ఇద్దరు టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం
బుక్కపట్నం : చౌక డిపో డీలర్‌షిప్‌లు తమకు దక్కలేదని అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేం ద్రంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యకు యత్నిం చారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టీడీపీ అభివృద్ధి కో సం పని చేస్తున్న తనకు కాదని మరొకరికి రేషన్ డీలర్‌షిప్ కట్టబెట్టారని మదిరేబైలుకు చెందిన ఆ పార్టీ కార్యకర్త రమణారెడి సోమవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఊజీ మాత్రలు మింగాడు.
ఇదే రీతిలో రామసాగరానికి చెందిన కార్యకర్త శంకర్ ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు సిద్ధపడగా పక్కనున్న వారు వారించారు. ఊజీ మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకున్న రమణారెడ్డిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాము అనేక సంవత్సరాలుగా పార్టీలో నిజాయితీగా పని చేస్తున్నామని, అలాంటిది తమను కాదని డీలర్ షిప్పులు వేరే వారికి కట్టబెట్టడం ఏం న్యాయమని బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.