
కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రెలు
దోమ : ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్యకు చెందిన 100 గొర్రెలను తన పొలం దగ్గర మంద చేసి ఉదయం ఇంటికి వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో ఊరకుక్కలు ఆ మందపై దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్లగా గొర్రెలు మృతి చెంది కుప్పలుగా పడి ఉన్నాయి. కష్టపడి పొషించిన గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో రైతు దిక్కుతోచి స్థితిలో ఉన్నాడు. దీంతో రైతుకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment