో ఇప్పుడు ఉదయగిరి టీడీపీలో టికెట్ల లొల్లి కాక పుట్టిస్తోంది. కాకర్లది కాకమ్మ కబుర్లేనా.. టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం సీటు తనదేనంటూ స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో తాను ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి సాయం చేశానని చెబుతుండడం గమనార్హం. లోకేశ్‌ను తన పలుకుబడితోనే బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లానని, తన సత్తా ఏంటో చినబాబుకు తెలుసునని చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా అంటూ బొల్లినేని బహిరంగంగానే చెబుతున్నారు. కాకర్లదంతా కాకమ్మ కబుర్లేనంటూ బహిరంగ సమావేశంలోనే చెప్పడం గమనార్హం. గతంలో లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఉదయగిరి దరిదాపుల్లో కూడా కాకర్లను రానివ్వకుండా చేశానని చెబుతున్నట్లు తెలుస్తోంది. తనను కాదని కాకర్లకు సీటు ఇచ్చే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేరని బొల్లినేని చెబుతున్నట్లు సమాచారం. అయోమయంలో కేడర్ ఉదయగిరి టీడీపీలో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓవైపు బొల్లినేని, కాకర్ల ఉదయగిరి టికెట్ తమదేనంటూ ప్రచారం చేసుకొంటుండగా, మరోవైపు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకు హామీ ఇవ్వడంతోనే పార్టీలోకి వచ్చానని చెబుతున్నారు. చివరకు తనకే టికెట్ ఇస్తారని, ప్రత్యర్థిగా తన సోదరుడే ఉంటారని, అందుకోసమైనా టికెట్ తనకే కేటాయిస్తారంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పి.చెంచలబాబుయాదవ్ ఈ ప్రాంతంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారని, బీసీ కేటగిరీలో తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. టీడీపీ కేడర్ ఆ నలుగురు నేతల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయోమయంలో ఉన్న కేడర్ ప్రస్తుతం ఎవరి వద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారోనని నేతలకు దూర దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. -
నా వల్ల ఇబ్బందులు పడి ఉంటే క్షమించండి!.. టికెట్ నాకే ఇప్పించండి
బద్ధ శత్రువులుగా ఉండి ఉదయగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ ముగ్గురు నేతలు ఇప్పుడు ఒక్కటైపోయారు. తమ రాజకీయ అవసరాల కోసం కలిసిపోయారు. వారే కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి. దశాబ్దాలపాటు ఆదరించిన పార్టీకి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వెన్నుపోటు పొడిచి టీడీపీ నేతలతో చేతులు కలిపారు. నైతిక విలువలకు పాతరేసి ఆ ముగ్గురు నేతలూ ఏకం కావడంతో ప్రజల్లో పలచబడ్డారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరనేది నానుడి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండాపోయాయి. ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన, వహిస్తున్న కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. కంభం, బొల్లినేని ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఆ ఇద్దరూ ఎప్పుడూ ఒకే వేదికను పంచుకున్న దాఖలాలే లేవు. ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించారు. ఒకరిపై ఒకరు పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి కంభం, బొల్లినేనితో బద్ధ వైరం ఉండేది. వీరిలో ఎవరైనా మేకపాటిని విమర్శిస్తే.. నియోజకవర్గంలోని అన్ని మండలాల నేతలతో ప్రెస్మీట్లు పెట్టించి మరీ తిట్టించారు. మేకపాటి బహిరంగ వేదికలపై బొల్లినేనిపై అవినీతి ఆరోపణలు చేయడమే కాకుండా తన క్యాడర్‌తోనూ చేయించారు. ఇక కంభంపై అయితే మేకపాటి గతంలోనే విమర్శలు, ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కుటుంబంతో ఎదిగి.. జిల్లాలో మేకపాటి కుటుంబానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అత్యంత ప్రాధాన్యం కల్పించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం వారికి అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి స్వార్థ రాజకీయాలు చేసి స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ పరిణామాలు ముందుగానే గ్రహించిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన సోదరుడైనప్పటికీ చంద్రశేఖరరెడ్డిని దూరం పెట్టారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలకు తెరతీసిన చంద్రశేఖర్‌రెడ్డి తన గ్రాఫ్ పడిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ రాదనే అనుమానంతో రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి, ఆదరించిన ప్రజలను విస్మరించి టీడీపీతో చేతులు కలిపారు. పార్టీ క్యాడర్ దూరం రాజకీయ అవసరాల కోసం ఒకరికొకరు దూషించుకున్న చంద్రశేఖర్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, బొల్లినేని వెంకటరామారావు ఇప్పుడు ఒక వేదికపైకి రావడంతో వీరితో అంటకాగిన పార్టీ క్యాడర్ దూరంగా వెళ్లిపోతున్నారు. రాజకీయ విమర్శలు, అవినీతి ఆరోపణలు, భౌతికదాడులు చేసిన చంద్రశేఖర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని లోలోనే టీడీపీ క్యాడర్‌తోపాటు అధికారపార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి. ఈ పరిణామాలతో ప్రజల్లోనూ ఆ ముగ్గురు నేతలు పలచబారారు. టీడీపీలో బీసీ వాదన వైఎస్సార్సీపీ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా గత ఎన్నికల్లో జిల్లాలో ఒక ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. తర్వాత రాజ్యసభ టికెట్ బీసీలకు ఇచ్చింది. కానీ టీడీపీ మాత్రం బీసీలను ఉపయోగించుకోవడమే తప్ప వారికి పదవులు ఇవ్వడం లేదనే వాదన ఉంది. తాజాగా ఉదయగిరిలో బీసీ నేతగా ఉన్న చెంచలబాబు యాదవ్ టీడీపీ టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే టికెట్ తమకే ఇవ్వాలని ఆయన పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. వలస నేతల రాకతో టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సిందే. కంభంతో కలిసి నిన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కంభం విజయరామిరెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి కలిసి గతం..గతః అంటూ తనకు ఆశీస్సులు కావాలని కాళ్లబేరానికి వెళ్లాడని, తన వల్ల ఏవిధంగా అయినా ఇబ్బందులు పడి ఉంటే క్షమించమని ప్రాధేయపడ్డాడని తెలిసింది. ఈ పరిణామాలను చూసి టీడీపీ శ్రేణులు నివ్వెరపోయారని సమాచారం. అవసరం కోసం దిగజారి ఈ దఫా ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపని బొల్లినేని గతంలోనే పార్టీ అధిష్టానానికి సంకేతం పంపారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థిత్వం ఇప్పిస్తానంటూ ప్యాకేజీ మాట్లాడుకున్న ఇద్దరు నేతలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. కాని ఆ నేతలను చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో చినబాబు లోకేశ్ కాకర్ల సురేష్‌ను రంగంలోకి దింపడంతో ఆయన టికెట్ నాదేనంటూ ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీలో టికెట్ల లొల్లి జరుగుతున్న క్రమంలో టికెట్ తనకిస్తే పోటీ చేస్తానంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రంగంలోకి దిగారు. నైతిక విలువలకు పాతరేసిన చంద్రశేఖర్‌రెడ్డి తనకు రాజకీయ శత్రువులుగా ఉన్న బొల్లినేని, కంభం ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు కోరారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
పులిచింతల ప్రాజెక్టు: పాత పాపాలే శాపాలు!
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నిర్వాకాలు పులిచింతల ప్రాజెక్టు, కృష్ణా డెల్టా రైతులనూ ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడా లేని రీతిలో ఆర్బిట్రేషన్ నిబంధనను ఈ కాంట్రాక్టు ఒప్పందంలో చేర్చడం ద్వారా బొల్లినేని ఆదిలోనే ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు బాటలు వేశారు. డిజైన్ మారడం వల్ల చేసే పని పరిమాణం పెరిగితే.. అందుకు అదనంగా బిల్లులు చెల్లించేందుకు సర్కార్ అంగీకరించకుంటే ఆర్బిట్రేషన్ (వివాదాల పరిష్కార మండలి)కి పంపుతారు. ఈ కాంట్రాక్టు ఒప్పందంలో ఆర్బిట్రేషన్‌లో ఒక సభ్యుడిని బొల్లినేని, మరొక సభ్యుడిని జలవనరుల శాఖ, ఇంకో సభ్యుడిని ఆ ఇద్దరూ ఎన్నుకునేలా నిబంధన చేర్చడం గమనార్హం. ఈలోగా 2004 ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టే వరకూ పులిచింతల ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత పనులను పరుగులు పెట్టించారు. ఆర్బిట్రేషన్‌ను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం బొల్లినేని రామారావు చీటికిమాటికీ పేచీ పెడుతుండటంతో జలవనరుల శాఖలో చేపట్టే పనుల్లో ఆ నిబంధనను వైఎస్సార్ రద్దు చేశారు. పనుల్లో జాప్యం వల్ల తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని కాంట్రాక్టర్ పేచీకి దిగడంతో ఆర్బిట్రేషన్ సూచనల మేరకు రూ.5.65 కోట్ల పరిహారాన్ని అప్పట్లో సర్కార్ చెల్లించింది. అయినప్పటికీ ఆర్బిట్రేషన్ నిబంధనను అడ్డుపెట్టుకుని అదనపు బిల్లుల కోసం మరోసారి పేచీ పెట్టారు. పులిచింతల స్పిల్‌వేను 500.25 మీటర్లు పెంచారని.. గేట్లను 32 నుంచి 24కు తగ్గించారని.. భూసేకరణలో జాప్యం వల్ల ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వాలని.. ఇలా 27 అంశాల్లో అదనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని 2012లో బొల్లినేని కోరారు. దీన్ని పరిశీలించిన డీఏబీ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రతిపాదనలు చేశారు. మొత్తమ్మీద రూ.199.96 కోట్లను అదనంగా చెల్లించాలంటూ 2013 అక్టోబర్ 3న ప్రతిపాదించారు. డీఏబీ–2 ప్రతిపాదనలను ముగ్గురు ఐఏఎస్‌లతో నియమించిన అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీకి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పంపారు. కాంట్రాక్టర్‌కు గరిష్టంగా రూ.72 కోట్లను చెల్లించడానికి నిపుణుల కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. కోర్టులో కేసును నీరుగార్చి... లోపాయికారీగా సహకరించి తన ప్రభుత్వాన్ని రక్షించిన చంద్రబాబు సూచనల మేరకు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు నిధులు ఇవ్వాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒత్తిడి చేయడంతో ఆ మేరకు చెల్లింపులు చేసేలా జలవనరుల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తడంతో మచిలీపట్నం కోర్టు పులిచింతల కాంట్రాక్టర్‌కు అదనపు బిల్లుల చెల్లింపుపై సుదీర్ఘ విచారణ జరిపింది. కాంట్రాక్టర్ ప్రస్తావించిన 27 అంశాలను తిప్పికొట్టేలా సమర్థ వాదనలు వినిపించకుండా గత సర్కారు అధికారులపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా కాంట్రాక్టర్‌కు అనుకూలంగా మచిలీపట్నం కోర్టు 2016 జూన్ 2న తీర్పిచ్చింది. దాని ప్రకారం రూ.199.96 కోట్లను 2013 అక్టోబర్ 3 నుంచి 15% వడ్డీతో కాంట్రాక్టర్‌కు చెల్లించాలి. వడ్డీతో కలిపి ఆ మొత్తం రూ.399.34 కోట్లకు చేరుకుంది. రూ.199.67 కోట్లు దోచిపెట్టిన చంద్రబాబు.. మచిలీపట్నం కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసేందుకు అనుమతించాలంటూ 2016 జూన్ 2 నుంచి 2018 అక్టోబర్ 1 వరకూ జలవనరుల శాఖ అధికారులు పలుదఫాలు నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు, నాటి మంత్రి దేవినేని ఉమాలకు ప్రతిపాదనలు పంసినా న్యాయ సలహా పేరుతో కాలయాపన చేశారు. చివరకు వ్యూహాత్మకంగా 2018 అక్టోబర్ 23న హైకోర్టును ఆశ్రయించడానికి గత సర్కార్ అనుమతి ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయకుండా 766 రోజులు ఏం చేశారంటూ నాడు హైకోర్టు ప్రశ్నించింది. కేసును విచారించాలంటే కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అంటే రూ.199.67 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఈమేరకు 2019 జనవరి 1న టీడీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొత్తాన్ని ఎలాంటి బ్యాంకు గ్యారంటీలు చూపకుండానే డ్రా చేసుకున్న బొల్లినేని–చంద్రబాబు ద్వయం అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున వెదజల్లినట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బొల్లినేని ఇలా చంద్రబాబు దన్నుతో ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్లే పులిచింతల 16వ గేటు ఊడిపోయిందని స్పష్టమవుతోంది,. -
బీదపై బొల్లినేని అప్పుల బండ
సాక్షి, నెల్లూరు: ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’ ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అసమ్మతి తలనొప్పి.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు సంకటంగా మారింది. ఉదయగిరి నియోజవర్గంలో చేపట్టిన ఫైబర్ చెక్‌డ్యామ్ పనులను బొల్లినేని స్థానిక నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌గా ఇచ్చి చేయించారు. ఆ బిల్లులను వసూలు చేసుకుని తన ఖాతాలో వేసుకున్నాడే కానీ.. పనులు చేసిన నేతలకు డబ్బులు ఇవ్వలేదు. తమ డబ్బులు ఎగనామం పెట్టిన ఎమ్మెల్యే బొల్లినేనికి ఎన్నికల సమయంలో సదరు నేతలు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే కానీ ఎన్నికల్లో పని చేయమని తెగేసి చెప్పడంతో వారిని సర్దుబాటు చేసే వ్యవహారంలో భాగంగా బొల్లినేని అప్పుల బండను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావు నెత్తినేసుకున్నాడు. బొల్లినేని బాధితులను నెల్లూరులోని తమ కార్యాలయం వద్దకు పిలిపించుకుని నగదు సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గంలోని రూ.10 లక్షల లోపు బకాయిలు ఉన్న వారిని పిలిపించుకుని వారికి సగం నగదు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో బకాయిలు ఇచ్చే వరకు ఈ ఎన్నికల్లో బొల్లినేనికి పని చేయమని వారు తెగేసి చెబుతుండడంతో వారిని ఒప్పించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రూ.9 కోట్ల బకాయిలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కొత్త టెక్నాలజీ పేరుతో దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో పైబర్చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. మహారాష్ట్రలోని పైబర్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఉపయోగ పడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నియోజక వర్గంలో పైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మాణాలకు çపూనుకున్నారు. ఖర్చు తక్కువతో నిర్మాణాలు జరిగే పైబర్ చెక్ డ్యామ్‌ల నిర్మాణాల్లో అంచనా భారీగా పెంచి వేయించారు. తన సొంత కంపెనీ పేరుతోనే టెండర్లు దక్కించుకుని ఆయా చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలకు పంపకాలు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించారు. కానీ ఆయా బిల్లులు పూర్తిస్థాయిలో తీసుకున్న బొల్లినేని రామారావు సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదు. దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు ఇవ్వకుండా మూడేళ్లగా వారిని ముప్పు తిప్పులు పెట్టారు. వీరే కాకుండా మహారాష్ట్ర, ఏపీలో కూడా బొల్లినేని కంపెనీ నుంచి బిల్లులు రావాల్సిన జాబితా చాలానే ఉంది. సబ్ కాంట్రాక్టర్లకు రావాల్సిన నగదు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఎమ్మెల్యేపై వారు పోరాటం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాధితులంతా ఏకమై బొల్లినేని వ్యవహారంపై తీవ్రంగా పోరాటం చేశారు. ఒకనొక దశలో సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించి వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనికి టికెట్ ఇవ్వకుండా చివరి వరకు జాప్యం చేసినా, కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ ఇచ్చారు. కానీ బొల్లినేని బాధితులు మాత్రం మా బిల్లులు ఇస్తే కానీ ఆయనకు పని చేయమని తెగేసి చెప్పడంతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడంతో మింగుడు పడని బొల్లినేని ఈ వ్యవహారం చక్కదిద్దాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. ఆయన నియోజకవర్గంలోని బొల్లినేని బాధితులను పిలిపించుకుని వారికి కొంత సర్దుబాటు చేసి పంపే ప్రయత్నాలు మమ్మురం చేశారు. దీంతో బొల్లినేని నగదు సర్దుబాటు చేస్తున్నారని తెలియగానే బాధితులు క్యూ కట్టారు. కేవలం నియోజకవర్గానికి చెందిన బాధితులను మాత్రం పిలిపించుకుని సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారికి పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తునారు. -
బొల్లినేని బడా మోసం!
సాక్షి, నెల్లూరు: ‘నేను ఎవరినీ మోసం చేయలేదు. నాగపూర్‌లో నాపై ఏసీబీ కేసు మాత్రమే నమోదైంది, ఆ కేసు కూడా మూసేశారు. నాకు రెండు బ్యాంకుల్లోనే ఖాతాలున్నాయి. సబ్‌కాంట్రాక్టర్లకు అప్పులు కూడా లేను.. నాపై అసత్యప్రచారం చేస్తూ బురదజల్లుతున్నారు’ ఇదీ ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఇటీవల నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నమాటలు. వాస్తవంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఎమ్మెల్యే బొల్లినేని చేసిన ఆర్థిక మోసాలను వెల్లడించేందుకు సాక్షి కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నో సూట్ కేసు కంపెనీలు స్థాపించి బ్యాంక్‌లను బురిడీ కొట్టించిన వైనంతో పాటు సబ్ కాంట్రాక్టర్లను మోసం చేసి బిల్లులు ఎగ్గొట్టిన అంశంపై పూర్తి ఆధారాలతో సహా వెల్లడించారు. బొల్లినేని మోసం ఇలా.. మూడు దశాబ్దాల క్రితం శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీతో ప్రారంభమైన వ్యాపారం ఎన్నో ఆర్థిక మోసాలతో విస్తరించినట్లు తెలిసింది. తన సొంత కంపెనీతో పాటు బ్యాంక్‌లను బురిడీ కొట్టించి రుణాలు పొందేందుకు ఎన్నో సూట్ కేసు కంపెనీలు, లెటర్‌హెడ్ కంపెనీలు సృష్టించారు. తన కుటుంబ సభ్యులను డైరెక్టర్లుగా ఉంచి దాదాపు 37 కంపెనీలను జిల్లాలోని కలిగిరి మండలం పెద్దపాడు, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగపూర్‌లోని తన నివాసాల అడ్రస్‌లతో ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. అష్ట వినాయక ప్రూట్గ్రోయర్స్ అండ్ ప్రాసెస్ లిమిటెడ్ కంపెనీకి అనుబంధంగా మరో తొమ్మిది కంపెనీలు, గ్లోబుల్ పాలిఫైబర్స్ ప్రైవే టు లిమిటెడ్, కాకతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కంపెనీకి అనుబంధంగామరో తొమ్మిది కంపెనీలు, చైతన్యజ్యోతి వెజిటబుల్స్ అగ్రిఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఎన్కే కన్స్ట్రక్షన్, సిగ్మా కన్స్ట్రక్షన్, శ్రీనివాస టెక్నోక్రాప్ట్, శ్రీనివాస టెక్నాలజీస్, హలో డస్ట్‌బిన్ ప్రైవేటు లిమిటెడ్, ఇలా ఎన్నో కంపెనీలు సృష్టించి తన ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్లు ఆధారాలు చూపించారు. బ్యాంక్‌లకు బురిడీ మహారాష్ట్రతో పాటు ఏపీలో బంజరు, సాగు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ఆయా భూములకు రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ చూపించి రిజిస్ట్రేషన్ చేయిస్తారు. ఆ భూములను తమ సూట్‌కేసు కంపెనీలు, లెటర్‌హెడ్ కంపెనీల ద్వారా కొనుగోలుచేసినట్లు చూపి బ్యాంక్ రుణాలు పొందుతారు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్, ఎల్అండ్టీ ఫైనాన్స్, ఐసీఐసీ బ్యాంక్, దిషామ్రాయ్ విటల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, రిలిజర్ పిన్వెస్ట్ లిమిటెడ్, దియావత్మాల్ అర్బన్ బ్యాంక్‌లలో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారు. ఆయా బ్యాంకుల్లో దాదాపు రూ.100కోట్లకు పైగా రుణాలు పొందినట్లు తెలిసింది. అలాగే పలు బ్యాంక్‌ల గ్యారెంటీలతో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్లో(ఎన్ఎస్ఐసీ) దాదాపు రూ.100 కోట్లు వరకు రుణం తీసుకున్నట్లు తెలిసింది. లా ట్రిబ్యునల్ వరకు వెళ్లిన బొల్లినేని వ్యవహారం బొల్లినేని ఆర్థిక వ్యవహారం విషయం లా ట్రిబ్యునల్ వరకు వెళ్లింది. శ్రీనివాస కనస్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నాగపూర్‌లో రాజేష్ స్టీల్ అండ్ వైర్ ఇండస్ట్రీస్ కంపెనీ దగ్గర నిర్మాణాలకు సంబంధించిన పలు వస్తువులు కొనుగోలు చేసి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ కంపెనీ ప్రతినిధులు ముంబయిలోని లాట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో టీసీపీ 982–2017లో కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల విషయం లాట్రిబ్యునల్వరకు వెళ్లడంతో హడావుడిగా కేసును పరిష్కరించుకున్నట్లు తెలిసింది. పోలీసు కేసుల వరకు.. మహారాష్ట్రలోని విదర్భ కుంభకోణంపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశంమైంది. శ్రీనివాస కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అంచనాలు పెంచి పనులు చేసిన విషయం ఏసీబీ నిర్ధారించడంతో దాదాపు రూ.800 కోట్ల పనులను కూడా రద్దుచేశారు. దాంతో పాటు సబ్‌కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగనామం పెట్టిన విషయంలో బాధితుడు ఎన్వీ రామారావు, చంద్రశేఖర్ నాగపూర్‌లోని క్రైంబ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే బొల్లినేనిపై సబ్‌కాంట్రాక్టర్ చంద్రశేఖర్ మరో చెక్‌బౌన్స్ కేసు కూడా నమోదు చేయించాడు. నాగపూర్‌లో క్రైంబ్రాంచ్ పోలీసులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి కేసు నమోదు చేసేందుకు నిరాకరించడంతో హైకోర్టు ద్వారా కేసు నమోదుకు ఆదేశాలు ఇప్పించినట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లో లతితాపూర్కు చెందిన బ్రిజేష్ మిశ్రాకు బిల్లు నగదు ఇవ్వకపోవడంతో కేసు నమోదు చేయడంతో ఎమ్మెల్యే బొల్లినేని అతని కుటుంబ సభ్యులకు న్యాయస్థానం ద్వారా ముందస్తు బెయిల్ ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అలాగే ఒంగోలు, రాజమండ్రిలో కూడా బొల్లినేని వ్యవహారంపై సీఐడీకి ఫిర్యాదులు కూడా వెళ్లినట్లు తెలిసింది. -
బొల్లినేని అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, నెల్లూరు : మహారాష్ట్రలో ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల అంచనాలు పెంచి రూ.20 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావును అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గతంలో నాగపూర్ ఏసీబీ అధికారులు పలు కేసులు నమోదు చేసి విచారణ జరిపిన విషయం తెలిసిందే. అయితే అక్కడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో అరెస్ట్ చేయకుండా ఆగిపోయారు. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టి వేయడంతో బొల్లినేని అరెస్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయమై నాగపూర్ ఏసీబీ డీఎస్పీ ఎంఎస్ టోట్రేను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వాస్తవమేనని త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు. మరోవైపు నాగపూర్ క్రైం బ్రాంచ్ పోలీసులు కూడా మరో కేసులో ఎమ్మెల్యేని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దోపిడీ ఇలా.. బొల్లినేనికి చెందిన శ్రీనివాస కనస్ట్రక్షన్ కంపెనీ తన అనుబంధ పి.బలరామ్ కంపెనీతో కలసి విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (వీఐడీసీ) పరిధిలో నెర్ల (పగోరా)ఎత్తిపోతల పథకం, గోద్రాజ్ బ్రాంచ్ కెనాల్ ఎర్త్‌వర్క్ –కవర్ వర్క్ పనులు తదితర మొత్తం 35 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది. రూ.6,672 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన ఈ పనులను స్థానిక అధికారుల సహకారంతో రూ.26,722 కోట్ల వరకు అంచనాలు పెంచినట్లు అక్కడి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారులు బొల్లినేని రామారావు, శ్రీనివాసులురెడ్డిపై మహారాష్ట్రలో 8 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. నాగపూర్ ఏసీబీ అధికారులు రెండేళ్ల క్రితమే రెండు కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నంబర్ 203/17తో సెక్షన్లు 420,415,120 బీ, 13/1సీ కింద నమోదు చేశారు. అప్పట్లో 15 బృందాలుగా ఏర్పడిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన బినామీ కంపెనీల్లో వారి నివాసాల్లో సోదాలు జరిపి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే బాధితులు చంద్రశేఖర్, ఎన్వీ రామారావుల ఫిర్యాదు మేరకు నాగపూర్ క్రైంబ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన మరో రెండు కేసులతో కలిపి మొత్తం 8 కేసులు ఉన్నట్టు సమాచారం. అలాగే ఉత్తరప్రదేశ్‌లో యూనియన్ బ్యాంకును నకిలీ బ్యాంక్ గ్యారంటీలతో బురిడీ కొట్టించడంపై కూడా కేసు నమోదయింది. ఆ కేసులో ఎమ్మెల్యే బొల్లినేనితో పాటు ఆయన సతీమణి, కుమారుడు కూడా నిందితులుగా ఉన్నారు. మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో మాత్రం అరెస్ట్ చేయకుండా హైకోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరెస్టు నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు ఆ ఉత్తర్వులు కొట్టివేయడంతో బొల్లినేని అరెస్టుకు నాగపూర్ ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. రూ.100 కోట్ల ఆదాయ పన్ను ఎగవేత వీఐడీసీలో చోటు చేసుకున్న అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయంతో పాటు ఆదాయ పన్నుశాఖ అధికారులకు బాధితులు గతేడాది ఫిర్యాదు చేశారు. ఆదాయ పన్నుకు సంబంధించి దాదాపు రూ.100 కోట్ల వరకు ఎగవేసినట్లు పలు ఆధారాలు సైతం ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రాజెక్టుల పేరిట తన కంపెనీల ద్వారా నాగపూర్‌లోని పలు బ్యాంకుల నుంచి దాదాపు రూ.450 కోట్లకుపైగా రుణాలు బొల్లినేని పొందినట్లు తెలుస్తోంది. ఆ రుణాలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో ఆయా బ్యాంకర్లు కూడా త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. సబ్ కాంట్రాక్టర్లకు రూ.209 కోట్ల ఎగనామం ఎమ్మెల్యే బొల్లినేని పలు ప్రాజెక్టుల్లో సబ్ కాంట్రాక్టులు ఇచ్చి ఆయా పనుల బిల్లులు పూర్తి స్థాయిలో తీసుకుని సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వకుండా ఎగనామం పెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఎన్వీ రామారావు, బెజవాడ గోవిందరెడ్డి, సీహెచ్ వెంకటేశ్వరరావు, వైష్ణవి కన్స్ట్రక్షన్, బొల్లినేని శ్రీనివాసులు తదితర కాంట్రాక్టర్లకు దాదాపు రూ.200 కోట్ల బిల్లులు ఇవ్వలేదని తెలుస్తోంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో 280 చెక్ డ్యామ్‌ల పనులకు సంబంధించి పనులు పూర్తయినా దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు నిలిపేసి బొక్కేయడంతో టీడీపీకే చెందిన వారితో పాటు దాదాపు 15 మంది సబ్ కాంట్రాక్టర్లు ఎమ్మెల్యే చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. టీడీపీ నేతలు ఇటీవల చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టారు. బిల్లులు వచ్చినా పలు కారణాలతో దాదాపు రూ.9 కోట్ల వరకు ఇవ్వకుండా తిప్పుకుంటున్న వైనంపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
బాబునే బురిడీ కొట్టించిన ‘బొల్లినేని’
సాక్షి, నెల్లూరు: తమ వైఫల్యాలను, అవినీతి ఆరోపణలను కప్పిపుచ్చుకునేందుకు ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆ పార్టీ అధినేతనే బురిడీ కొట్టించారు. పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చి అధినేత చంద్రబాబు వద్ద మార్కులు కొట్టేసేందుకు అడ్డదారులు తొక్కారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాతో పేర్లను పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు నమోదుచేయడం వివాదాస్పదంగా మారింది. పార్టీ సభ్యులుగా నమోదయిన వారిలో దాదాపు 20 శాతం మంది ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులుగా తేలింది. ఇదిలా ఉంటే పార్టీ సభ్యత్వ రుసుం చెల్లింపుల కోసం నియోజకవర్గానికి మంజూరైన ఉపాధి హామీ నిధులను మార్కెట్లో పెట్టి ఆరుశాతం కమీషన్లు తీసుకుని విక్రయించేశారు. ఆ నగదును పార్టీ సభ్యత్వ రుసుంపంపినట్లు ఆరోపణలుండడంతో నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి కంటే అతని వైఫల్యాలే అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు తమ అస్మదీయులకే అన్ని బాధ్యతలు అప్పగించడం, కష్టపడిన కార్యకర్తలను విస్మరించడం, అవినీతిని ప్రోత్సహించి పసుపు కుంభకోణంలో పార్టీనే రోడ్డున పడేయడం, ఫైబర్చెక్ డ్యామ్‌ల పేరుతో అక్రమాలకు పాల్పడడం వంటి వైఫల్యాలు ఎమ్మెల్యే బొల్లినేని చుట్టుముట్టాయి. దీంతో పాటు ఫైబర్ చెక్‌డ్యామ్‌ల పనులు పార్టీ నేతలకు పందేరం చేసి, వారికి బిల్లులు ఎగనామం పెట్టడంతో బాధితులు ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అలాగే మహారాష్ట్రలో విదర్భ కుంభకోణంలో కీలకపాత్ర పోషించి కేసులు వరకు వెళ్లడం, పలువురు సబ్ కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బిల్లులు ఎగనామం పెట్టడం ఇలాంటి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తమ అవినీతి, అక్రమాలను అధిగమించి పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడేందుకు పార్టీ సభ్యత్వాలను దృష్టి పెట్టినట్లు తెలిసింది. అధికార పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని నమోదైన సభ్యత్వాలను మించి చేసి అధినేత దృష్టిని ఆకర్షించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఓటర్ల జాబితాలను ముందేసుకుని సుమారు 80 వేల సభ్యత్వాలు నమోదు చేశారు. ఆయా సభ్యత్వాల్లో దాదాపుగా 20 శాతం ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులు ఉండడం విశేషం. ఈ విషయం ఇటీవల కొందరు ఉదయగిరి నేతలు ఆ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉపాధి పనులు పందేరం ఉదయగిరి నియోజకవర్గానికి ఇటీవల దాదాపు రూ.8.5 కోట్లు ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. ఆయా నిధులను స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వ్యక్తిగత సహాయకుడు, మండల పార్టీ కన్వీనర్ల ద్వారా ఆరు శాతం కమీషన్ వంతున పలువురు కాంట్రాక్టర్లకు అభివృద్ధి పనులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఎనిమిది నియోజకవర్గాల్లో ఉపా«ధి నిధులను కాంట్రాక్టర్లకు కేటాయించడం వివాదంగా మారింది. పార్టీని నమ్ముకుని జెండా మోసిన వారిని కాదని అభివృద్ధి పనులను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం ఏమిటని వారు ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారు. అలా వసూలు చేసిన నగదును పార్టీ సభ్యత్వ రుసుంకు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. ఉపాధి హామీ పనుల పందేరం విషయంపై నియోజకవర్గ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోమారు టికెట్ కోసమేనా? ఉదయగిరి అధికార పార్టీలో రానున్న ఎన్నికల్లో టికెట్ల లొల్లి జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే బొల్లినేనిపై అవినీతి ఆరోపణలు ఉండడంతో టికెట్ సిట్టింగ్‌కు ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీలోని సెకండ్ కేడర్ లీడర్లు పోటీ పడుతుండడంతో అధినేత దృష్టిని ఆకర్షించి మరోమారు టికెట్ తెచ్చుకునేందుకు ఇలాంటి అడ్డదారులు తొక్కారనే ఆరోపణలున్నాయి. -
వదల తమ్ముళ్లూ.. వదలా!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీలో ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు బకాయిల వ్యవహారం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో బకాయిలు, కేసులు వ్యవహారాలతో సతమతమవుతున్న బొల్లినేనికి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలో మరో తలనొప్పి ప్రారంభమైంది. బొల్లినేని వ్యాపారులకే కాకుండా ఈ పర్యాయం తెలుగు తమ్ముళ్లకే పనులకు సంబంధించిన బిల్లు బకాయిలు ఉండటంతో అంతా కలిసి కట్టుగా వెళ్లి సీఎంకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో అభ్యర్థిని మార్చకపోతే పార్టీ భవిష్యత్కే ప్రమాదం గట్టిగానే చెప్పడం నియోజకవర్గలో కలకలం రేపింది. దీని కొనసాగింపుగా ఎమ్మెల్యే బొల్లినేని వ్యవహారంపై ఇంటిలిజెన్స్ విభాగం ఆరా తీసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెలే బొల్లినేని రామారావు ఎమ్మెల్యేతో పాటు కాంట్రాక్టర్‌గా కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని ‘విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ బోర్డు’లో లెక్కకు మించి పనులు నిర్వహించడం, భారీగా గోల్మాల్ చేయడం, అవినీతికి పాల్పడిన క్రమంలో నాగపూర్‌లోని ఏసీబీ అధికారులు, స్థానిక పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. కొంత కాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఉదయగిరి నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకాన్ని పూర్తిస్థాయిలో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కొత్త టెక్నాలజీ అంటూ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో లేని ఫైబర్ చెక్ డ్యాంల్లో నిర్మాణానికి తెరతీశారు. మొత్తం నాలుగేళ్లలో రూ.350 కోట్లకు పైగా నీరు–చెట్టు పనులు జరిగాయి. నియోజకవర్గంలో నీరు–చెట్టు పనులన్ని ఆయన తన కంపెనీల ద్వారా నిర్వహించారు. సివిల్ వర్క్‌లను స్థానిక అధికార పార్టీ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు అప్పగించారు. పనులన్ని పూర్తయి దాదాపు 10 నెలలు గడిచినా అధికార పార్టీ నేతలకు ఇంకా బిల్లులు రాలేదని చెల్లించలేదు. దీంతో నేతలు గట్టిగా ప్రశ్నిస్తే సీరియస్ వార్నింగ్‌లకు దిగుతున్నారు. నియోజకవర్గంలో పనులు నిర్వహించిన వారికి సంబంధించి రూ.28 కోట్లు వరకు బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వింజమూరు, కలిగిరి జెడ్పీటీసీ సభ్యులు పులిచర్ల నారాయణరెడ్డి, దామా మహేశ్వరరావు, కలిగిరి ఎంపీపీ వెంకటేశ్వర్లుతో పాటు సుమారు 25 మంది నేతలు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడిని కలిసి ఎమ్మెల్యే అప్పుల వ్యవహారంపై ఫిర్యాదు చేసి ఐదు పేజీల ఫిర్యాదు కాపీని ఇచ్చి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బొల్లినేని రామరావు అభ్యర్థి అయితే పార్టీ నష్టపోతుందంటూ ఫిర్యాదు చేసి మార్చాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ఆరా! ఈ క్రమంలో బొల్లినేని బకాయిల వ్యవహారం, ఇతర అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు అరా తీశారు. ఇరిగేషన్ విభాగంలో ఎస్ఈ స్థాయి అధికారి మొదలుకొని డీఈ వరకు కొందరితో మాట్లాడి నిర్వహించిన వర్కులు వాటికి సంబంధించిన బిల్లులు ఇతర అంశాలపై వివరాలు తీసుకుని నివేదిక పంపినట్లు సమాచారం. అయితే సీఎం కార్యాలయం నుంచి ఎమ్మెల్యేకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. బకాయిలన్ని చెల్లించి తనను వచ్చి కలవమని సీఎం సూచించినట్లు సమాచారం. -
అవినీతి'గిరి'
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అండతో అధికార పార్టీ నేతలు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలాలు, భూములు కబ్జా చేశారు. ఫైబర్ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడి రూ.కోట్లు దోచుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరామారావు మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ పనుల్లో చేసిన అవినీతి ఫార్ములాను ఉదయగిరి నియోజకవర్గంలో పక్కాగా అమలుచేశారు. ఫైబర్ చెక్‌డ్యాంల పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో 280 ఫైబర్ చెక్‌డ్యాంలు నిర్మించారు. రూ.10 లక్షలు అంచనా వ్యయమయ్యే పనులను అమాంతం దాని విలువ రూ.కోటికి పెంచి అడ్డగోలుగా పనులు చేసి భారీ మొత్తంలో జేబులు నింపుకున్నారు. ఈ పనుల్లో పది శాతం ఎమ్మెల్యే కమీషన్ తీసుకుని నియోజకవర్గంలోని వివిధ మండల స్థాయిలో ఉన్న టీడీపీ నేతలకు పనులు కేటాయించారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు :టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని తెలుగుతమ్ముళ్లు దోచేశారు. ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అండ చూసుకుని ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. రూ.కోట్లు స్వాహా చేశారు. చోటా నాయకుడి నుంచి జిల్లా నాయకుడి వరకు అందరూ ప్రజల సొమ్మును హారతి కర్పూరం చేశారు. ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేశారు. పింఛన్ల మంజూరులో చేతివాటం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా నీరు – చెట్టు పేరుతో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులను గ్రామస్థాయి కార్యకర్తలకు కాసులపంట పండించే విధంగా రూపకల్పన చేశారు. ఎక్కడైనా చిన్న వాలు కనిపిస్తే అక్కడ ప్రొక్లెయిన్లు పెట్టి పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి విచ్చలవిడిగా దోచుకున్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణంలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది. అవినీతిపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అవినీతి సంస్థానానికి ఆయనే రాజు ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుకతో మొదలుపెట్టి కొత్త టెక్నాలజీ వర్కులుంటూ భారీగా ప్రతి దానిలో దండుకున్నారు. బొల్లినేని రామారావు 2014 ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక ఆయన, ఆయన ముఖ్య అనుచరగణంతో పాటు తెలుగుతమ్ముళ్లు ఇక మనకు తిరుగులేదనే రీతిలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. బొల్లినేని మహారాష్ట్రలోని నాగపూర్‌లో పనులకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైంది. ఆయన అనుచరులు పసుపు కొనుగోళ్లలో రూ.కోట్లు మింగిన క్రమంలో వారందరిపై స్థానికంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెట్టాక జోరు తగ్గకపోగా రెట్టింపు స్థాయిలో అవినీతి చేయడం గమనార్హం ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు 2006 సంవత్సరం నవంబర్ 6వ తేదీన విదర్భలో బొల్లినేని రామారావు, ఆర్.శ్రీనివాసరెడ్డిలు రూ.130 కోట్ల వర్కును ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా 2007లో దాని విలువను రూ.145 కోట్లకు పెంచారు. ఇలా పెంచుకుంటూ పోయి రూ.1,549 కోట్ల వర్కుగా చేసి భారీగా దోచుకున్నారు. ఈ వ్యవహారంపైనే మొదట ఏసీబీ కేసు కూడా నమోదైంది. విచారణలో పనుల విలువ పెంచి భారీగా స్వాహా చేశారని రుజువు కావడంతోనే కేసు నమోదు చేశారు. మొత్తం అక్కడ పనులు నిర్వహించిన ఏడుగురు కాంట్రాక్టర్లపై కేసులు పెట్టారు. తాజాగా కూడా పాత కేసులకు కొనసాగింపుగా ఎఫ్ఐఆర్ నంబర్ 0203/2017 కింద కేసు మçహాæరాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న సర్దార్ పోలీసు స్టేషన్లో ఏసీబీ నివేదిక ఆధారంగా కేసు నమోదుచేసి విచారణ సాగిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకరవిఠల్ మోర్గాడే, శ్యాం జగ్గదేవ్ అంబల్కేర్, దీలిప్ పోయేకర్, స్వప్న రామసాత్ సూర్యవంశీ, షాహిదాస్ మారుతీ లగడేలతోపాటు ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, అతని భాగస్వామి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డిలుపై కేసు నమోదై విచారణ పర్వం సాగుతోంది. అవసరం లేకున్నా పనులు చేసి.. నియోజకవర్గంలో అధికంగా దోపిడీ జరిగిన వాటిలో నీరు – చెట్టు పథకం ఒకటి. అన్ని మండలాల్లో కలిపి రూ.132 కోట్లు పనులు జరిగాయి. వీటిలో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులున్నాయి. పనులు నాసిరకంగా చేసి, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి బిల్లులు చేసుకున్నారు. ♦ సాధారణంగా వర్షాలు పడితే వంకల ద్వారా వాలు ప్రాంతాలకు నీరు చేరుకుంటుంది. కానీ ఆ వంకలనే ఆదాయ వనరులుగా మార్చుకుని పూడికతీత పనుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వరికుంటపాడు మండలంలోని ఇరువూరు, కృష్ణంరాజుపల్లి, కొండాయపాళెం, మహ్మదాపురం, గణేశ్వరాపురం, వరికుంటపాడు, జడదేవి, ఉదయగిరి మండలంలో బిజ్జంపల్లి, కొత్తపల్లి, జీ చెరువుపల్లి. కొండాపురం మండలంలోని గరిమెనపెంట, కొమ్మి, తదితర చోట్ల ఈ విధంగా జరిగింది. ♦ చెరువు పూడికతీత పేరుతో గతంలో ఎప్పుడో రైతులు, స్థానికులు తమ అవసరాల కోసం సొంతంగా తీసుకెళ్లిన మట్టి గుంతలను లెక్కలో చూపించి పెద్దమొత్తంలో దోచేశారు. పనులు చేయకుండానే చేసినట్లుగా అధికారులు రికార్డుల్లో నమోదుచేసి అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చారు. దుత్తలూరు మండలంలోని నందిపాడు చెరువు, కొండాపురం మండలంలోని కొమ్మి చెరువు, వింజమూరు మండలంలోని పాతూరు చెరువుకు సంబంధించి ఈ పరిస్థితి ఉంది. సుమారు రూ.50 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ♦ చెరువుకట్టల అభివృద్ధి పేరుతో తూతూమంత్రంగా పనులు చేయడంతో కొద్దిపాటి వర్షానికే కట్ట పనుల్లో డొల్లతనం బయటపడి బీటలు వారాయి. చెక్‌డ్యాంల పేరుతో జరిగిన దోపిడీ అంతాఇంతా కాదు. నిబంధనలు పూర్తిగా గాలికొదిలేసి తూతూమంత్రంగా పనులుచేసి అధికారులపై ఒత్తిడితెచ్చి ఎం బుక్‌లు రికార్డ్ చేయించుకుని నిధులు మింగేశారు. ఈ పనుల్లో చాలావరకు ఏడాది గడవకముందే నాణ్యతా లోపం బయటపడింది. ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం చెరువు, కృష్ణంపల్లి చెరువు, లింగాలదొన చెరువు, వరికుంటపాడు మండలంలోని సాతుపల్లి చెరువు, గణేశ్వరరాపురం, నారసింహాపురం చెరువు, తిమ్మారెడ్డిపల్లి చెరువు తదితరచోట్ల పనులను అధ్వానంగా జరిగియి. ఇసుక తవ్వేశారు పిల్లాపేరులో ఇసుకను ఈ నాలుగేళ్లలో అధికార పార్టీ నేతలు హారతి కర్పూరంలా హరించేశారు. పిల్లాపేరుకు అటూ ఇటూ 55 కిలోమీటర్ల మేర తవ్వారు. వేల క్యూబిక్ మీటర్లు తవ్వారు. సగటున ఒక ఒక్కో క్యూబిక్ మీటర్‌కు అతితక్కువ ధర వేసుకున్న ఇసుక రూ.300 వరకు ఉంటుంది. సుమారు రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు అంచనా. అధికారికంగా ఎలాంటి అనుమతి లేకున్నా ఇసుకకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు, నాయకులు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం పిల్లాపేరు పూర్తి రూపాన్నే కోల్పోయింది. ఇసుకతిన్నెలు మటుమాయయ్యాయి. పిల్లాపేరు పరివాహక ప్రాంతంలో ఇసుక నిల్వలు పూర్తిగా హరించుకుపోవడంతో భూగర్భజలం అడుగంటి నీరు ఊరక వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. వింజమూరు, ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఇసుక తరలివెళ్లింది. మితిమీరిన జన్మభూమి కమిటీల పెత్తనం టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి అర్హులకు పథకాలు అందకుండా చేసింది. గ్రామాల్లో పింఛన్ల మంజూరు, పక్కాఇళ్ల ఎంపిక, అభివృద్ధి పనుల గుర్తింపు సర్వం అధికారాలు వారికే ఇచ్చారు. బ్యాంకు రుణాల లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ కమిటీలకే పెత్తనం కట్టబెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు, కమీషన్లు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్ని అర్హతలున్న వారికి ప్రజా సంక్షేమ ఫలాలు అందకుండా కమిటీలు చక్రం తిప్పాయి. తమ ఆర్థిక అవసరాలు తీర్చిన వారికి టీడీపీ సానుభూతిపరులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో కీలకంగా వ్యవహరించారు. యథేచ్ఛగా భూ దోపిడీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, స్థలాలను ఇష్టానుసారంగా కబ్జా చేశారు. నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమి అధికార పార్టీ నేతలు, గ్రామస్థాయి నేతలు కబ్జాకు గురిచేశారు. వీటి విలువ సుమారు రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ♦ వింజమూరు మండలం లో జిల్లా టీడీపీ అధికార ప్రతి నిధి దంతులూరి వెంకటేశ్వరరావు రావిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 272, తదితరాల్లో సుమారు 100 ఎకరాలు తమ స్వాధీ నంలో ఉంచుకున్నారు. ఇందులో కొంతభాగం కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు నోటీసుబోర్డు పెట్టినా ఆ భూమంతా సదరు ఆక్రమణదారుడి చేతుల్లోనే ఉంది. ♦ చాకలికొండకు రోడ్డుకు ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువచేసే విలువైన భూమిలో బత్తాయిచెట్లు సాగులో ఉన్నా దానిజోలికి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు సాహసించడం లేదు. ♦ వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన టీడీపీ నేత గాలి నరసపునాయుడు ఆదీనంలో రూ.50 లక్షల విలువచేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. ♦ కొండాపురం మండలం కొమ్మి ప్రాంతంలోని బంగారప్ప చెరువును దేవినేని వెంకటసుబ్బయ్య రూ.30 లక్షల విలువచేసే పదెకరాల భూమిని స్వాహా చేశారు. ♦ ఉదయగిరి మండలం కొండాయపాళెం పంచాయతీలో టీడీపీ నేత మన్నేటి వెంకటరెడ్డి కొంత స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ♦ వరికుంటపాడు మండలంలోని తూర్పురొంపిదొడ్ల, వేంపాడు, మహ్మదాపురం, విరువూరు, కొండాయపాళెం, కృష్ణంరాజుపల్లి, తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారు. ♦ కొండాపురం మండలం కొమ్మి, గొట్టిగుండాల, కొండాపురం, చింతలదేవి, తదితర గ్రామాల్లో భూములను ఆక్రమించి సాగుచేస్తున్నారు. కింది చిత్రంలో కనిపిస్తున్న భూమి వరికుంటపాడు మండలం గణేశ్వరాపురం గ్రామంలోని బత్తిని గురవమ్మకు చెందినది. 4.50 విస్తీర్ణం గల ఈసీజేఎఫ్ఎస్ భూమిని అధికార టీడీపీ నేత పేరం సుధాకర్‌రెడ్డి ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. డీఫారం పట్టా ఇవ్వాలని భూమి హక్కుదారురాలైన గురవమ్మ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. భూమిలోకి లబ్ధిదారురాలను దిగనివ్వకుండా సదరునేత అడ్డుకుని వరిపైరు సాగుచేస్తున్నారు. సుమారు. రూ.20 లక్షల విలువగల భూమిని అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించుకున్నారు. సదురు నాయకుడే నీరు – చెట్టులో రూ.2 కోట్లు విలువచేసే పనులను నాసిరకంగా చేసి రూ.50 లక్షలకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. ఉపాధిహామీలో మొక్కల పెంపకం పేరుతో రూ.4 లక్షలు స్వాహాచేశాడు. పక్కాగృహాలు, మరుగుదొడ్లు ఫాంపాండ్స్, సిమెంట్‌రోడ్లు తదితర పనుల్లో రూ.30 లక్షలుపైగా అవినీతికి పాల్పడ్డాడనే విమర్శలున్నాయి. ఉపాధి పనుల్లోనూఅదే అవినీతి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందజేసే జాతీయ ఉపాధిహామీ పథకం తెలుగుతమ్ముళ్లకు వరంలా మారింది. లబ్ధిదారులకు చెందాల్సిన నగదు నేతలు తమ జేబుల్లో నింపుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, నాడెప్‌ల నిర్మాణం, డంపింగ్‌యార్డులు, పంటకుంటలకు సంబంధించి కూలీలకు బదులుగా యంత్రాలతో చేయించి బినామీ మస్టర్లతో మెక్కేశారు. సప్లయ్‌దారుడు పేరుతో తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి, మరుగుదొడ్లు, నాడెప్‌లు పలుచోట్ల నిర్మించకుండానే నగదు స్వాహా చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో జరిగిన అవినీతి అంతాఇంతా కాదు. తూతూమంత్రంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి పర్యవేక్షణ, నీరు పోసే పేరుతో రూ.లక్షలు దిగమింగారు. ఏడాది గడిచిన తర్వాత చూస్తే మొక్కలు కనిపించలేదు. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, తోటలచెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని నాయుడుపల్లి పంచాయతీల్లో అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో నిధులు స్వాహా చేశారు. మరుగుదొడ్లను పలుచోట్ల తూతూమంత్రంగా నిర్మించి నిధులు కాజేశారు. ఉదయగిరి మండలంలోని ఉదయగిరి, కొండాయపాళెం, జీ చెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని కొత్తపేట, వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, వింజమూరు మండలంలోని లెక్కలవారిపాళెం, జనార్దనపురం పంచాయతీల్లో ఉన్నవాటినే మళ్లీ నిర్మించినట్లుగా చూపించి నిధులు స్వాహా చేశారు. -
ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ ఎమ్మెల్యే వీరంగం
-
రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత
రేణిగుంట/చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషాగౌడ్, రేణిగుంట తహసీల్దార్ నరసింహులునాయుడులపై నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. రాస్కెల్.. నీవెంత, నీ ఉద్యోగం ఎంత, నువ్వు నాకు చెప్పేవాడివా అంటూ తహసీల్దార్‌పై చిందులు తొక్కారు. నీ అంతు చూస్తానంటూ జాయింట్ కలెక్టర్‌ను హెచ్చరించారు. వివరాలు.. గురువారం సాయంత్రం 5.45 గంటలకు ప్రత్యేక విమానంలో మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వే నుంచి వారు అరైవల్ ఎంట్రెన్స్ గుండా బయటకు వస్తారని ప్రొటోకాల్ అధికారులు వేచి ఉన్నారు. ఆ సమయంలో వారికి స్వాగతం పలికేందుకు ఉదయగిరి ఎమ్మెల్యే రామారావు అక్కడే వేచి ఉన్నారు. అయితే అతిథులు అనూహ్యంగా మెయిన్‌గేటు గుండా బయటకు వచ్చారు. ఎమ్మెల్యేను మెయిన్ గేటు వద్దకు తీసుకుని వెళ్లడానికి జేసీ వచ్చిన సమయంలో.. తనను అనసవరంగా అక్కడ కూర్చోబెట్టారంటూ ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘నీకు ప్రొటోకాల్ మర్యాదలు తెలియవా? నీ అంతు చూస్తా’’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న తహసీల్దార్ నరసింహులునాయుడు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా ఆయనపై తీవ్ర దుర్భాషలాడారు. దీంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు. ఎమ్మెల్యేది అహంకార ప్రవర్తన ఎమ్మెల్యే బొల్లినేని రామారావుది అహంకారపూరిత ప్రవర్తన అని రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యదర్శి నరసింహులునాయుడు, జిల్లా రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షుడు విజయసింహారెడ్డి, వీఆర్వో సంఘనేత చెంగల్రాయులు అన్నారు. ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి అధికారుల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సహించరానిదన్నారు. ఘటనపై తాము సీఎంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాల్సిందే.. జాయింట్ కలెక్టర్ గిరీష, తహసీల్దార్ నరసింహులునాయుడులకు శుక్రవారం ఉదయం 10 గంటలోపు ఎమ్మెల్యే రామారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ విజయసింహారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులంతా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. -
టీడీపీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మరో కేసు నమోదైంది. బొల్లినేని రామారావు మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో పలు కాంట్రాక్టులు చేశారు. ఆ సమయంలో ఆయన కంపెనీ పలు అక్రమాలకు పాల్పడినట్టు మహారాష్ట్ర ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో.. అక్రమాలకు బొల్లినేని కంపెనీలకు సంబంధం ఉందని గుర్తించిన ఏసీబీ అధికారులు పలు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బొల్లినేని రామారావును ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియకుండా తిరుగుతున్నట్టు సమాచారం. ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు బొల్లినేని రామారావును అరెస్టు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, బొల్లినేని అంశం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. -
టీడీపీ ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ఏసీబీ కేసు
నెల్లూరు: పచ్చనేతల అవినీతి పొరుగురాష్ట్రాలకూ పాకింది. తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి దందా ఒక్కొక్కటి వెలుగుచూస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. విదర్భా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఆయన కోట్లాది రూపాయల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా చేసుకొని టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని పలు సాగునీటి కాంట్రాక్టులు చేపట్టారని, ఈ నేపథ్యంలో విదర్భా ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద కాలువల నిర్మాణం, మరమ్మత్తులు, ఎత్తిపోతల పథకాలు వంటి పనులు చేపట్టారని, ఈ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచి ఎమ్మెల్యే బొల్లినేని భారీగా అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భారీ కుంభకోణంలో నిందితుడిగా బొల్మినేని రామారావుకు సంబంధించి నెల్లూరు, కావలిలో ఉన్న ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.