టీడీపీ ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ఏసీబీ కేసు | maharastra ACB case on TDP mla bollineni ramarao | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ఏసీబీ కేసు

Published Sun, Jul 16 2017 10:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM

టీడీపీ ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ఏసీబీ కేసు

టీడీపీ ఎమ్మెల్యేపై మహారాష్ట్ర ఏసీబీ కేసు

నెల్లూరు: పచ్చనేతల అవినీతి పొరుగురాష్ట్రాలకూ పాకింది. తెలుగుదేశం పార్టీ నేతల అవినీతి దందా ఒక్కొక్కటి వెలుగుచూస్తోంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్ర ఏసీబీ కేసు నమోదు చేసింది. విదర్భా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఆయన కోట్లాది రూపాయల అవకతవకలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

మహారాష్ట్ర కేంద్రంగా చేసుకొని టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని పలు సాగునీటి కాంట్రాక్టులు చేపట్టారని, ఈ నేపథ్యంలో విదర్భా ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద కాలువల నిర్మాణం, మరమ్మత్తులు, ఎత్తిపోతల పథకాలు వంటి పనులు చేపట్టారని, ఈ పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచి ఎమ్మెల్యే బొల్లినేని భారీగా అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. భారీ కుంభకోణంలో నిందితుడిగా బొల్మినేని రామారావుకు సంబంధించి నెల్లూరు, కావలిలో ఉన్న ఆస్తులపై విచారణ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement