
కుక్కల దాడిలో మరణించిన గొర్రెలు
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం రాత్రి కుక్కలు కొట్టంపై దాడి చేయడంతో పద్నాలుగు గొర్రెలు చనిపోయా యి. మరో 8 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం కూడవెళ్లి చంద్రం ఆదివారం తన గొర్రెలను కొట్టంలోకి పంపాడు. రాత్రి సమయంలో చంద్రం వాటికి కాపలా ఉండేందుకు అ క్కడే పడుకున్నాడు. మధ్యలో లేచి చూసేసరికి గొర్రెల కొట్టంలోకి చేరిన నాలుగు కుక్కలు దాడి చేసి పద్నాలుగు జీవాలను బలిగొన్నాయి. మరో 8 గొర్రెలను గాయపర్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పంచనామా చేసి పైఅధికారులకు సమాచారాన్ని అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ప్రమీల కోరారు.
Comments
Please login to add a commentAdd a comment