కుక్కల దాడిలో మృతిచెందిన గొర్రెలు
భువనగిరి క్రైం : సమయం అర్ధరాత్రి ఒంటి గంట.. అప్పుడప్పుడే వర్షం మొదలవుతుంది.. పైగా దోమల బెడద. ఇక్కడ నిద్ర పట్టేట్టు లేద ని ఇంటికెళ్లి పడుకుందామని గొర్రెల యజమా ని కొట్టం నుంచి బయలుదేరాడు. మళ్లీ వేకువజామునే లేచి వెళ్లి మంద దగ్గరికి వెళ్లి చూసే సరికి షాక్‌కు గురయ్యాడు. రాత్రి వరకు బా గా నే ఉన్న గొర్రెలన్నీ రక్తం మడుగులో చనిపోయి ఉండడంతో గుండె చెరువైంది. గొర్రెల మం దపై కుక్కలు దాడి చేయడంతో 65 గొర్రెలు మృతి చెందాడు. ఈ సంఘటన భువనగిరి మండలం ఎర్రంబల్లి గ్రామంలో బుధవారం వేకువజామున జరిగింది.
వెటర్నరీ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్ల బాలయ్యకు సుమారు 90పైగా గొర్రెలు ఉన్నాయి. గొర్రెల మందను తన వ్యవసాయబావి వద్ద గల కొట్టంలో తోలాడు. బాలయ్య ప్రతిరోజు రాత్రి మంద వద్దే పడుకుంటాడు. కానీ మంగళవా రం అర్ధరాత్రి వర్షం కురుస్తుండడంతో, దోమలు ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ క్రమంలోనే మందకు ఏర్పాటు చేసి న జాలి కింది నుంచి అయిదు కుక్కలు మందలోకి ప్రవేశించాయి.
అందులోకి ప్రవేశించిన కుక్కలు గొర్రెలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. బుధవారం వేకువజామునే మంద దగ్గరికి వెళ్లి చూసిన చనిపోయిన గొర్లను చూసి బాలయ్య తీవ్రంగా రోదించాడు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. మృతి చెందిన గొర్రెలను పశువైద్యాధి కారి పృథ్వీరాజ్, గ్రామ ప్రత్యేకాధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి గొర్రెలు కుక్కల దాడిలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment