వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్ | MRO Rajender visites land grabbing site | Sakshi
Sakshi News home page

వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్

Published Tue, Aug 4 2015 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

MRO Rajender visites land grabbing site

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆళ్లకొత్తపేట గ్రామంలో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ స్థలాన్ని స్థానిక తహశీల్దార్ రాజేందర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య కబ్జా చేశాడని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తహశీల్దార్ సదరు భూమిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తహశీల్దార్ ఎదుట ఎవరివాదనలు వారు వినిపించారు. పరిసర భూములను సర్వేయర్ ద్వారా కొలిచిన తర్వాత కబ్జా చేసిన భూమి ప్రభుత్వానిదా ? కాదా ? అన్న విషయం తేలుతుందని తహశీల్దార్ రాజేందర్ వెల్లడించారు.   సాధ్యమైనంత త్వరలో సదరు భూములను కొలతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement