ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల సమీపంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మండలంలోని హాజీపేట్‌కు చెందిన తొగరి రాజేందర్(22) పట్టణంలోని శ్రీరాంరెడ్డి ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గుడిపేట్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాజేందర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎస్సై మహేందర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.