ఎమ్మార్వోపై దాడి కేసులో ఒకరు అరెస్ట్ | attack on ameerpet mro | Sakshi
Sakshi News home page

ఎమ్మార్వోపై దాడి కేసులో ఒకరు అరెస్ట్

Published Sat, Apr 25 2015 3:06 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

attack on ameerpet mro

హైదరాబాద్ : హైదరాబాద్ అమీర్‌పేట ఎమ్మార్వో వెంకటేశ్వర్లుపై దాడి చేసిన కేసులో ఒకరిని ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో 'ఫ్లాట్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన ఎమ్మార్వో ఆ బోర్డును తీసేయించారు. దాంతో ఆ వ్యక్తి ఆ స్థలం తనదేనని ఎమ్మార్వోతో గొడవపడి దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు పోలీసులు హుస్సేన్‌ని శనివారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement