సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలన ఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, రాజేందర్ సైబర్ క్రైమ్ విభాగంలో ఎస్‌ఐగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు.
వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో ఎస్‌ఐ రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ ఆపరేషన్‌లో ఎస్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఎస్‌ఐ రాజేందర్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ ఇంట్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కాగా, దాచిపెట్టిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి ప్లాన్ చేసినట్టు విచారణలో తెలిసింది.
గతంలో కూడా రాజేందర్ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. దీంతో, అధికారులు రాజేందర్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. అనంతరం.. కోర్టును ఆశ్రయించిన రాజేందర్ ఉత్తర్వులపై స్టే తెచ్చకున్నారు.
ఇది కూడా చదవండి: ప్రియురాలిని చంపిన ఎన్‌ఆర్‌ఐ.. తర్వాత ఏం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment