టీడీపీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం | Maharashtra ACB Files Case Against TDP MLA Bollineni Venkataramarao | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధం

Published Fri, Dec 15 2017 5:29 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Maharashtra ACB Files Case Against TDP MLA Bollineni Venkataramarao - Sakshi

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మరో కేసు నమోదైంది. బొల్లినేని రామారావు మహారాష్ట్రలోని  విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పరిధిలో పలు కాంట్రాక్టులు చేశారు. ఆ సమయంలో ఆయన కంపెనీ పలు అక్రమాలకు పాల్పడినట్టు మహారాష్ట్ర ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో.. అక్రమాలకు బొల్లినేని కంపెనీలకు సంబంధం ఉందని గుర్తించిన ఏసీబీ అధికారులు పలు కేసులు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి బొల్లినేని రామారావును ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉన్నారో తెలియకుండా తిరుగుతున్నట్టు సమాచారం. ఏ క్షణమైనా ఏసీబీ అధికారులు బొల్లినేని రామారావును అరెస్టు చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, బొల్లినేని అంశం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement