భువనేశ్వర్: ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బిజయశ్రీ రౌత్రే ఇబ్బందుల్లో పడ్డారు. ఆస్పత్రి కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆయన సతీమణి డాక్టర్ జ్యోతి రౌత్రే దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో మంత్రికి తలనొప్పి మొదలయింది. వైద్యురాలిగా పనిచేస్తున్న మంత్రి భార్య విలాసవంతమైన యూనిట్-3 ప్రాంతంలో ఆస్పత్రి కోసం ప్రభుత్వం నుంచి 1987లో భూమి తీసుకున్నారు.
కొన్నాళ్లు ఆస్పత్రి నడిపి మూసేశారు. అప్పటినుంచి వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అయితే తన భార్యను మంత్రి బిజయశ్రీ వెనకేసుకురావడం గమనార్హం. తాము తప్పు చేయలేదని, చట్టవిరుద్దంగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్ర రాజధానిలో ఇది తప్ప తమకు మరోచోట స్థ్లలం లేదని వాపోయారు.
భార్య నిర్వాకంతో చిక్కుల్లో మంత్రి
Published Wed, Aug 27 2014 9:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement