చిత్తూరు జిల్లా కుప్పం మండలం హెచ్‌టీ రోడ్డులోని కుప్పం తహశీల్దార్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది.
తహశీల్దార్ ఇంట్లో చోరీ
Published Tue, Jan 26 2016 2:27 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం హెచ్‌టీ రోడ్డులోని కుప్పం తహశీల్దార్ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగత పనుల నిమిత్తం అబ్దుల్ మునాఫ్ పొరుగూరు వెళ్లగా ఈ చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోని వస్తువులంతా చిందరవందర చేశారు. స్థానికుల సమాచారాన్ని పోలీసులకు, యజమానికి చేరవేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement