ముంబయి: కరోనా పేరు విని చాలాా రోజులు అయి ఉంటుంది! ఎక్కడా పెద్దగా కేసులు నమోదుకాకపోవడంతో ఇక అయిపోయిందని అనుకున్నాం. కానీ కొత్త వేరియంట్ రూపంలో మళ్లీ వచ్చి.. కొత్తగా కేసులు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా కరోనా మొదటి, రెండవ దశలో ఎక్కువగా నష్టపోయిన మహారాష్ట్రలోనే మళ్లీ కొత్త రకం కేసులు వెలుగులోకి వచ్చాయి.
కొత్త రకం కరోనా వైరస్ ఈజీ.5.1 కలవరపెడుతోంది. మహారాష్ట్రలో ఈ వేరియంట్ రకానికి చెందిన కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా ముంబై లో 43 కేసులు నమోదయ్యాయి. పూణేలో 34 కేసులు వెలుగులోకి రాగా.. థానేలో 25 చొప్పున యాక్టీవ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు.
కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య రంగాన్ని అప్రమత్తం చేశారు. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. కరోనా కొత్త రకం వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున మాస్కులు తరహా రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి: వీల్ ఛైర్‌లో మన్మోహన్‌సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment