![Adilabad Man Died In Road Accident In Dubai - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/14/adb.jpg.webp?itok=qfD4fazP)
రాజు(ఫైల్)
సాక్షి, ఆదిలాబాద్: ఉన్న ఊరి లో సరైన పని లేక కు టుంబ పోషణకు గల్ఫ్‌బాట పట్టిన ఓ వ్యక్తిని రోడ్డు ప్రమాదం కబళించింది. కుటుంబీకుల వివరాల ప్రకారం... లోకేశ్వరం మండలంలోని బామ్నికే గ్రామానికి చెందిన గొల్ల రాజు (39) కూలీ చేసుకుంటూ జీవించేవాడు. గ్రామంలో సరైన పనులు లేక కుటుంబ పోషణ కోసం అప్పు చేసి డిసెంబరు 29న దుబాయ్‌కి వెళ్లాడు.
అక్కడ నివాసం ఉండే ప్రదేశం నుంచి పనిచేయడానికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. రాజుకు భార్య చిన్నక్క, కుమారుడు రేవంత్ ఉన్నారు. చివరి చూపుకోసం మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment