
సాక్షి, మహబూబ్‌నగర్: రంగారెడ్డి జిల్లా కేశంపేట తహశీల్దార్ లంచావతారం వెలుగు చూసిన కొద్దిగంటల్లోనే మరో ఇద్దరు ఎమ్మార్వోల కలెక్షన్ దందా కలకలం రేపుతోంది. పాలమూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మార్వోల కలెక్షన్ దందా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రెవెన్యూ డిపార్టమెంట్ లో అలజడి రేగింది. సీసీకుంట ఎమ్మార్వో రాజు, పదరా ఎమ్మార్వో మల్లిఖార్జున రావు డబ్బులు లెక్కబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తెలంగాణ భూ దస్త్రాల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment