ఆర్పీఎఫ్ ఎస్సై ఇంట్లో చోరీ | robbery at RPF SI's home | Sakshi
Sakshi News home page

ఆర్పీఎఫ్ ఎస్సై ఇంట్లో చోరీ

Published Mon, Aug 15 2016 5:54 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

robbery at RPF SI's home

శుభకార్యానికి వెళ్లిన ఓ ఆర్పీఫ్ ఎస్సై ఇంటి తాళాలు పగులకొట్టి 7 తులాలు బంగారు ఆభరణాలు, రూ. 28 వేలు చోరీ చేశారు. మేడిపల్లి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... బోడుప్పల్ సాయిభవానీ నగర్‌లో నివసించే పోలిశెట్టి రాజేందర్(55) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఎస్సై పని చేస్తున్నారు. ఈ నెల 13న కుటుంబ సభ్యులతో కలిసి నిజామాబాద్‌లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికెళ్లి చూడగా బీరువాలో ఉంచిన నాలుగు తులాల నల్లపూసల దండ, మూడు తులాల ఐదు జతలు చెవి కమ్మలతోపాటు రూ. 28 వేలు కనిపించలేదు. దీంతో చోరీ జరిగిన విషయాన్ని మేడిపల్లి పోలీస్‌లకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement