sheeps died
-
పొట్టగొట్టాయి..!
భువనగిరి క్రైం : సమయం అర్ధరాత్రి ఒంటి గంట.. అప్పుడప్పుడే వర్షం మొదలవుతుంది.. పైగా దోమల బెడద. ఇక్కడ నిద్ర పట్టేట్టు లేద ని ఇంటికెళ్లి పడుకుందామని గొర్రెల యజమా ని కొట్టం నుంచి బయలుదేరాడు. మళ్లీ వేకువజామునే లేచి వెళ్లి మంద దగ్గరికి వెళ్లి చూసే సరికి షాక్‌కు గురయ్యాడు. రాత్రి వరకు బా గా నే ఉన్న గొర్రెలన్నీ రక్తం మడుగులో చనిపోయి ఉండడంతో గుండె చెరువైంది. గొర్రెల మం దపై కుక్కలు దాడి చేయడంతో 65 గొర్రెలు మృతి చెందాడు. ఈ సంఘటన భువనగిరి మండలం ఎర్రంబల్లి గ్రామంలో బుధవారం వేకువజామున జరిగింది. వెటర్నరీ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్ల బాలయ్యకు సుమారు 90పైగా గొర్రెలు ఉన్నాయి. గొర్రెల మందను తన వ్యవసాయబావి వద్ద గల కొట్టంలో తోలాడు. బాలయ్య ప్రతిరోజు రాత్రి మంద వద్దే పడుకుంటాడు. కానీ మంగళవా రం అర్ధరాత్రి వర్షం కురుస్తుండడంతో, దోమలు ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ క్రమంలోనే మందకు ఏర్పాటు చేసి న జాలి కింది నుంచి అయిదు కుక్కలు మందలోకి ప్రవేశించాయి. అందులోకి ప్రవేశించిన కుక్కలు గొర్రెలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. బుధవారం వేకువజామునే మంద దగ్గరికి వెళ్లి చూసిన చనిపోయిన గొర్లను చూసి బాలయ్య తీవ్రంగా రోదించాడు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. మృతి చెందిన గొర్రెలను పశువైద్యాధి కారి పృథ్వీరాజ్, గ్రామ ప్రత్యేకాధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి గొర్రెలు కుక్కల దాడిలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
దోమ : ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్యకు చెందిన 100 గొర్రెలను తన పొలం దగ్గర మంద చేసి ఉదయం ఇంటికి వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో ఊరకుక్కలు ఆ మందపై దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్లగా గొర్రెలు మృతి చెంది కుప్పలుగా పడి ఉన్నాయి. కష్టపడి పొషించిన గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో రైతు దిక్కుతోచి స్థితిలో ఉన్నాడు. దీంతో రైతుకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నాడు. -
కుక్కల దాడిలో పద్నాలుగు గొర్రెలు హతం
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం రాత్రి కుక్కలు కొట్టంపై దాడి చేయడంతో పద్నాలుగు గొర్రెలు చనిపోయా యి. మరో 8 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం కూడవెళ్లి చంద్రం ఆదివారం తన గొర్రెలను కొట్టంలోకి పంపాడు. రాత్రి సమయంలో చంద్రం వాటికి కాపలా ఉండేందుకు అ క్కడే పడుకున్నాడు. మధ్యలో లేచి చూసేసరికి గొర్రెల కొట్టంలోకి చేరిన నాలుగు కుక్కలు దాడి చేసి పద్నాలుగు జీవాలను బలిగొన్నాయి. మరో 8 గొర్రెలను గాయపర్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పంచనామా చేసి పైఅధికారులకు సమాచారాన్ని అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ప్రమీల కోరారు. -
గొర్రెలపై గుర్తు తెలియని జంతువుల దాడి
రామయంపేట(మెదక్): మండలంలోని సుతార్‌పల్లి గ్రామంలో రాగి పెద్ద అంజయ్యకు చెందిన నాలుగు గొర్రెలను గుర్తు తెలియని జంతువులు హతమార్చాయి. అంజయ్య తన గొరెల్రను వ్యవసాయ బావి వద్ద కొట్టంలో ఉంచగా, గుర్తు తెలియని జంతువు హతమార్చింది. చిరుత పులి దాడి చేసినట్లు బాధితుడు పేర్కోనగా, ఇది చిరుత దాడి కాదని అటవీ శాఖ డీప్యూటీ రెంజ్ అధికారి కుతుబోద్దీన్ పేర్కోన్నారు. బాధితుణ్ణి ఆదుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. -
మూగజీవాల మృత్యువాత
సాక్షిప్రతినిధి, నల్లగొండ: పాలమూరు జిల్లా నుంచి గొర్రెల మందలు తీసుకువచ్చిన కాపర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. మేత కోసం నల్లగొండ జిల్లాకు వచ్చిన జీవాలు అంతుపట్టని వ్యాధి సోకి పిట్టల్లా రాలిపోతున్నాయి. నాలుగు రోజుల్లో 300 దాకా గొర్లు చనిపోవడంతో వారికి దిక్కు తోచడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన ఐదుగురు, దేవరకద్ర మండలం గద్దెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు, అవంగపట్నంకు చెందిన ముగ్గురు, వేముల గ్రామానికి చెందిన ఇద్దరు గొర్రెల కాపరులు సుమారు మూడువేల గొర్రెల మందను తీసుకుని జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా మందలో కొన్ని గొర్రెలు మేత మేయకుండా నలతగా ఉండడాన్ని గమనించిన కాపరులు గుంటూరు జిల్లా మాచర్లనుంచి మందులు కొనుక్కువచ్చి చికిత్స చేశారు. అయినా, ఈనెల 27వ తేదీనుంచి ఒక్కొక్కటిగా జీవాలు చనిపోవడం మొదలు పెట్టాయి. సమాచారం తెలుసుకున్న సంచార వైద్య సిబ్బంది 1962 వాహనంతో వచ్చి జీవాలకు చికిత్స అందించారు. అయినా, మరణాలను ఆపలేక పోయారు. ఇలా.. వరుసగా శుక్రవారం దాకా మందలోని గొర్లు చనిపోతూనే ఉన్నాయి. మిర్యాలగూడ మండలం తుంగ పాడుకు చేరుకున్న మందలో శుక్రవారం సైతం మరో అరవై గొర్రెలు చనిపోయాయి. సుమారు 3వేల మందను నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద హాలియా, నిడమనూరు, త్రిపురారం, మిర్యాలగూడ, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్ మండలాల్లో మేత కోసం తీసుకువచ్చామని బాధితులు చెప్పారు. తాము తిరిగి జూలైలో వానలు పడడంతో వెనక్కి వెళ్లిపోతామని, ఈ సారి తమను దురదృష్టం వెంటాడుతోందని వాపోతున్నారు. గొర్రెలు మృతిచెందడంతో పాలమూరునుంచి మేతకోసం పంపించిన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. పనిచేయని వైద్యం.. కొద్ది రోజులుగా జీవాలు మృత్యువాత పడు తుండగా, పశువైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నా ఎలాంటి ఉపయోగం కనిపించడం లేదు. అసలు గొర్లకు వచ్చిన వ్యాధి ఏమిటో కూడా వైద్యులు చెప్పకపోవడంతో కాపరులు ఆందోళన చెందుతున్నారు. వైద్య సిబ్బంది నాలుగు రోజులుగా వైద్యశిబిరం ఏర్పాటు చేసి గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. కొన్ని గొర్రెలకు ఆపరేషన్ చేసి పరీక్షించగా కడుపులో కాలేయం పూర్తిగా దెబ్బతిని ముక్కలు అయిందని చెబుతున్నారు. బీటీ పత్తి ఆకులు కూడా అరగక పచ్చి ముద్దలా కనిపిస్తోందని వైద్యసిబ్బంది అంటున్నారు. వెటర్నరీ బయొలాజికల్ రీసెర్చ్ సంస్థ బృందం గొర్రెల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు రోగ నిర్ధారణ పరీక్షలు చేసి, మందలో ఉన్న గొర్రెల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపింది. ఆ రిపోర్టు ఇంకా అందక పోవడంతో ఏ విషయం చెప్పలేకపోతున్నారు. ఆంత్రాక్స్‌గా అనుమానం? మృతిచెందిన గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి సోకిందేమోనని కాపరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కాపరుల సొంత గొర్రెలతో పాటు సబ్సిడీ గొర్రెలు కూడా మంద వెంట ఉన్నాయి. సబ్సిడీ గొర్రెల ద్వారా ఏమైనా వ్యాధి ప్రబలిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరో వైపు కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆంత్రాక్స్ కాదు.. ఆందోళన వద్దు శుక్రవారం చనిపోయిన గొర్రెలకు నట్టలు ఉన్నాయి. వాటికి సంబంధించి చికిత్స చేస్తున్నాం. లెఫ్టో పైరోసిస్, మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ వల్ల అవి చనిపోయాయి. దీనిని గుర్తించి చికిత్స అందివ్వడం ఫలితాలను ఇచ్చింది. ఇలా చనిపోయిన గొర్రెల నుంచి వైరస్ విస్తరించి ఇతర గొర్రెలు కూడా చనిపోయే ముప్పు ఉండటంతో పూడ్పించాం. ఆంత్రాక్స్ సోకి గొర్లు చనిపోతున్నాయడం వాస్తవం కాదు. రిపోర్టులు అందాక పూర్తి నిర్ధారణకు వస్తాం. –రమేశ్, జిల్లా పశువైద్యాధికారి -
యూరియా కలిసిన నీరుతాగి గొర్రెలు మృతి
నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ మండలం తీగల్‌పహాడ్ పంచాయతీ పరిధిలోని సంఘంమల్లయ్య పల్లెకు చెందిన పొనవేణి గట్టయ్యకు చెందిన 16 సబ్సిడీ గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద యూరియా కలిసిన నీటిని గొర్రెలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. గోదాముల్లో కింద పడిన యూరియాను పారవేయకుండా నీరుపోసి శుభ్రం చేయడంతో ఆ నీరు బయటకు వచ్చి నిలిచి ఉండడంతో గొర్రెలు తాగి చనిపోయాయని పేర్కొన్నాడు. గొర్రెలను మండల సహాయ పశు వైద్యురాలు పద్మ పరిశీలించారు. పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. మంగళవారం సాయత్రం మంచిర్యాల పశు వైద్యాధికారి ఎం.భూమయ్య, వైద్యులు సిద్దు పవార్, సంతోష్, పద్మలు గ్రామంలోని మిగతా గొర్రెలకు చికిత్స అందించారు. -
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి
హైదరాబాద్ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
70 గొర్రెలు, 3 జింకలు మృతి
♦ విషగుళికలు కలిపిన నీరే కారణం ♦ రూ.7 లక్షలు నష్టం ♦ విలవిల్లాడిన పోషకులు నాగెళ్లముడుపు (తర్లుపాడు) : విషగుళికలు కలిపిన నీరు తాగి 70 గొర్రెలు, 3 జింకలు మృతిచెందిన సంఘటన తర్లుపాడు మండలంలోని నాగెళ్లముడుపు ఇలాఖాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... నాగెళ్లముడుపు, ఉమ్మారెడ్డిపల్లె గ్రామాల వాసులైన నాగం గురవయ్య, వెంకటయ్య, రమణయ్య, మూడమంచు పోలయ్యలకు చెందిన సుమారు 300 గొర్రెలు, పొట్టేళ్లు నాగెళ్లముడుపు ట్యాంకు సమీపంలోకి మేత కోసం వచ్చాయి. ఆ సమీపంలోని మద్దసాని గురుమూర్తి బత్తాయి తోట వద్ద ఉన్న నీటి కుంటలోకి దాహం తీర్చుకునేందుకు వెళ్లాయి. అయితే, ఆ తోట యజమాని.. బత్తాయి చెట్లను అడవి పందులు, జింకలు నాశనం చేస్తుండటంతో వాటిని అంతమొందించేందుకు సమీపంలో గుంతతీసి నీరు నింపి విషగుళికలు కలిపడంతో ఆ నీరు తాగిన గొర్రెలు కొద్దిసేపటికే గిలగిల్లాడుతూ అక్కడికక్కడే చనిపోయి కుప్పలుకుప్పలుగా పడ్డాయి. మరికొన్ని గొర్రెలు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. కంటికి రెప్పలా పెంచుకున్న గొర్రెలు తమ కళ్ల ముందే మృతి చెందడాన్ని బాధితులు జీర్ణించుకోలేక విలవిల్లాడారు. సమాచారం అందుకున్న పరిసర గ్రామాల ప్రజలు మృతిచెందిన గొర్రెలను చూసేందుకు భారీగా అక్కడకు తరలివచ్చారు. బాధితులు విలపించిన తీరు చూపురులతో కంటతడి పెట్టించింది. ఈ విషయంపై తాడివారిపల్లె పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, అదే విషపు నీరు తాగి మూడు జింకలు చనిపోయాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని చనిపోయిన జింకలను పరిశీలించారు. దీనిపై వారు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో 24 గొర్రెలు మృతి
గుంటూరు: రెంటచింతల మండల కేంద్రమైన రెంటచింతల గ్రామశివార్లోని గోలివాగు వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలోలారీ కిందపడి 24 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు... మహబూబ్‌నగర్ జిల్లా అమరాబాద్ మండలంలోని వంకేశ్వరం గ్రామానికి చెందిన యడ్లశ్రీను, తగుళ్ల మల్లయ్యలు తమ గొర్రెలను తూర్పులో మేపుకొని మాచర్లవైపుకు వెళ్తున్నారు. గోలివాగు బ్రిడ్జి దాటిన సమయంలో గుర్తుతెలియని ఓ లారీ గొర్రెలపైనుంచి వెళ్లగా 24 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. ఈ ప్రమాదంతో రూ.3.60 లక్షలు నష్టం వాటిళ్లిందని బాదితులు శ్రీను,మల్లయ్యలు తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. (రెంటచింతల) -
ప్రాజెక్టులో మునిగి 42 గొర్రెలు మృతి
నెన్నెల: ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కుమ్మరివాగు ప్రాజెక్టు నీటిలో మునిగి మంగళవారం 42 గొర్రెలు మృతి చెందాయి. ప్రాజెక్టు నీటి నుంచి అవతలి ఒడ్డుకు మందను తోలే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీమిని మండలం వీగాంకు చెందిన గొర్రెల పెంపకం దారులు వారి గ్రామాల్లో మేత లేకపోవడంతో నెన్నెల ప్రాంతానికి వలస వచ్చారు. పది కుటుంబాల వారు ఇక్కడే నివాసం ఉంటూ గొర్రెలు మేపుకుంటున్నారు. తడిసిన తర్వాత బూరు కత్తిరించేందుకు దాదాపు 2500 గొర్రెలను ప్రాజెక్టులోకి తోలారు. కొన్ని ఏటవాలు ప్రాంతం నుంచి గట్టెక్కాయి. మిగతావి దారితప్పి ఒడ్డెత్తు ఉన్న ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ వాటికి ఒడ్డు ఎక్క రాక నీటిలో మునిగి వృతి చెందినట్లు గొర్రెలకాపరులు వాపోయారు. వందల గొర్రెలకు ముగ్గురమే కాపర్లం ఉన్నందున వాటిని కాపాడలేక పోయామన్నారు. బర్సుల బీరయ్యకు చెందిన 11 గొర్రెలు, బర్సుల భీమయ్యకు చెందిన 8, జాతరకొండ రాజయ్యకు చెందిన 9, మేకల భీమయ్యకు చెందిన 6, మేకల మల్లేశ్‌కు చెందిన 6, మేకల రాజయ్యకు చెందిన 2 గొర్రెలు నీట మునిగి వృతి చెందాయి. మృత్యువాత పడ్డ గొర్రెల విలువ దాదాపు రూ. 2.5 లక్షల వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తే జీవనాధారమైన గొర్రెలు ప్రమాదంలో మృతిచెందాయని కంటనీరు పెట్టారు. ఆర్థికంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.