Nijampeta
-
కుక్కల దాడిలో పద్నాలుగు గొర్రెలు హతం
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం రాత్రి కుక్కలు కొట్టంపై దాడి చేయడంతో పద్నాలుగు గొర్రెలు చనిపోయా యి. మరో 8 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం కూడవెళ్లి చంద్రం ఆదివారం తన గొర్రెలను కొట్టంలోకి పంపాడు. రాత్రి సమయంలో చంద్రం వాటికి కాపలా ఉండేందుకు అ క్కడే పడుకున్నాడు. మధ్యలో లేచి చూసేసరికి గొర్రెల కొట్టంలోకి చేరిన నాలుగు కుక్కలు దాడి చేసి పద్నాలుగు జీవాలను బలిగొన్నాయి. మరో 8 గొర్రెలను గాయపర్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పంచనామా చేసి పైఅధికారులకు సమాచారాన్ని అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ప్రమీల కోరారు. -
అందరిచూపు ‘గేటెడ్’ వైపే!
సాక్షి, హైదరాబాద్: 2016 సంవత్సరం.. భాగ్యనగర స్థిరాస్తి మార్కెట్ సానుకూలంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అమ్మకాలు ఊపందుకుంటాయి. నిర్మాణ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, నూతన పారిశ్రామిక విధానంతో నగరానికొస్తున్న పెట్టుబడులు, కొత్త సంస్థలతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఫ్లాట్లు కొనేవారి సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నగరవాసులకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగింది. అభద్రతాభావం.. ఇతరత్రా కారణాల వల్ల వీటివైపు మొగ్గుచూపుతున్నారు. సింగిల్ అపార్ట్మెంట్ల బదులు.. కమ్యూనిటీలో నివసించాలని చాలా మంది భావిస్తున్నారు. నగరంలో అల్లర్లు, హింసాత్మక సంఘటనలు పునరావృతమైతే.. ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో.. కొందరు గేటెడ్ కమ్యూనిటీలవైపు దృష్టి సారిస్తున్నారు. బూమ్ సమయంలో ఆరంభమైన బడా ప్రాజెక్టుల్లో ప్రస్తుతం కొన్ని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని చివరి దశకు చేరుకున్నాయి. వీటిలో భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించని ప్రాజెక్టుల వైపు కొనుగోలుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల వద్ద సందర్శకులు సందడి మొదలైంది. ఇక ఆలస్యం చేయడం వృథా అనుకున్నవారు ఫ్లాట్ల కొనుగోళ్లకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రాజెక్ట్‌ను చూసిన రెండు వారాల్లోగా తుది నిర్ణయానికి వస్తున్నారు. నిన్నటి వరకూ విల్లాల జోలికి వెళ్లనివారు నేడు ఆసక్తి చూపిస్తున్నారని ఓ బిల్డర్ అభిప్రాయపడ్డారు. మార్కెట్లో సానుకూల ధోరణి పెరగడంతో ప్రాజెక్టు సందర్శనలు ఆధికమయ్యాయని తెలిపారు. గత నాలుగు నెలల్లో నిజాంపేట ఏరియాలో అత్యధికంగా మా విల్లాలే అమ్ముడుపోయాయి. -
నిజాంపేటలో వైఎస్సార్ సీపీ విజయం
3214 ఓట్ల మెజార్టీతో గెలిచిన ప్రమీల యాదవ్ నిజాంపేట, న్యూస్‌లైన్: గ్రేటర్ విలీన పంచాయతీల్లో అతిపెద్ద గ్రామమైన నిజాంపేట సర్పంచ్ పదవికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు శనిగల ప్రమీల యాదవ్ 3,214 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొలను శ్రీనివాసరెడ్డి స్వగ్రామమైన నిజాంపేటలో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొంటున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కీలకమైన ఈ గ్రామంలో వైఎస్సార్సీపీ గెలుపొందడం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.