శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మండలంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ బీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయలంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా శాసన మండలి పట్టబద్రల ఓట్లు 2810, టీచర్ల ఓట్లు 117 నమోదైనట్లు తెలిపారు.
ఎర్రగుంట్ల: శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మండలంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ బీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయలంలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా శాసన మండలి పట్టబద్రల ఓట్లు 2810, టీచర్ల ఓట్లు 117 నమోదైనట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి ఎర్రగుంట్ల పట్టణంలోని జెడ్పీ పాఠశాలలో పట్టభద్రులకు సంబంధించి 66, 67 నంబర్లు గల పొలింగ్ బూత్‌లను, ఆర్టీపీపీలోని డీఏవీ స్కూల్‌లో 68వ నంబరు పొలింగ్ బూత్‌ను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 36వ నంబరు గల పొలింగ్ బూత్‌ను జెడ్పీ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 66వ పొలింగ్ పరిధిలో చిలంకూరు, నిడుజివ్వి, సిర్రాజుపల్లి, వలసపల్లి, పెద్దనపాడు, తుమ్మలపల్లి, వై కోడూరు, తిప్పలూరు, టీ సుంకేసుల, హనుమను గుత్తి, పొట్లదుర్తి గ్రామాలు వస్తాయని, 67వ పొలింగ్ బూత్‌లో ఎర్రగుంట్ల పట్టణం వస్తుందన్నారు. 68వ పొలింగ్ బూత్ పరిధిలో మాలెపాడు, కలమల్ల, ఆర్టీపీపీ, చిన్నదండ్లూరు, మేకలబాయపల్లి, సున్నపురాళ్లపల్లి గ్రామాలు వస్తాయని, 66 పొలింగ్ బూత్‌లో 858 ఓట్లు, 67వ పొలింగ్ బూతులో 1042, 68వ పొలింగ్ బూత్‌లో 910 ఓట్లు వస్తాయని ఆయన వివరించారు. 36వ పొలింగ్ బూత్‌లో 117 ఓట్లు వస్తాయని తెలిపారు. ఈ నెల 23న చివరి జాబితా విడుదల చేస్తామని తహసీల్దార్ తెలిపారు.