
తహసీల్దార్ కార్యాయంలో చోరీ
హాలియా : తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కంప్యూటర్ మానిటర్, ల్యాప్‌టాప్‌ను అపహరించినట్టు తహసీల్దార్ వేణుమాధవరావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుముల మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్‌ఏ రామకృష్ణ మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చి చూసేసరికి మానిటర్, ల్యాప్‌టాప్ లేవని గుర్తించి వెంటనే తహసీల్దార్‌కు తెలిపాడు. వెంటనే పోలీసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రప్పించి తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ తెలిపారు.