narayanamma
-
Narayanamma Niraganti: డాక్టరేట్ కలను ‘సెల్ఫ్ హెల్ప్’ నెరవేర్చింది
కుగ్రామం నుంచి ఈ కామర్స్ దాకా నారాయణమ్మ విజయగాధ నారాయణమ్మ నీరగంటి... ఆంధ్రప్రదేశ్, సత్యసాయి జిల్లాలోని ముష్టి కోవెల అనే చిన్న గ్రామంలో అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టిన మహిళ. చదువంతా ప్రభుత్వ విద్యావ్యవస్థలోనే. ఆమె ఈ రోజు ఒక ‘ఈ కామర్స్’ సంస్థను స్థాపించి తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి పీహెచ్‌డీలో చేరారు. త్వరలో పట్టానందుకోనున్న నారాయణమ్మ తన ఆకాంక్షల సుమహారాన్ని సాక్షితో పంచుకున్నారు. డ్వాక్రా దారి చూపింది ‘‘మా నాన్న రైతు. పిల్లల్ని బాగా చదివించాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది. ఐదవ తరగతి వరకు మా ఊరి బడిలో చదివాను. ఆరు, ఏడు తరగతులకు ఉదయం ఐదు కిలోమీటర్లు, సాయంత్రం ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. దాంతో అనంతపురంలో ఒక చిన్న గది అద్దెకు తీసుకుని నన్ను, మా అన్నను చదివించారాయన. అలా ఎనిమిదవ తరగతి నుంచి నేను ఇంటిపని, వంట పని చేసుకుంటూ చదువుకున్నాను. అనంతపూర్‌లో డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంబీఏకి ఆళ్లగడ్డ వెళ్లాను. ఆ తర్వాత పెళ్లితో హైదరాబాద్ రావడం నా ఉస్మానియా కల నెరవేరడానికి మార్గం సుగమం చేసింది. అధ్యయనానికి విద్యాసంవత్సరంలో ‘సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ చాలెంజెస్’ అంశాన్ని తీసుకున్నాను. 2010–11 నుంచి రంగారెడ్డి, సత్యసాయి జిల్లాల్లో డ్వాక్రా సంఘాలను అధ్యయనం చేశాను. మొత్తం ఐదు వందల గ్రూపుల కార్యకలాపాలను తెలుసుకున్న తర్వాత గ్రామీణ మహిళల్లో ఉన్న నైపుణ్యాలు, అవకాశాల మీద ఒక అవగాహన వచ్చింది. ఆర్థిక స్వావలంబనను, స్వయంగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగైంది. అవకాశాలు అందివస్తే ఇంకా ఏదో సాధించాలనే తపన కూడా కొందరిలో ఉంది. అలాంటి అభిరుచి ఉన్న వాళ్లకు వనరులు, ప్రభుత్వ అధికారుల సహకారం ఉంటే అద్భుతాలు చేయగలుగుతారు కూడా. ఇలాంటి సమన్వయం కొన్ని చోట్ల లేకపోవడం కూడా గమనించాను. మొత్తానికి మార్కెటింగ్ గురించిన ఆందోళన లేకపోతే ఉత్పత్తి విషయంలో శ్రమించడానికి వాళ్లు వెనుకాడరు. నా అధ్యయనం ఇలా సాగుతున్న సమయంలోనే కరోనా వచ్చింది. కరోనా కొల్లగొట్టింది కరోనా సమయంలో హోటళ్లతో సహా అన్నీ మూత పడడంతో ఉద్యోగాలు లేక ఏదో ఒక పని దొరికితే చాలన్నట్లు చాలా మంది కనిపించారు. శ్రమించే చేతులున్నాయి, ఆ ఉత్పత్తి అవసరమైన వ్యక్తులున్నారు. వాళ్ల మధ్య కరోనా కరాళ నృత్యం చేస్తోంది. అప్పుడు ఈ కామర్స్ రంగంలో ఓ ప్రయత్నం చేశాను. కర్పూరం తయారీ దారుల నుంచి కర్పూరాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇంటింటికీ చేర్చడంలో విజయవంతమయ్యాను. మీషోలో సరదాగా మొదలు పెట్టిన రీ సేల్ అనుభవమూ తోడైంది. నా మార్కెట్‌ను విస్తరించడానికి శాన్విస్ స్టోర్, భవిత శ్రీ ట్రేడింగ్, ఫ్యాషన్, లేజీ షాపింగ్ వాణిజ్య వేదికలతో సెల్లర్‌గా అమెజాన్‌తో అనుసంధానమయ్యాను. ఆ అనుభవంతో గత ఏడాది నవంబర్‌లో మీథాట్ ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. ఏడాది కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుతుందని అంచనా. ఏడాదికి నికర లాభం ఏడెనిమిది లక్షలుండవచ్చు. గ్రామాలకు విస్తరించాలి ఇప్పటి వరకు నా నెట్వర్క్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అనంతపూర్, చిత్తూరు, గుంటూరు వంటి కొన్ని చోట్లలోనే ఉంది. ఇక గ్రామాల్లో ఉండే డ్వాక్రా మహిళలను అనుసంధానం చేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తుల ప్రాజెక్ట్ గ్రామాల్లో పెట్టాలనేది నా ఆలోచన. ఒక కుటుంబానికి అవసరమైన ప్రతి వస్తువూ నా ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ మీద లభించేటట్లు పటిష్ఠం చేయాలి. అలాగే విదేశాలకు సీమంతం కిట్, ఒడిబియ్యం కిట్, గర్భిణి తినాల్సిన పిండివంటలను ఎగుమతి చేయాలి. ఈ సర్వీస్ ఈ కామర్స్‌లో లేదు. ఈ కామర్స్ వేదిక లైసెన్స్, ట్రేడ్‌మార్క్, కాపీ రైట్స్, పేటెంట్లు, ఫుడ్ లైసెన్స్, వెబ్సైట్ నిర్మాణం, ప్రమోషన్ కోసం మూడు లక్షల వరకు ఖర్చు చేశాను. ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నా ఈ ప్రయత్నంలో గృహిణులు, ఒంటరి మహిళలు, అరవై నిండిన పెద్దవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఉపాధినిస్తోంది మూడేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత పీహెచ్డీ కోసం ఉద్యోగం మానుకున్నాను. ఉద్యోగాలిచ్చే స్థాయికి చేరతానని అప్పుడనుకోలేదు. లెక్చరర్‌గా భర్త సంపాదనకు తోడు నేనూ ఉద్యోగం చేసుకుంటూ , ఇద్దరమ్మాయిలను పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ నేను చేసిన ఎంబీయే ఫైనాన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల మీద పీహెచ్డీ నన్ను చిన్న పరిధిలో ఉంచడానికి ఇష్టపడలేదు. ఈ సాహసానికి ఒడిగట్టేలా ప్రోత్సహించాయి. మా గైడ్ శ్రీరాములు గారి పర్యవేక్షణలో నా పరిశోధన పూర్తయింది. డాక్టర్ నారాయణమ్మ అనే పేరు నా చిన్నప్పటి కల’’ అన్నారు నారాయణమ్మ. కల నెరవేరు తున్న ఆనందం ఆమె కళ్లలో కనిపించింది, ఆ మాట చెప్తున్నప్పుడు ఆ స్వరంలో ఆనందం తొణికిసలాడింది. ఎక్కడి ఆర్డర్‌కి అక్కడే పరిష్కారం ఆహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టాను. నగరాల్లో మహిళలందరూ ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారాల్లో నిమగ్నమై ఉంటున్నారు. పిల్లలకు మన రుచులను ఇంట్లో చేసి పెట్టడం వాళ్లకు కష్టమే. అందుకే సౌత్ ఇండియన్ స్నాక్స్ హోమ్మేడ్వి అందిస్తున్నాను. నా నెట్‌వర్క్‌లో 30కి పైగా మహిళలున్నారు. ఒక ప్రదేశం నుంచి ఆర్డర్ రాగానే అదే ప్రదేశంలో ఉన్న మహిళకు ఫార్వర్డ్ చేస్తాను. మెటీరియల్ కొనుగోలు, ఆమె శ్రమకు వేతనం ఇస్తాను. ఆమె పిండివంటలు తయారు చేసి ప్యాక్ చేసి ఉంచుతుంది. మా కొరియర్ నెట్వర్క్ వాళ్లు ఆమె ఇంటికి వెళ్లి పార్సిల్‌ను కలెక్ట్ చేసుకుని కొరియర్ ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులకు చేరుస్తారు. దాంతో పిండివంటలు తయారు చేసిన రోజే అందుతుండడంతో బాగా క్లిక్ అయింది. – వాకా మంజులారెడ్డి -
కనికరించండయ్యా..!!
అవనిగడ్డ: ఈ ఫొటోలో నిలబడటానికి ఇబ్బంది పడుతున్న వృద్ధురాలి పేరు పంచకర్ల నాంచారమ్మ. వయసు 85ఏళ్లు పైనే. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేతికర్ర సాయంతో నడుచుకుంటూ అతి కష్టం మీద వచ్చింది. కనిపించిన వారినల్లా పలుకరిస్తూ అయ్యా! నాకు న్యాయం చేయండని వేడుకొంది. సరిగా వినబడని ఈ వృద్ధురాలిని ప్రశ్నించగా.. కన్నీరు మున్నీరవుతూ తన గోడు వెళ్లబోసుకుంది. ‘చల్లపల్లి మండలం మాజేరు గ్రామం. నా చిన్నకొడుకు చంద్రశేఖర్ ఏడేళ్ల క్రితం చనిపోయాడు. పెద్ద కొడుకు వెంకటేశ్వరరావు ఐదేళ్ల క్రితం లోకం విడచి వెళ్లిపోయాడు. మాజేరులో మాకు మూడు కుంటలు పొలం ఉండేది. అంతా అమ్మేసి నన్ను రోడ్డున పడేశారు. మనుమడు, మనుమరాలు ఉన్నా చూడరు. రాత్రి వర్షానికి గోనెసంచి దొరికితే తలపై పెట్టుకుని చల్లపల్లిలో ఓ షాపు ముందు తలదాచుకున్నాను. కట్టుకున్న చీర తడచి పోవడంతో చలికి వణకిపోయాను. అవనిగడ్డ వెళ్లు అక్కడ అధికారులకు చెప్పుకుంటే నీ బాధలు తీరతాయి అంటే ఇక్కడకు వచ్చాను. ఇక్కడ ఎక్కడుంటారో, ఎవరిని కలవాలో తెలియదయ్యా? నాకు న్యాయం చేసి పుణ్యం కట్టుకోండయ్యా అంటూ కనబడిన వారినల్లా ఆ బామ్మ చేతులు పట్టుకుని వేడుకుంటున్న దృశ్యం చూపరులను కలచి వేసింది. ఆ వృద్ధురాలికి స్థానికులు భోజనం పెట్టించి కూర్చోబెట్టారు. స్పందించిన డీఎస్పీ.. ఈ విషయాన్ని స్ధానిక విలేకరులు వాట్సాప్ గ్రూపులో పోస్టు చేయగా స్పందించిన డీఎస్పీ వి.పోతురాజు సిబ్బందిని పంపించి స్థానిక కార్యాలయానికి తీసుకొచ్చారు. మాజేరు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు. వృద్ధురాలిని జాగ్రత్తగా చూసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు డీఎస్పీ తెలిపారు. -
ఆటో డ్రైవర్ నారాయణమ్మకు వందనం
-
మహిళ అనుమానాస్పద మృతి
నార్పల (శింగనమల) : నార్పల మండలం దుగుమర్రిలో బెస్త రామలింగ భార్య నారాయణమ్మ(42) అనుమానాస్పదస్థితిలో బుధవారం మరణించినట్లు ఎస్ఐ రాంప్రసాద్ తెలిపారు. ఆమె తలకు బలమైన గాయమై మరణించడంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు సిద్ధమయ్యారన్నారు. అయితే ఘటనపై గ్రామంలో ఆరా తీశామని చెప్పారు. ప్రమాదవశాత్తు జారిపడటంతో 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
నిప్పంటించుకున్న యువతి మృతి
కదిరి టౌన్ : మతిస్థిమితం సరిగాలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లచెరువు మండలం ఓరువాయికి చెందిన నారాయణమ్మ (30) ఆదివారం మృతిచెందింది. ఆరు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణం కోల్పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
మరో మహిళా తహశీల్దార్‌పై దాడికి యత్నం
-
జల సమాధి
దుస్తులు శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు మహిళలు జలసమాధి అయ్యారు. వారు ముగ్గురూ ఒకే వీధివాసులు... కూలి చేస్తేగాని పూట గడవని పరిస్థితి వారి కుటుంబాలది. వారిలో ఇద్దరికి వివాహం జరిగింది. ఇద్దరు చొప్పునచిన్న పిల్లలు ఉన్నారు. మరో యువతి ఇంటర్మీడియెట్ చదువుతోంది. చెరువుకు కలిసి వెళ్లిన వీరు....మృత్యువులోనూ అదే బాటపట్టారు. విజయనగరం క్రైం: చెరువు ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. కలిసి దుస్తులు ఉతకడానికి వెళ్లిన వారు కలిసే విగతజీవులయ్యారు. ఒకరిని రక్షించబోయి మరో ఇద్దరు మృత్యుకోరల్లో చిక్కుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన విజయనగరం మండలం గుంకలాం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షి అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..విజయనగరం మండ లం గుంకలాం గ్రామంలో మెయిన్ వీధిలో నివాసముంటున్న లెంక వెంకన్న కుమార్తె లెంక దేవి ఇంటర్మీడియెట్ చదువుతోంది. అదే వీధిలో కలిశెట్టి రాంబాబు, అతని భార్య కృష్ణవేణి, కునుకు గోవింద, అతని భార్య లక్ష్మి నివాసం ఉంటున్నారు. ఇటీవల హుదూద్ తుపాను రావడంతో ఇంట్లో మాసిన దుస్తులు ఎక్కువగా పేరుకుపోయాయి. దీంతో శనివారం లెంక దేవి (17), కలిశెట్టి కృష్ణవేణి (26), కునుకు లక్ష్మి (24)తో పాటు కోరాడ నారాయణమ్మ దుస్తులు ఉతికేందుకు సమీపంలోని పెద్దరం గ చెరువు వద్దకు వెళ్లారు. ఉతికిన దుస్తులను జాడిస్తున్న సమయంలో కాలుజారి కలిశెట్టి కృష్ణవేణి చెరువులో పడిపోయింది. రక్షిం చాలని ఆమె కేకలు వేయడంతో ఉతికిన చీరను చెరువులోకి విసిరి ఆమెను కాపాడబోయారు. కృష్ణవేణి తనను రక్షించుకొనే ప్రయ త్నంలో చీరను గట్టిగా లాగడంతో రెండో చివర పట్టుకున్న లెంక దేవి, కునుక లక్ష్మి కూడా చెరువులో పడిపోయారు. ముగ్గురూ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి కోరాడ నారాయణమ్మ భయంతో గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం అం దించింది. వెంటనే గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని చెరువులోకి దిగి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే ముగ్గు రూ మృతి చెందారు. లెంక దేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ (సీఈసీ) చదువుతోంది. లెంక దేవికి తండ్రి వెంకన్న, తల్లి కుమారి, తమ్ముడు మణికంఠ ఉన్నారు. వెంకన్న కూలిపని చేసుకుని పిల్లలను పోషిస్తున్నాడు. కలిశెట్టి కృష్ణవేణికి భర్త రాంబాబు, కుమార్తెలు దీపిక (7), సాయి (3), కునుకు లక్ష్మికి భర్త గోవింద, కుమార్తెలు అనూష (5), మానస (2) ఉన్నారు. వీరి భర్తలు ఇద్దరూ కూలిపనిచేసి కుటుంబాల్ని పోషిస్తున్నారు. భర్తలకు చేదోడుగా వీరూ పనులకు వెళ్లేవారు. రూరల్ ఎస్ ఐ ఎస్.కృష్ణమూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. దుఃఖ సాగరంలో బంధువులు మృతుల బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. సంఘటన స్థలం వద్ద వారి రోధనలు మిన్నంటాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తెను చెరువు కబళించేసిందని దేవి తల్లిద ండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోజు కూలీ పని చేసి క ష్టపడి సంపాధించిన డబ్బులతో తన కుమార్తెను ఉన్నత విద్య అందించాలని ఎంతో ఆశపడితే ఇలా మృత్యువు కాటేసిందని ఏడుస్తున్నారు. చిన్న పిల్లలను ఎలా సాకాలని, వారు అమ్మకావాలని అడిగితే ఏమని సమాధానం చెప్పాలంటూ కలిశెట్టి కృష్ణవేణి భర్త రాంబాబు, కునుకు లక్ష్మి భర్త గోవిందుతో పాటు వారి కుటుంబ సభ్యులు గుండెలు బాధుకుంటూ రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఇద్దరికీ చిన్నపిల్లలు చెరువులో పడి మృతి చెందిన కృష్ణవేణి, కునుకు లక్ష్మికీ ఇద్దరేసి ఆడపిల్లలున్నారు. చిన్న పిల్లలను చూసైనా కనికరం చూడకుండా దేవుడు వారిని తీసుకుపోయాడని, పిల్లలేం పాపం చేశారని, తల్లులు లేని పిల్లలనుచేసి అన్యాయం చేశాడని స్థానికులు కన్నీరు పెట్టారు. బాధితులను పరామర్శించిన నాయకులు వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి జిల్లా కేంద్రాస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను ఓదార్చారు. అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ స్వాతీరాణి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ.వి.పి.రాజు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు వెంకట నర్సింగరావు, జెడ్పీటీసీ తుంపల్లి రమణ గ్రామ సర్పంచ్ కర్రో రమణమ్మ, వైఎస్ఆర్ సీపీ నాయకులు బోగి రమణ, సత్యనారాయణ బాధితులను పరామర్శించారు. ప్రమాదభరితంగా చెరువు పెద చెరువు ప్రమాదభరితంగా మారింది. చెరువు వద్ద పెద్ద రాయబండ ఉంది. ఆ రాయి మీద కాలు జారితే చెరువులో పడి మృతి చెందవలసిందే. సుమారు ఎనిమిదేళ్ల కిందట ఇదే చెరువులో పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. వారు స్నానం చేస్తుండగా ఈతరాక చెరువులోకి పడి మృతిచెందారు. ఇప్పుడు కూడా ముగ్గురు మహిళలు మృతి చెందడంతో ముగ్గురేసి చొప్పున చెరువు బలితీసుకుంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదభరితంగా ఉన్న ప్రాంతంలో బట్టలు ఉతకడాన్ని గ్రామస్తులు నిషేధించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.