Rajender
-
రథయాత్రలకు బీజేపీ రెడీ
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల రథయాత్రలకు రాష్ట్ర బీజేపీ సమాయత్తమైంది. డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలుండడంతో, షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో బస్సుయాత్ర చేయాలని బీజేపీ సంకల్పించింది. ఈనెల 26న బాసర, సోమశిల ఆలయం (కొల్లాపూర్), భద్రాచలం రాములోరిగుడి నుంచి మూడు రథయాత్రలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, ఇతర ముఖ్యనేతలు ఈ యాత్రల్లో పాల్గొంటారు. మొత్తం 119 నియోజకవర్గాల మీదుగా 19 రోజుల పాటు 4,040 కిలోమీటర్ల మేర ఈ యాత్రలు సాగనున్నాయి. ఈ మూడు యాత్రలు అక్టోబర్ 14న హైదరాబాద్‌కు చేరుకుంటాయి. యాత్రల ముగింపు సందర్భంగా నగరంలో జరిగే భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశముంది. రథయాత్రలు ఇలా... రూట్–1 కొమురంభీం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ –1 ( మొత్తంగా 41 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 12 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు :1,100) రూట్–2 కృష్ణా: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతోపాటు హైదరా బాద్–2(మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందులో హైదరాబాద్ పరిధిలోని 6 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,290) రూట్–3 గోదావరి: ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలతోపాటు హైద రాబాద్–3 (మొత్తంగా 39 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అవుతాయి. ఇందు లో హైదరాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లు : 1,650) -
TS: డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాజేందర్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్ఐగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో ఎస్ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్‌లో ఎస్ఐ రాజేందర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఎస్ఐ రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ ఇంట్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కాగా, దాచిపెట్టిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి ప్లాన్ చేసినట్టు విచారణలో తెలిసింది. గతంలో కూడా రాజేందర్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దీంతో, అధికారులు రాజేందర్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతరం.. కోర్టును ఆశ్రయించిన రాజేందర్ ఉత్తర్వులపై స్టే తెచ్చకున్నారు. ఇది కూడా చదవండి: ప్రియురాలిని చంపిన ఎన్ఆర్ఐ.. తర్వాత ఏం జరిగిందంటే? -
ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజా ప్రాంగణంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉద్యోగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఆదాయపన్ను పరిమితిని పది లక్షలకు పెంచాలని కోరారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో 30% ఫిట్‌మెంట్‌ను రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఇచ్చా రని, దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరితే, దాన్ని రాష్ట్రాలపై రుద్దడం సమంజసం కాదని అన్నారు. ఏఐఎస్జీఈఎఫ్ జాతీయ చైర్మన్ కామ్రేడ్ సుభాష్ లాంబ, ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీకుమార్‌ల అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాలలో ప్రధానంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించినట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు. అలాగే కోవిడ్‌తో మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా మంజూరు లాంటి అనేక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. -
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. త్వరలోనే సీఎంతో ఉద్యోగ సంఘ నాయ కుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ఇటీవల పదవీ విరమణ పొందిన సంగతి తెలిసిందే. అనంతరం టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మామిళ్ల రాజేందర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారంతా మర్యాదపూర్వకంగా మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మామిళ్ల రాజేందర్‌ను అభినందించారు. ఇప్పుడు రాజేందర్ బాధ్యత మరింత పెరిగిందని, ఉద్యోగులు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాల న్నారు. సుదీర్ఘ కాలంపాటు టీఎన్జీవో అధ్యక్షుడిగా పనిచేసి రిటైరైన కారం రవీందర్ రెడ్డికి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా సీఎస్ సోమేశ్ కుమార్‌ను కలిశారు. ఆయన కూడా ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
ఆర్పీఎఫ్ ఎస్సై ఇంట్లో చోరీ
శుభకార్యానికి వెళ్లిన ఓ ఆర్పీఫ్ ఎస్సై ఇంటి తాళాలు పగులకొట్టి 7 తులాలు బంగారు ఆభరణాలు, రూ. 28 వేలు చోరీ చేశారు. మేడిపల్లి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ సాయిభవానీ నగర్లో నివసించే పోలిశెట్టి రాజేందర్(55) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) ఎస్సై పని చేస్తున్నారు. ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికెళ్లి చూడగా బీరువాలో ఉంచిన నాలుగు తులాల నల్లపూసల దండ, మూడు తులాల ఐదు జతలు చెవి కమ్మలతోపాటు రూ. 28 వేలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిన విషయాన్ని మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అపార్ట్మెంట్ వివాదంలో 'టీడీపీ ఎమ్మెల్యే'
-
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని హాజీపేట్కు చెందిన తొగరి రాజేందర్(22) పట్టణంలోని శ్రీరాంరెడ్డి ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుడిపేట్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై మహేందర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాదాస్పద స్థలాన్ని పరిశీలించిన తహశీల్దార్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆళ్లకొత్తపేట గ్రామంలో వివాదాస్పదంగా మారిన ప్రభుత్వ స్థలాన్ని స్థానిక తహశీల్దార్ రాజేందర్ మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఎల్లయ్య కబ్జా చేశాడని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో తహశీల్దార్ సదరు భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తహశీల్దార్ ఎదుట ఎవరివాదనలు వారు వినిపించారు. పరిసర భూములను సర్వేయర్ ద్వారా కొలిచిన తర్వాత కబ్జా చేసిన భూమి ప్రభుత్వానిదా ? కాదా ? అన్న విషయం తేలుతుందని తహశీల్దార్ రాజేందర్ వెల్లడించారు. సాధ్యమైనంత త్వరలో సదరు భూములను కొలతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. -
అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దం
-
కల్తీ పాలను అరికట్టాలి:రాజేందర్ రెడ్డి
-
అర్హులందరికీ ఆసరా
సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ ఆసరా అందిస్తామని రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, కె.తారకరామారావు స్పష్టం చేశారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) పథకాన్ని హుజూరాబాద్, మానకొండూర్, జగిత్యాల నియోజకవర్గాల్లో ఈటెల, కరీంనగర్, సిరిసిల్లల్లో కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. అనర్హుల పింఛన్లు తొలగిస్తామని, అర్హులకు అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమని, వారి మాటలు నమ్మొద్దని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కలిసి రావాలని కోరారు. కరీంనగర్ : సంక్షేమ పథకాలపై అపోహలొద్దని, అర్హులందరికీ అందిస్తామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. పెరిగిన పింఛన్ల పంపిణీ(ఆసరా) కార్యక్రమాన్ని నగరంలోని వరలక్ష్మి గార్డెన్లో శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల పెంపు జరిగిందన్నారు. వృద్ధులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. పింఛన్లపై ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలన్నారు. ఆధార్‌కార్డు లేకున్నా... మరణ ధ్రువీకరణ పత్రం లేకున్నా మూడు నెలల్లోగా సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి నివేదికల ఆధారంగా డెత్ సర్టిఫికెట్లు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. పింఛన్లు కుదించామనే మాటలు అవాస్తవమని, గతంలో అర్హతలేని వారు పింఛన్లు పొందారని, వాటిని మాత్రమే తొలగిస్తామని పేర్కొన్నారు. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదన్నారు. కుటుంబంలో ప్రతీఒక్కరికి ఆరు కిలోల బియ్యం రూపాయికే అందిస్తామని తెలిపారు. మూలమలుపుతో ఉన్న రాజీవ్ రహదారికి రూ.750 కోట్లతో మెరుగులు దిద్దుతామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రాజకీయాలు మానుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు. గత ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గంలో 7,100 మందికి మాత్రమే పింఛన్లు అందేవని, తాజాగా మండలంలోనే 8,850 పింఛన్లు మంజూరు చేశామని వెల్లడించారు. నగర రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.46 కోట్లు మంజూరు చేస్తే... మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి జరగలేదనడం తగదని మండిపడ్డారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. నవ తెలంగాణ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. మేయర్ రవీందర్‌సింగ్ మాట్లాడుతూ.. కడుపునిండా అన్నం, కంటి నిండా నిద్ర కల్పించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, డెప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, జెడ్పీటీసీ ఎడ్ల శ్రీనివాస్, ఎంపీపీ వాసాల రమేశ్ పాల్గొన్నారు. -
మళ్లీ తెరపైకి భీమ్రావ్ బాడా వివాదం
మంత్రి కాన్యాయ్‌ను అడ్డుకున్న బస్తీవాసులు సమస్యపై భిన్నస్వరాలు విన్పించిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల నాంపల్లి: గతంలో హామీ ఇచ్చిన మేరకు భీమ్రావ్బాడా బస్తీవాసులకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో ఓ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రి ఈటెల, డిప్యూటీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న బస్తీ వాసులు సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకున్నారు. సమావేశం ముగియగానే మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి ఈటెల బస్తీవాసుల వద్దకు వచ్చి మాట్లాడారు. గతంలో బస్తీని ఖాళీ చేయించిన సమయంలో టీఆర్ఎస్ తరపున మీరే హాజరయ్యారని, బాధితులకు భరోసా ఇచ్చారని, ఈ మేరకు ఇప్పుడు అధికారంలో ఉన్నందున న్యాయం చేయాలని బస్తీవాసులు మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన ఈటెల.. బస్తీ వాసులకు న్యాయం చేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. దీంతో బస్తీవాసులు శాంతించి మంత్రికి జిందాబాద్‌లు కొట్టారు. డిప్యూటీ సీఎం వర్సెస్ మంత్రి భీమ్రావ్ బాడా వివాదం గురువారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి ఈటెల రాజేందర్ల మధ్య వాగ్వివాదానికి దారితీసింది. బస్తీవాసుల ముందే ఈఅంశంపై ఇరువురు భిన్నస్వరాలు విన్పించారు. భీమ్రావ్ బాడాలో పేదలకు ఇళ్లను నిర్మించాలని ఈటె ల రాజేందర్ రెవెన్యూ మంత్రి కూడా అయిన మహమూద్ అలీని కోరారు. అయితే ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో పేదలకు ఇళ్లు ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ముఖ్యమైన ప్రాంతాల్లో పేదలు ఉండకూడదనడం సబబుకాదన్నారు. ఈ దశలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ జోక్యం చేసుకుని వాదనలకు తెరదించారు. కాగా బస్తీ వివాదంపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో రెండు నెలలు సమయం ఇస్తున్నామని, న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కొమురయ్య హెచ్చరించారు. -
కళ్లల్లో కారం చల్లి రూ 2.77 లక్షలు దోపిడీ
నల్లకుంట ఠాణా పరిధిలో ఘటన నల్లకుంట: బైక్‌పై వెళ్తున్న కలెక్షన్బాయ్ను గుర్తు తెలియని వ్యక్తులు తమ బైక్‌లతో ఢీకొట్టారు... కళ్లల్లో కారం చల్లి అతడి చేతిలో ఉన్న రూ. 2.77 లక్షల నగదు బ్యాగ్‌ను లాక్కొని ఉడాయించారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. తూర్పు మండలం అదనపు డీసీపీ ఎల్టీ. చంద్రశేఖర్ తెలిపిన వివరాలు... సీతాఫల్మండి మైలార్‌గడ్డ నివాసి చిప్ప రాజేందర్(38) ట్రూప్ బజార్‌లోని మారుతి ఎలక్ట్రికల్స్‌లో సేల్స్‌మెన్/ కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 25, 26 తేదీల్లో వసూలు చేసిన డబ్బు రూ 2.77 లక్షలను కార్యాలయంలో అప్పగించకుండా తన ఇంటికి తీసుకెళ్లి భద్రపరిచాడు. గురువారం తన వద్ద ఉన్న డబ్బును బ్యాగ్‌లో పెట్టుకుని సుల్తాన్ బజార్‌లోని మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో జమ చేసేందుకు ఉదయం 11.30కి ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. సరిగ్గా 11.45కి అడిక్‌మెట్ ఫ్లైఓవర్ సమీపంలోని లలితానగర్ గండిమైసమ్మ ఆలయం వీధి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో రెండు బజాజ్ పల్సర్ బైక్‌లపై వచ్చిన నలుగురు యువకులు రాజేందర్ బైక్‌ను ఢీకొట్టారు. కిందపడిపోయిన రాజేందర్ చేతిలోని క్యాష్‌బ్యాగ్‌ను ఓ వ్యక్తి లాక్కోవడానికి ప్రయత్నించగా వదలలేదు. దీంతో వారు రాజేందర్ కళ్లల్లో కారంకొట్టి బ్యాగ్ లాక్కుని పారిపోయారు. సమీపంలో ఉన్న ఓ మహిళతో పాటు అదే వీధిలో గణేశ్ మండపాన్ని ఏర్పాటు చేస్తున్న కొందరు యువకులు అడ్డుకునేందుకు యత్నించగా వారిని కూడా దుండగులు బెదిరించి పారిపోయారు. వెంటనే బాధితుడు నల్లకుంట ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ సమాచారం తెలిసి తూర్పుమండలం అదనపు డీసీపీ చంద్రశేఖర్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ లింబారెడ్డి, కోటిరెడ్డి, సీసీఎస్ డీసీపీ బాలరాజు నల్లకుంట స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడు రాజేందర్‌ను తీసుకుని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడి నుంచి మైలార్గడ్డలోని అతని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారించారు. కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లోని ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. నిందితులను పట్టుకొనేందుకు టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. ఘటనపై అనుమానాలు... బాధితుడు రాజేందర్ వద్ద పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్టు, ఆ డబ్బును బ్యాంక్‌లో జమ చేసేందుకు వెళ్తున్నట్టు దొంగలకు ఎలా తెలిసిందనేది అంతుబట్టడంలేదు. ఈ దోపిడీకి పాల్పడిన ముఠాకు రాజేందర్‌కు ఏమైనా సంబంధాలున్నాయా? లేక బిగ్ బజార్లో మాదిరిగానే ఇందులో కూడా తెలిసిన వారి హస్తం ఉందా అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. ఆరు రోజుల క్రితం సుల్తాన్‌బజార్‌లో నలుగురు దుండగులు రెండు పల్సర్ బైక్‌లపై వచ్చి రూ. 50 లక్షలు దోచుకెళ్లిన సంఘటన.., ఇప్పుడు నల్లకుంటలో జరిగిన దోపిడీ ఒకే విధంగా ఉన్నాయి. దీంతో ఈ దోపిడీ కూడా అదే ముఠా చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
విభజనతోనే..వికాసం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతోనే వికాసమని, అందుకు సీమాంధ్రులు సహకరించాలని తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భోజన విరామ సమయంలో సంగారెడ్డిలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిందన్నారు. వెయ్యికి పైగా విద్యార్థుల ఆత్మబలిదానాలు, ఉద్యోగుల సకలజనుల సమ్మె. రాస్తారోకో, రైల్‌రోకోలతో ప్రభుత్వంపై వత్తిడి పెంచడంలో సఫలీకృతం అయ్యామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు సహకరించాలని అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అతిక్రమించి ఈ ప్రాంత వనరులు, ఉద్యోగాలను సీమాంధ్ర పాలకులు కొల్లగొట్టారన్నారు. విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉండి ఇరు ప్రాంతాల అభివృద్ధికి చేయూతను అందిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రస్థాయి పిలుపు మేరకు ఈ నెల 17 వరకు ఉద్యోగుల శాంతి, సద్భావన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లో శాంతియుతంగా సద్భావన ర్యాలీ నిర్వహిస్తున్న టీఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, అక్రమ అరె స్టులను ఆయన ఖండించారు. 14 రోజులుగా సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయం కేంద్రం గా ఆందోళన చేస్తున్నా అరెస్టు చేయలేని పాలకులు పక్షపాత వైఖరితో శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులను అరెస్టు చేయడం దారుణమన్నారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మెను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కార్యాలయాలకు హాజరైన ఉద్యోగులు జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రహదారిపై చేరుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో టీఎన్జీఓఎస్ నాయకులు శ్యాంరావు, రాఘవేందర్రావు, నర్సింలు, సుశీల్‌బాబు, రవి, శ్రీనివాస్, సిద్దిరాం, యాదమ్మ, మనోహర, పి. మంజులత, పోచయ్య, వీరయ్య, ఆంజనేయులు, జయరాం, జనార్ధన్, నాగరాజ్, లక్ష్మయ్య, రాములు, వివిధ శాఖల ఉద్యొగులు తదితరులు పాల్గొన్నారు.