బాలికపై నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిపై నిర్భయచట్టం కింద కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన మామిడి జగన్ అదే గ్రామానికి చెందిన బాలికను కళాశాలకు వెళ్లి వస్తున్న క్రమంలో 2014నుంచి వేధించసాగాడు. దీంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి జగన్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ రమణారెడ్డి బుధవారం తెలిపారు.
నిర్భయ కేసు నమోదు
Published Wed, Aug 17 2016 8:20 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement