ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్‌కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం.
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట.
ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్‌లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..?
బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది..
ఎన్‌ఆర్‌ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు.
చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..!
Comments
Please login to add a commentAdd a comment