మాట్లాడుతున్న తహసీల్దార్ రామ్మోహన్
సాక్షి, రామగిరి: ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ విజిల్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దార్ రామ్మోహన్ అన్నారు. సెంటినరీకాలనీలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం సీ విజిల్ యాప్‌పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ సీ విజిల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్లను వివిధ పార్టీల నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకోవచ్చునని వివరించారు.
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీ విజిల్ యాప్ ఎంతగానో దోహదపడుతోందని సూచించారు. సీ విజిల్ యాప్ ద్వారా గ్రామాల్లో ఎన్నికల నియామావళిని ఉల్లంఘినట్లయితే అందుకు సంబంధించిన ఫొటో లేదా వీడియోను అప్‌లోడ్ చేయడంతో సంబంధిత ఎన్నికల అధికారులకు చేరడంతో నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈయాప్ గురించి విద్యార్థులు ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ అబ్బు కేశవరెడ్డి, ఆర్‌ఐ అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment