పుష్కర స్నానానికి అధికారులు గుర్తించిన ప్రాంతం
బెళుగుప్ప :
మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణా పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం అధికారులు ప్రారంభించారు. స్థానిక తహశీల్దార్ వెంకటా చలపతి రిజర్వాయర్‌లో లోతు తక్కువ ఉన్న ప్రాంతాలను పరిశీలించి పలు ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పుష్కర ఏర్పాట్లను వేగవంతంగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.
పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు దుస్తులు మార్చుకునే గదులను తాత్కాలికంగా తడకలతో ఏర్పాటు చేస్తామని, పురోహితులను సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. స్నానం తరువాత పూజలు నిర్వహించేందుకు కృష్ణమ్మ దేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పనులను ప్రారంభించామని తెలిపారు.
రాత్రి వేళల్లో వెలుగు కోసం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ లైన్లను వేస్తున్నారని, రిజర్వాయర్‌లో బ్యారికేడ్లను ఏర్పాటు చేయిస్తామని అన్నారు. తహశీల్దార్‌తో పాటు ఆర్‌ఐలు జగన్నాథం, భాగ్యమ్మ, ఏఓ పృథ్వీసాగర్, ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ విజయ భాస్కర్, వెటర్నరీ అధికారి మహేశ్ తదితరులు రిజర్వాయర్ వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.