govt land
-
మియాపూర్ పరిస్థితులపై సైబరాబాద్ సీపీ సమీక్ష
-
Hyderabad: మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో స్థలాలు
సాక్షి, సిటీబ్యూరో: సర్కారు భూముల వేలానికి సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రీబిడ్ సమావేశాలకు ఆసక్తిగల కొనుగోలుదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. హెచ్ఎండీఏ పరిధిలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తుర్కయంజాల్, తొర్రూరులతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని అమిస్తాపూర్‌లో ప్రభుత్వ స్థలాలను ఈ– వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వివిధ ప్రాంతాల్లో గతంలో నిర్వహించిన ఈ– వేలం ద్వారా కొన్ని ప్లాట్లను విక్రయించగా మిగిలిన వాటిని రెండో దశలో విక్రయించేందుకు అధికారులు తాజాగా చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న స్థలాలు కావడంతో సాధారణ, మధ్యతరగతి వర్గాల నుంచి రియల్టర్లు, బడా బిల్డర్ల వరకు కూడా ప్రభుత్వ స్థలాల కొనుగోలు పట్ల ఆసక్తి చూపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకొనే మధ్యతరగతి వర్గాలకు బహదూర్‌పల్లి, తొర్రూరులలో 197 చదరపు గజాల నుంచి 267 చదరపు గజాల విస్తీర్ణం వరకు కూడా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బహదూర్‌పల్లి, తుర్కయంజాల్, కుర్మల్‌గూడ, తొర్రూరు, తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల కోసం 325 చదరపు గజాల నుంచి గరిష్టంగా 1,145 చదరపు గజాల వరకూ గరిష్ట విస్తీర్ణంలో కొన్ని ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 వరకు ప్లాట్లకు ఈ– వేలం నిర్వహించనున్నారు. ఆదాయ మార్గాల అన్వేషణలో.. ► ఆదాయ సముపార్జన కోసం ప్రభుత్వం వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల విక్రయానికి చర్యలు చేపట్టింది. హెచ్ఎండీఏ పరిధిలోని స్థలాల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఈసారి సుమారు రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశం ఉన్నట్లు అంచనా. కుర్మల్‌గూడ, తొర్రూర్‌లలో చదరపు గజానికి రూ.10 వేల చొప్పున కనీస ధర నిర్ణయించగా, తుర్కయంజాల్‌లో కనీస ధర రూ.40 వేలుగా నిర్ణయింంచారు. బహదూర్‌పల్లిలో కనీస ధర రూ.25వేల చొప్పున ఉంటుంది. అన్నిచోట్లా ఈసారి భారీ డిమాండ్ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ► ఒకవైపు భూముల విక్రయం ద్వారా ఆదాయం కోసం చర్యలు తీసుకొంటూనే మరోవైపు గతంలో నిలిచిపోయిన లేఅవుట్ల క్రమబద్ధీకరణ ద్వారా కూడా ఫీజుల రూపంలో ఖజానా నింపుకొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని సుమారు 633 వెంచర్లను అధికారులు గుర్తించారు. వీటికి ఎల్ఆర్ఎస్ జారీ చేస్తే మరో రూ.500 కోట్ల వరకు ఫీజుల రూపంలో లభించే అవకాశం ఉంది. (క్లిక్ చేయండి: హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్.. ఎయిర్‌పోర్ట్‌కు సాఫీగా జర్నీ) -
దేవుడు ముసుగులో దోచేస్తున్నారు
పేరు దేవుడిది.. దందా రియల్ ఎస్టేట్ వ్యాపారులది. స్వామిపేరు చెప్పి రూ.కోట్లు విలువైన భూమిని కొల్లగొట్టే స్కెచ్ గీశారు. పచ్చని కొండను జేసీబీలతో ఇష్టారాజ్యంగా చదును చేసేస్తున్నారు. ప్లాట్లుగా మలిచే పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. అధికారులు అడ్డుచెప్పినా ఫిరంగి కొండను కైంకర్యం చేసేపనులు సాగిస్తున్నారు. కొత్తవలసలో రెవెన్యూ పరిధిలో దేవుడి ముసుగులో సాగుతున్న భూదందాకు ‘సాక్షి’ అక్షరరూపం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కుక్కను చంపాలంటే దానికి పిచ్చికుక్క అని ముద్ర వేయాలి. అదే ప్రభుత్వ భూమిని కొట్టేయాలంటే ఆ పక్కనే కొంత స్థలంలో దేవుడికో గుడి కట్టాలి. అక్కడ విలువ పెరిగిన తర్వాత చుట్టుపక్కల ఉన్న స్థలాలను హాట్‌కేక్‌ల్లా అమ్మేసుకోవాలి. సరిగ్గా ఇదే ఫార్ములాను కొత్తవలసలో అక్రమార్కులు పక్కాగా ఫాలో అవుతున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఫిరంగి కొండనే జేసీబీలతో దొలిచేస్తున్నారు. అక్కడ రేకుల షెడ్లో తాత్కాలికంగా దేవుడిని పెట్టారు. అక్కడికి కాస్త ఎగువన కొండపై గుడి నిర్మాణం ప్రారంభించారు. అదే సమయంలో పరిసరాలతో పాటు రోడ్డు వేసే పేరుతో రూ.20 కోట్ల విలువైన దాదాపు ఐదు ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని చదును చేసేశారు. ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని కలెక్టర్ ఎ.సూర్యకుమారి స్వయంగా హెచ్చరించినా అక్రమార్కులు తగ్గలేదు. తహసీల్దార్ దేవుపల్లి ప్రసాదరావు నేతృత్వంలో రెవెన్యూ అధికారులు ఆ మార్గంలోని కల్వర్టును ధ్వంసం చేయించారు. వారి ఆదేశాలనూ బేఖాతరు చేస్తూ అక్రమార్కులు ఆ పక్కనుంచే రోడ్డు నిర్మాణ పనులు చేసుకుపోతున్నారు. స్వామిపేరు చెప్పి భూ కైంకర్యం... కొత్తవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 168లో దాదాపు 415.38 ఎకరాల విస్తీర్ణంలో ఫిరంగికొండ విస్తరించి ఉంది. గతంలో గిరిజన రైతులకు అక్కడ 150 ఎకరాల్లో డీ పట్టాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా రూ.5 కోట్ల వరకూ ధర పలుకుతోంది. దీంతో కొండపై వేంకటేశ్వర స్వామి గుడికడతాం అంటూ కబ్జాదారులు స్కెచ్ వేశారు. దీనికి కొత్తవలస రెవెన్యూ కార్యాయలంలోనే కొంతమంది సిబ్బంది యథాశక్తిగా సాయం అందించారు. దీంతో అర ఎకరంలో గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. దేవుడికి భారీ ప్రాంగణం ఉండాలని చెబుతూ పరిసరాల్లో దాదాపు 4.5 ఎకరాల వరకూ చదును చేసేశారు. ఆ తర్వాత ఆ భూమిని ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకోవాలనేది అసలు పన్నాగంగా తెలుస్తోంది. అనుమతుల్లేకుండా నిర్మాణాలు... వాస్తవానికి ఫిరంగికొండ పచ్చదనం పరచుకొని ఉంటుంది. ప్రకృతికి విఘాతం కలిగిస్తూ రోడ్లు, భవనాల వంటి నిర్మాణాలు చేపడితే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. గుడి నిర్మాణమే అయినా సరే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పనులు చేయకూడదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా గుడి నిర్మాణం పనులు చేపట్టారు. రోడ్డు వేసేశారు. భారీ ఖర్చుతో కల్వర్టు కూడా నిర్మించారు. స్వాగతద్వారం ఏర్పాటు చేశారు. అధికారుల ఆదేశాలు బేఖాతరు... కలెక్టర్ ఎ.సూర్యకుమారి గత డిసెంబర్ 17వ తేదీన కొత్తవలస పర్యటనకు వచ్చినపుడు ఫిరంగికొండపై తవ్వకాలను చూశారు. వాటిపై ఆరా తీశారు. పర్యావరణ అనుమతులు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయా? గుడి నిర్మాణం చేయడానికి టీటీడీగానీ, దేవాదాయ శాఖ గానీ అనుమతులు ఏమైనా ఇచ్చిందా? రెవెన్యూ అనుమతులు ఏమైనా ఉన్నాయా? అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అలాంటివేమీ లేకుండా పనులు ఎలా చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ భవానీశంకర్‌ను ఆదేశించారు. దర్జాగా నిర్మాణ పనులు... ఫిరంగి కొండపై చేస్తున్న పనులు నిలిపేసేందుకు తహసీల్దార్ ప్రసాదరావు, రెవెన్యూ సిబ్బంది జనవరి 18న కొండపైకి వెళ్లారు. కొండపైకి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గంలోనున్న కల్వర్టును జేసేబీతో ధ్వంసం చేయించారు. అక్కడ నిర్మాణ పనులు తక్షణం నిలిపేయాలని ఆదేశించారు. వీటిని అక్రమార్కులు బేఖాతరు చేశారు. కూలిన కల్వర్టు పక్కనే మళ్లీ రోడ్డువేసి పనులు చేస్తున్నారు. నీరుగారిన క్రిమినల్ కేసు... ఫిరంగి కొండను ఆక్రమించి తవ్వకాలు చేసినవారిపై, నిర్మాణాలు చేపట్టిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గత తహసీల్దార్ రమణారావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వడంతో ముగ్గురిపై భూ ఆక్రమణ (ల్యాండ్ గ్రాబింగ్) కేసు నమోదైంది. వాస్తవానికి అసలు సూత్రధారులను వదిలేసి ఏదో తూతూమంత్రంగానే ఆ ఫిర్యాదు ఉందని ఇటు రెవెన్యూ వర్గాల్లోను, అటు స్థానికుల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. రకరకాల పైరవీలతో ఈ కేసు కాస్తా నీరుగారిపోయింది. ఫిరంగి కొండ కాస్త కరిగిపోతోంది. ప్రభుత్వ స్థలాలకు ఎసరు... కొత్తవలస నుంచి గతంలో గిరిజన యూనివర్సిటీకి భూసేకరణ జరిగిన రెల్లి–గిరిజాల రోడ్డులో ఫిరంగి కొండ ఉంది. దీనికి దిగువన టీచర్స్ కాలనీ, ఎన్జీఓ కాలనీ ఉన్నాయి. అక్కడ ఎవరెవరికీ పట్టాలు ఇచ్చారో, ఇంకా మిగిలిపోయిన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలిపే రెవెన్యూ రికార్డు కాస్త అక్రమార్కుల చేతికి వచ్చింది. దాని ఆధారంగా వంద గజాలకు రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ధరకు ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు. ఇలా రికార్డు లీకేజీ వెనుక స్థానికంగా ఉన్న కొంతమంది రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్వర్టును ధ్వంసం చేయించాం.... ఫిరంగి కొండ అంతా ప్రభుత్వ స్థలమే. అక్కడ అనుమతుల్లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయి. అందుకే ట్రాక్టర్లు, జేసీబీలు కొండపైకి వెళ్లకుండా ఆ మార్గంలో కల్వర్టును ధ్వంసం చేయించాం. ఆ కల్వర్టును నిర్మించినదీ ఆక్రమణదారులే. దీనిపై పూర్తి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించాం. – దేవుపల్లి ప్రసాదరావు, తహసీల్దార్, కొత్తవలస -
‘పచ్చ’మూక అక్రమాలపై జాయింట్ కలెక్టర్ కన్నెర్ర
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్‌లోని రూ.100 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు కాజేసినా అధికారులు గుర్తించకపోవడంపై జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 24.49 ఎకరాల భూమి అన్యాక్రాంతంపై ‘ప్రభుత్వ భూములపై పచ్చమూక’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై జేసీ స్పందించారు. డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రసన్నాయపల్లిలోని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారు? రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదుకు సహకరించిన అధికారులెవరు? రూ.100 కోట్లకు పైగా విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా స్థానికఅధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ఎలా రిజిష్టర్ చేశారు? అన్న కోణాల్లో విచారణ జరపాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. వారు రెండు,మూడు రోజుల్లో నివేదికను జేసీకి అందజేయనున్నారు. దాని ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు పెడతామని జేసీ ‘సాక్షి’కి తెలిపారు. భూములను పరిశీలించిన తహసీల్దార్ అన్యాక్రాంతమైన ప్రసన్నాయపల్లి పరిధిలోని ప్రభుత్వ భూములను రాప్తాడు తహసీల్దార్ బి.ఈరమ్మ బుధవారం పరిశీలించారు. రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్నా సబ్రిజిస్ట్రార్ల తప్పిదం వల్లే ప్రైవేటు వ్యక్తులకు రిజిష్టర్ చేశారంటూ ధర్మవరం ఆర్డీవోకు నివేదిక పంపారు. అదే సమయంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదైన పేర్ల ఆధారంగా మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరుడు పంజగల శ్రీనివాసులు భార్య పంజగల ప్రసన్నతో పాటు మరో పది మందికి నోటీసులు పంపారు. చదవండి: Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ -
వసూల్ సొమ్ము వెనక్కి
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కోసం వసూలు చేసిన డబ్బు లబ్ధిదారులకు తిరిగి అందించేందుకు గుడుపల్లె నేతలు సిద్ధమవుతున్నారు. నాలుగేళ్ల క్రితం వసూలు చేసిన డబ్బు అధికార పార్టీకి చెందిన గుడుపల్లె ప్రధాన నేతలు పంచుకున్నారు. లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడంలో విఫలమయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేమని భావించి, తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. సాక్షి, కుప్పం : చిత్తూరు జిల్లా గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ దేవస్థానం వదళ్లున్న 52 సెంట్ల పశువులమేత బీడును చదును చేసి ప్లాట్లుగా మార్చిన విషయం తెలిసిందే. 36 మంది వద్ద ప్లాట్లు రూ.30వేల నుంచి రూ.50వేల వరకు అధికార పార్టీ నేతలు వసూలు చేశారు. ఎన్టీఆర్ గృహకల్పనలో పశువుల మేతబీడును కాలనీ గృహాలు నిర్మించాలని గతంలో ప్రణాళిక సిద్ధం చేసి, వసూలు కార్యక్రమం సాగించారు. ఈ విధంగా రూ.పది లక్షలకుపైగా వసూలు చేసిన గుడుపల్లె మండల ప్రధాన నేతలు కొందరు పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. నాలుగేళ్లు పూర్తయినా, లబ్ధిదారులకు ప్లాట్లు, ఎన్టీఆర్ గృహకల్పన కింద ఇళ్లు ఇవ్వలేదు. డబ్బు వాపస్.. రెండు నెలల క్రితం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్లాట్ల విక్రయాలు కథనంపై అధికార పార్టీ అధినేతలు స్పందించినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల వద్దకు వెళితే ఆ డబ్బుపై ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలో అని తర్జనభర్జన పడుతున్నారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్ల కేటాయింపులో ఇబ్బంది పడుతున్నామని చెబుతూ, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు సిద్ధపడినట్లు సమాచారం ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు తీసుకున్నామనే విషయాలు తెలుసుకుని, వారికి తిరిగి చెల్లించాలని మండలానికి చెందిన ప్రధాన నేత మార్కెట్ కమిటీ చైర్మన్ సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. ఆ... ఆదేశాలతోనే... ఎన్నికల దృష్ట్యా తీసుకున్న నగదు తిరిగి చెల్లించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం వసూళ్లకు పాల్పడ్డ కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నోటిఫికేషన్ వెలువడకముందే లబ్ధిదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
భూ కబ్జా
నేలకొండపల్లి మండల కేం ద్రంలో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురవుతోంది. సుమారు ఆరు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి ఆస్పత్రికి కేటాయించారు. ఆరోగ్యశాఖకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు. కానీ పహాణీలో పేరు మార్చలేదు. ఇదే అదనుగా భావించి కొందరు కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు. నేలకొండపల్లి (ఖమ్మం): మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి భూమి యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలేదు. 1961లో ప్రభుత్వం ఆస్పత్రి కోసం సర్వే నంబర్ 219/1లోని రెండు ఎకరాల భూమి కొనుగోలు చేసింది. అప్పటి పంచాయతీ పాలకవర్గం 1961, ఫిబ్రవరి 25న ప్రభుత్వ ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ కూడా చేసింది. కానీ పహాణీలో మాత్రం పేరు మార్చలేదు. ఇప్పటికీ 1961లో ఉన్న రైతుల పేరు మీదనే భూమి ఉన్నట్లు పహణీల్లో చూపిస్తోంది. ఇదే అవకాశంగా భావించి కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. అయితే ఇటీవల నిర్మాణ పనులను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు. దాదాపు రూ.5 కోట్ల విలువ చేసే ఇప్పటికే 29 కుంటల (3509 గజాలు) భూమి ఆక్రమణకు గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ 18 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. రెవిన్యూ, ఆరోగ్య శాఖల మధ్య కొరవడిన సమన్వయం నేలకొండపల్లి మండల కేంద్రంలో విలువైన స్థలాన్ని కాపాడాల్సిన రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు మిన్నకుండిపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1961లో 2 ఎకరాల స్థలాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్ఓ) పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి నుంచి ఎంతో మంది అధికారులు మారినప్పటికీ ఆ స్థలాన్ని మాత్రం పహాణీలో ఎక్కించలేదు. భూమికి సంబంధించిన పత్రం ఒక్కటి కూడా ఆరోగ్యశాఖాధికారుల వద్ద లేదు. రెవెన్యూ శాఖ అధికారులు కూడా అటువైపు చూడడం లేదు. రెవెన్యూ, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయం చేసుకుని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిందిపోయి, ఎవరికివారు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత అధికారుల ఆదేశాలు బేఖాతర్ గతంలో ఆర్డీఓగా పని చేసిన వాసం వెంకటేశ్వర్లు స్థలం ఆక్రమణపై స్పందించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టారు. ఆక్రమణ రుజువు కావటంతో పూర్తి స్థాయిలో సర్వే చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన బదిలీపై వెళ్లారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులు కూడా చేతులు దులుపుకున్నారు. గ్రామస్తుల పోరాట ఫలితంగా మరోసారి సర్వే.. గ్రామస్తులు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో స్పందించి విచారణకు ఆదేశించారు. సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసచారిని ఆదేశించటంతో కొద్ది రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఆయన ఖమ్మంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కటంతో ఆక్రమణ కథ కంచికి చేరింది. సీపీఎం, సీపీఐ నాయకులు మరో మారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విచారణాధికారిగా సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ మురళిని ఆదేశించారు. ఆయన కూడా రెండు రోజులు నేలకొండపల్లిలో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా స్థలంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రిలే దీక్షలకు అనుమతి నిరాకరణ ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నాయకులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. ప్రత్యక్ష కార్యాచరణకు కూడా సిద్ధమయ్యారు. ఈ నెల 8 నుంచి సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దీక్షలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో సోమవారం నుంచి చేపట్టాల్సిన దీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టులో కేసు నడుస్తోంది ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణపై 18 మందికి నోటీసులు ఇచ్చాం. వారిలో ముగ్గురు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. దీంతో ముందుకు సాగలేకపోతున్నాం. కోర్టు వాయిదాలు పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం. –దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి నిర్లక్ష్యం వీడాలి ప్రభుత్వ ఆస్పత్రి స్థలం ఆక్రమణ విషయం తెలిసి కూడా అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటే పట్టించుకోకపోవటం సరికాదు. అధికార యంత్రాంగం ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలి. –ఏటుకూరి రామారావు, నేలకొండపల్లి -
రూ.5కోట్ల భూమి ఆక్రమణకు యత్నం
పోరుమామిళ్ల : రాత్రికి రాత్రి ప్రభుత్వభూమి ఆక్రమించుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.రెవెన్యూ అధికారుల ఉదాసీన, నిర్లక్ష వైఖరి వల్ల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వభూములు అన్యాక్రాంతమవుతున్నాయి. రెండు దశాబ్దాల కాలంగా నిరాటంకంగా జరుగుతున్న కబ్జాలను అరికట్టే చర్యలు జరగలేదు. అధికారులు రెవెన్యూచట్టాలను ఉపయోగించి, కఠినచర్యలు తీసుకోకపోవడం అక్రమణదారులకు వరంగా మారింది. కబ్జాదారులు బోగస్‌పత్రాలు సృష్టించి, కార్యాలయ సిబ్బంది సహకారంతో రికార్డుల్లో నమోదు చేయించడం, అడ్డుకుంటే కోర్టు మెట్లెక్కడం పరిపాటిగా మారింది. మండల కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ప్రభుత్వభూములపై చాలాకాలంగా కబ్జాదారులు కన్ను వేశారు. వాటిని స్వాధీనం చేసుకుంటే కోట్ల రూపాయలు సునాయాసంగా జేబులో పడతాయన్న దురాశతో అధికారులను, నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఈ విషయంలో సఫలీకృతులయ్యారు.ఈ నేపథ్యంలో సర్వేనెంబరు 1008, 1009లో ఆదివారం రాత్రి డోజర్‌తో చదును చేసి, అందులో నిర్మాణాలు చేపడితే కోట్లరూపాయల భూమి సొంతమవుతుందని కొందరు భావించారు. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతుండగా గమనించినవారు తహసీల్దారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన వీఆర్వోను అలర్ట్ చేయడంతో వారు ప్రయత్నాలు ఆపి పరారైనట్లు తెలిసింది. ఈ స్థలం ఏడెమిదేళ్లుగా వివాదంగా ఉంది. ఆ సర్వేనెంబరులో రంగసముద్రం సచివాలయం నిర్మించారు. ప్రభుత్వస్థలంలో భవనం నిర్మిస్తే, కొంతమంది ఆస్థలం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా బోగస్ పత్రాలు సృష్టించినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బోగస్ పత్రాల సహకారంతో కోర్టుకు పోవడం, సచివాలయం నిరుపయోగంగా మారడం జరిగింది. ఏడేళ్లుగా ఈ స్థలాన్ని ప్రభుత్వభూమిగా స్పష్టం చేయడం అధికారులకు సాధ్యం కాలేదంటే రెవెన్యూశాఖ పనితీరు గురించి అర్థం చేసుకోవచ్చు. పోరుమామిళ్ల–మైదుకూరు ప్రధాన రహదారిలో ఉన్నందున ఆ భూమి విలువ రూ. 5 కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. కబ్జాకు ప్రయత్నం చేసినవారిపై కేసు పెడతామని అధికారులు తెలిపారు. సోమవారం బంద్ దృష్ట్యా సిబ్బంది రాలేదని, మంగళవారం పూర్తి వివరాలతో కేసు పెడతామన్నారు. ఆక్రమణకు ప్రయత్నించిన వారి వివరాల గురించి ప్రశ్నించగా విచారిస్తున్నామని, రేపు చెబుతామన్నారు. చర్యలు తీసుకుంటాం: తహసీల్దార్ చంద్రశేఖరవర్మ సర్వేనెంబరు 1008, 1009లో జరిగిన ఆక్రమణ గురించి తహసీల్దారు చంద్రశేఖరవర్మ, వీఆర్ఓ సదానందంలను వివరణ కోరగా దుండగుల గురించి విచారిస్తున్నామన్నారు. భూమి చదును చేసేందుకు ఉపయోగించిన యంత్రం (డోజర్/ జేసీబీ) స్వాధీనం చేసుకుంటామన్నారు. దాదాపు ఎకరన్నర భూమి చదును చేశారన్నారు. ఆ భూమిపై కోర్టులో ‘డబ్ల్యూఎపి 4755/2011, 4788/2011’ నంబర్లతో కేసు నడుస్తోందన్నారు. -
కోడలు మంత్రి కావడంతో ఎమ్మెల్యే ...
సెంటు స్థలం లేని పేదలు ఆవాసం కోసం వృథాగా ఉన్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే అది అక్రమం..వెంటనే పోలీసులు వాలిపోతారు..రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి స్థలాలను ఖాళీ చేయిస్తారు. కాళ్లకు మొక్కినా కనికరించరు. అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే..తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ప్రభుత్వ స్థలం తక్కువ ధరకు లీజుకు దొరుకుతుంది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 99 ఏళ్లు ఆ భూమిని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఆర్థికంగా ఎదగనూ వచ్చు. ఇందుకు ఏ నిబంధనలు అడ్డురావు. పైగా మంత్రి బంధువుగా ఉంటే వ్యవహారాన్ని అడ్డులేకుండా చక్కబెట్టుకోవచ్చు. కర్నూలు నగరంలో ఇలానే జరుగుతోంది. విలువైన పర్యాటక స్థలాన్ని కాజేయడానికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు ; అధికారపార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను పర్యాటక శాఖ స్థలంపై పడింది. ఇప్పటికే ఆయన.. భారీగా క్రైస్తవ ఆస్తులను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అదే పద్ధతిలో పర్యాటక శాఖ స్థలాలను కైవసం చేసుకోవాలని యత్నిస్తున్నారు. కోడలు భూమా అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా ఉండడంతో వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఏకంగా 99 ఏళ్ల పాటు నామమాత్రపు లీజుకు ఎకరన్నర స్థలాన్ని తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న పర్యాటకశాఖ స్థలాన్ని లీజు ప్రాతిపదికన తీసుకుని భారీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే చేజిక్కించుకోవాలనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులల్లో టెండర్లను పిలిచినప్పటికీ ఎవరూ అడ్డురాకుండా చేసుకునేలా ఆయన అనుచరులు బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు స్థలం వద్దకు ఎమ్మెల్యే అనుచరులు రాకపోకలు సాగిస్తూ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీలోని టెండర్ల వ్యవహారంలో ఏకచక్రాధిప్యతంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పర్యాటకశాఖ స్థలంపై పడడం చర్చనీయాంశమైంది. ఎవరూ పోటీలో లేకుండా...! కర్నూలులో వెంకటరమణ కాలనీకి మంచి గుర్తింపు ఉంది. పర్యాటక శాఖకు ఇక్కడ సుమారు 5 ఎకరాల వరకు స్థలం ఉంది. ఇందులో క్యాంటీన్, లాడ్జింగ్‌తో పాటు బారు కూడా పర్యాటకశాఖకు ఉంది. అదేవిధంగా ఒక ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నారు. ఇంకా రెండు ఎకరాల వరకూ ఖాళీ స్థలం ఉంది. ఇందులో ఎకరన్నర స్థలంపై ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి కన్ను పడింది. ఈ స్థలాన్ని తక్కువ ధర లీజుకే కాజేయాలనేది ఆయన యత్నంగా ఉంది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖకు చెందిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే టెండర్లను పిలవడం పరిపాటి. అక్కడ ఏమి ఏర్పాటు చేయాలనే విషయాన్ని సదరు శాఖనే నిర్ణయిస్తుంది. అయితే, కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని పర్యాటకశాఖ స్థలం విషయంలో మాత్రం ఇప్పటివరకు పర్యాటకశాఖ టెండర్‌ను పిలవలేదు. ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ టెండర్ అనివార్యమైతే... ఎవరు టెండర్లో పాల్గొనకుండా చూసుకోవాలనేది కూడా ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులు రెండు, మూడు రోజులకోసారి పర్యాటకశాఖ స్థలం వద్దకు వెళ్లి చక్కర్లు కొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పనుల్లో ఏ చిన్న కాంట్రాక్టర్ బరిలో ఉండకుండా ఎమ్మెల్యే తన మనుషులకే టెండర్లను కట్టబెడుతున్నారు. అదీ అంచనా వ్యయాన్ని పెంచి పనులు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోడలు మంత్రి అఖిప్రియ చూస్తున్న పర్యాటక శాఖపై కన్నేశారు. లీజు పద్ధతిలో పర్యాటక స్థలాన్ని చేజిక్కించుకునేందుకు యత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
స్కెచ్చేస్తున్నారు..
► నాడు జెడ్పీ స్థలం.. నేడు ఎన్ఎస్పీ వంతు ► రూ.25 కోట్ల స్థలానికి టెండర్ ► 1.92 ఎకరాల స్థలంలో టీడీపీ కార్యాలయం ఏర్పాటు యత్నం ► స్థలం ఇవ్వాలంటూ ఎన్ఎస్పీఉన్నతాధికారులపై ఒత్తిడి ► 99 ఏళ్ల లీజు పేరుతో స్థలం కబ్జాకు రంగం సిద్ధం ► ఇరిగేషన్ మంత్రి, లోకేష్‌లకు వినతి ► పావులు కదుపుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ► ఎన్ఎస్పి కార్యాలయానికి సరైన భవనం లేని వైనం ► అయినా పట్టించుకోని అధికారులు టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం పేరుతో విలువైన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు చెందిన స్థలాన్ని సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ రంగం సిద్ధం చేసింది. 99 సంవత్సరాల లీజు పేరుతో పాతిక కోట్ల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక వైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సరైన సొంత కార్యాలయం కూడా లేదు. కానీ వారి స్థలాన్ని అధికార పార్టీ సొంతం చేసుకునేందుకు సిద్ధమవ్వడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరం నడిబొడ్డున నెల్లూరు–కర్నూలు హైవే పక్కన సర్వే నెం.88లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు (ఎన్ఎస్పి) 1.92 ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలానికి తూర్పు వైపున ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ కార్యాలయం, పడమర వైపున నాగార్జున యూనివర్సిటీ, దక్షిణం వైపున కర్నూలు–నెల్లూరు హైవే ఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్థలం విలువ రూ.25 కోట్లకుపైమాటే. ఖాళీగా ఉన్న స్థలంపై జిల్లా అధికార పార్టీ నేత కన్నుపడింది. టీడీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం పేరుతో ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయ్యా రు.99 సంవత్సరాల లీజు కింద తొలుత స్థలాన్ని సొంత ం చేసుకునేందుకు ప్రతిపాదించారు.ఒక ఎకరం స్థలానికి నెలకు రూ.1,000 చొప్పున 1.92 ఎకరాల స్థలానికి నెలకు రూ.1800 లీజు కింద చెల్లించే పద్ధతిలో ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి ఇవ్వాలంటూ ఇప్పటికే ఇరిగేషన్ ఎస్ఈ, సీఈలపై అధికార పార్టీ నేత ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. మీరిక్కడే పని చేయాలంటే... మీ స్థలాన్ని పార్టీ కార్యాలయానికి ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు సైతం దిగుతున్నట్లు ప్రచారం ఉంది. అప్పగింతకు పావులు కదుపుతున్న అధికారులు.. ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించేలా అనుమతులు మంజూరు చేయాలంటూ అధికార పార్టీ జిల్లా నేత తొలుత ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమకు విన్నవించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని చినబాబు లోకేష్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయానికి స్థలమివ్వాలన్న నిబంధనలను అడ్డుపెట్టుకొని క్యాబినెట్ తీర్మానం ద్వారా ఎన్ఎస్పి స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేందుకు అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒంగోలులో ఎన్ఎస్పికి సరైన సొంత భవనం కూడా లేదు. ఉన్న భవనాలు చిన్నపాటి వర్షం కురిసిన జలమయమవుతున్నాయి. అధికారులు వర్షాకాలంలో వాటిలో కూర్చొని పని చేసే పరిస్థితి కూడా లేదు. కార్యాలయం ఎదురుగానే ఉన్న రెండెకరాల స్థలంలో సొంత భవనాలు నిర్మించుకోవాలన్న ప్రతిపాదన కూడా ఎన్ఎస్పి సిద్ధం చేసుకుంది. అయితే విలువైన స్థలాన్ని టీడీపీ జిల్లా కార్యాలయం పేరుతో సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ సిద్ధం కావడంపై ఎన్ఎస్పి కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు అధికార పార్టీ నేతల కొమ్ముకాస్తూ స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమయ్యారని అదే శాఖలో పని చేస్తున్న కొందరు అధికారులు విమర్శలు గుప్పించటం గమనార్హం. సొంత పార్టీలోనే వ్యతిరేకత.. నగరంలో విలువైన స్థలాలు ఒక వైపు కబ్జాకు గురవుతుంటే.. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి మాత్రం మొన్న జడ్పీ స్థలం.. నేడు ఎన్ఎస్పి స్థలం అంటూ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడంపై అధికార టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయానికి చెందిన విలువైన స్థలాలు కాకుండా కొందరు అధికార పార్టీ నేతలు కబ్జా చేసిన విలువైన కార్పొరేషన్ స్థలాల్లో పార్టీ కార్యాలయం నిర్మించాలంటూ మరికొందరు నేతలు విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం. తిప్పికొట్టిన జడ్పీ చైర్మన్.. తొలుత నగరంలోని సౌత్ బైపాస్ రోడ్డులో సర్వే నెం.66/1బి, 67/1లో ఉన్న రూ.50 కోట్ల విలువైన 1.60 ఎకరాల జడ్పీ స్థలంలో జిల్లా టీడీపీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్ధమయ్యారు. ఈ మేరకు జడ్పీ తీర్మానం చేయాలంటూ చైర్మన్ ఈదర హరిబాబుతో పాటు సభ్యులపైనా ఒత్తిడి తెచ్చారు. సంతకాల సేకరణకు దిగి బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఉంచిన స్థలాన్ని పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారంటూ గొడవకు దిగారు. దీంతో వెనక్కితగ్గిన దామచర్ల ప్రతిపాదనను ఎట్టకేలకు విరమించుకున్నారు. అయితే తాజాగా ఎన్ఎస్పి స్థలాన్ని పార్టీ కార్యాలయంకంటూ దామచర్ల కొత్త ప్రతిపాదన తెరపైకి తేవడంపై స్వపక్షం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా
► ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమార్కులు ► 2600 ఎకరాల భూ ఆక్రమణ ► అధికారపార్టీ నేతలు బినామీలుగా వ్యవహరిస్తున్న వైనం ప్రభుత్వ జాగా కనపడితే చాలు పాగా వేస్తున్నారు. ఏకంగా సాగుచేస్తున్నారు. తమకు అనుకూలంగా రెవెన్యూ రికార్డులను మార్చుకుంటున్నారు. దేవాదాయశాఖ భూములకు సంబంధించి అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతో ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. ఏకంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయిస్తున్నారు. వాటిని తమ భూములుగా మార్చుకుని రిజిస్ట్రేషన్ సైతంచేయిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని బంధువుల పేరిట బినామీలుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. మండలాల వారిగా భూ ఆక్రమణ విడవలూరు మండలంలోని వరిణి రెవెన్యూ పరిధిలో 1600 ఎకరాల తీరప్రాంత భూములను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. అదేవిధంగా రామచంద్రాపురం ప్రాంతంలో సైతం 400 ఎకరాలు ఆక్రమించారు. అధికారపీర్టీ నేతలకు బినామీలకు స్థానికులుగా కొందరి పేర్లను చేర్చారు. అదేవిధంగా కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెంలో కోవూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు కొందరు ఏకంగా వంద ఎకరాలకు పైగా స్వాహా చేశారు. పోలంరెడ్డి తన అత్త, తండ్రులను బినా మీలుగా చేసుకుని భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా బొడ్డువారిపాళెం పరీవాహక ప్రాంతంలోనే చుక్కల పేరిట ఉన్న ప్రభుత్వ భూములను తహసీల్దార్ సహకారంతో పట్టా భూములుగా మార్చి స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూములకు కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండడంతో నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం, గంగపట్నం, కొరుటూరు, కుడితిపాళెం ప్రాంతాల్లో 150 ఎకరాలకు పైగా తీర ప్రాంత భూములను అధికారపార్టీ నేతలు కబ్జా చేశారు. సముద్రానికి అతి సమీపంలో ఉన్న భూములను టీడీపీ నేతలు చదును చేయించి రొయ్యలగుంతలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ బండ్ పరిధిలో 250 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. బ్రహ్మానందేశ్వర స్వామి భూములతో కామాక్షితాయి ఆలయ భూములు, రెవెన్యూ భూములు కలిపి మరో వంద ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. మామూళ్ల మత్తులో రెవెన్యూ, దేవాదాయశాఖాధికారులు రెవెన్యూ, దేవాదాయ శాఖ పరిధిలోని ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే స్థల పరిశీలన జరుపుతున్నారు. అనంతరం అక్రమార్కుల నుంచి తాయిలాలను తీసుకుని మౌనం వహిస్తున్నారు. ఎవరైనా కోర్టుకు వెళితే, లాయరు సలహాతో కోర్టుకు హాజరవుతున్నారు. ఆక్రమణ జరుగుతున్న సమయంలో స్పందిస్తే ప్రభుత్వ భూముల పరిరక్షణ జరిగేది. కాని అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి న అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు దేవాదాయ భూముల ఆక్రమణపై విచారణ జరుపుతాం. ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూమిని స్వాధీనం చేసుకుంటాం. -వేగూరు రవీంద్రరెడ్డి, ఏసీ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు ప్రభుత్వ భూములు ఆక్రమించడం నేరం. ఆక్రమణలపై విచారణ జరిపిస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -వెంకటేశ్వర్లు, ఆర్డీఓ -
ఆలయ నిర్మాణంపై కొనసాగుతున్న వివాదం
వర్ధన్నపేట : ప్రభుత్వ స్థలంలో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణంపై వివాదం కొనసాగుతోంది. రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదంతో రెవెన్యూ అధికారులు ముదిరాజ్ కులపెద్దలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. మండలంలోని ఐనవోలు గ్రామంలోని సర్వే నెం. 993లో 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులోని 20 గుంటల స్థలంలో ముదిరాజ్‌లు పెద్దమ్మతల్లి గుడి నిర్మించడానికి 2012లో అప్పటి ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, జెడ్పీటీసీ సభ్యుడు మార్నేని రవీందర్రావు భూమి పూజ చేశారు. అయితే, తాజాగా ఐనవోలు మండలంగా ఏర్పాటుకానుండడంతో ప్రభుత్వ స్థలాలకు అధికారులు హద్దులు ఏర్పాటుచేస్తున్నారు. అప్పటిలోగా అసంపూర్తిగా ఉన్న ఆలయాన్ని పూర్తి చేయాలని ముదిరాజ్‌లు సిద్ధమయ్యారు. ఈ ఆలోచనతోనే రెండు రోజుల క్రితం పెద్దమ్మతల్లి విగ్రహన్ని ప్రతిష్టించారు. దీనికి స్థానికులు అడ్డుకోవడంతో వివాదం ఆరంభమైంది. అయితే, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఆలయాన్ని నిర్మించనుండడంతో గతంలో కూడా అభ్యంతరం వ్యక్తమైంది. కాగా, గ్రామంలో రెండు రోజులుగా వివాదం కొనసాగుతుండడంతో ముదిరాజ్ కులపెద్దలను రెవెన్యూ అధికారులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలం స్వాధీనం చే సుకుని.. ఆలయ నిర్మాణంకు మరో స్థలం కేటాయిస్తామని ముదిరాజ్‌లకు నచ్చచెబుతున్నారు. -
ఎమ్మార్వోపై దాడి కేసులో ఒకరు అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ అమీర్‌పేట ఎమ్మార్వో వెంకటేశ్వర్లుపై దాడి చేసిన కేసులో ఒకరిని ఎస్ఆర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ హుస్సేన్ అనే వ్యక్తి ప్రభుత్వ స్థలంలో 'ఫ్లాట్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి అమ్మకానికి పెట్టాడు. అది తెలిసిన ఎమ్మార్వో ఆ బోర్డును తీసేయించారు. దాంతో ఆ వ్యక్తి ఆ స్థలం తనదేనని ఎమ్మార్వోతో గొడవపడి దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో ఫిర్యాదు మేరకు పోలీసులు హుస్సేన్ని శనివారం అరెస్ట్ చేశారు. -
ఉరేసుకుంటం కానీ.. జాగా ఖాళీ చెయ్యం ..!
- జలాల్‌పురంలో ‘బీఎస్ఎఫ్’ స్థల పరిశీలన - అడ్డుకున్న రైతులు, అధికారులతో వాగ్వాదం భూదాన్‌పోచంపల్లి: ‘‘తాత, ముత్తాతల కాలం నుంచి ఈడనే సేద్యం చేసుకుంటున్నం.. ఏళ్లుగా కబ్జాలో ఉంటున్న ప్రభుత్వ భూమిని మాకే కేటాయించాలి.. ఇంకేవరికో కేటాయిస్తమంటే ఊరుకునేది లేదు.. అవసరమైతే ఈడనే ఉరేసుకుంటం.. కానీ జాగా మాత్రం ఖాళీ చెయ్యం’’ అని మండలంలోని జలాల్పురం గ్రామ రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని 80వ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కాలనీ నిర్మాణం కోసం శుక్రవారం బీఎస్ఎఫ్ అధికారులు స్థల పరిశీలన చేశారు. అయితే విషయం తెలుసుకున్న అదే భూమిలోఅరవై ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులతో పాటు సర్పంచ్ శాపాక భిక్షపతి, ఉపసర్పంచ్ పాలకూర్ల ఆగయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని బీఎస్ఎఫ్ అధికారులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో బీఎస్ఎఫ్ అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లి తహసీల్దార్ ఎం.విజయకుమారితో సమావేశమయ్యారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, 50 ఎకరాల పైన ఇస్తే బీఎస్ఎఫ్ కుటుంబాల కోసం కాలనీ నిర్మాణంతో పాటు సైనిక పాఠశాల, ఆస్పత్రి నిర్మాణం చేపడతామని సరిహద్దు దళాల(బీఎస్ఎఫ్) డీఐజీ సుమేర్‌సింగ్ తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే స్థల కేటాయింపు మా పరిధిలో లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. అదీకాక రైతులు ఈ స్థల విషయమై కోర్డులో పిటిషన్ కూడా వేశారని తెలిపారు. డీఐజీ స్పందిస్తూ కలెక్టర్‌తో గతంలోనే మాట్లాడామని చెప్పారు. రైతులకు నష్టం కలుగకుండా వారికి నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందరి దృష్టి సర్వే నంబర్ 80 పైనే.. జలాల్పురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 80లో గల ప్రభుత్వ భూమిపైన అందరి దృష్టిపడింది. ఈ సర్వే నంబర్లో 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే చాలా కాలంగా గ్రామానికి చెందిన రైతులు ఆ ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంటున్నారు. 2007లో ఇదే భూమిలో 80 ఎకరాలు ఇఫ్ల్యూ యూనివర్సిటీకి ఇచ్చారు. కానీ వారు నిర్మాణం చేపట్టకపోవడంతో దానిని రద్దు చేశారు. తరువాత అపార్డ్ అధికారులు చూసి వెళ్లారు. ఇటీవల చెత్త డంపింగ్ యార్డు కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వే కోసం వస్తే గ్రామస్తులు అడ్డుకోవడంతో వారూ వెనుదిరిగారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ అధికారులు స్థలపరిశీలన చేయడంతో గ్రామస్తులలో ఆందోళన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని తమకు కాకుండా మరెవరికో ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు అసైన్డ్చేయాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న భూదాన్‌పోచంపల్లి మండలంలో ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేయడం బ్యాన్‌లో ఉంది. ఇదిలా ఉంటే సర్వే నంబర్ 80లో గల 110 ఎకరాల భూమి ప్రభుత్వ రికార్డులో మాత్రం ఖాళీగా ఉంది. -
భార్య నిర్వాకంతో చిక్కుల్లో మంత్రి
భువనేశ్వర్: ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బిజయశ్రీ రౌత్రే ఇబ్బందుల్లో పడ్డారు. ఆస్పత్రి కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆయన సతీమణి డాక్టర్ జ్యోతి రౌత్రే దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో మంత్రికి తలనొప్పి మొదలయింది. వైద్యురాలిగా పనిచేస్తున్న మంత్రి భార్య విలాసవంతమైన యూనిట్-3 ప్రాంతంలో ఆస్పత్రి కోసం ప్రభుత్వం నుంచి 1987లో భూమి తీసుకున్నారు. కొన్నాళ్లు ఆస్పత్రి నడిపి మూసేశారు. అప్పటినుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే తన భార్యను మంత్రి బిజయశ్రీ వెనకేసుకురావడం గమనార్హం. తాము తప్పు చేయలేదని, చట్టవిరుద్దంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్ర రాజధానిలో ఇది తప్ప తమకు మరోచోట స్థ్లలం లేదని వాపోయారు.