సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
- 14 మంది అరెస్ట్
బెల్లంపల్లి(ఆదిలాబాద్ జిల్లా)
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడిన 14 మందిని పోలీసులు బెల్లంపల్లిలో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14.70 లక్షల నగదు, 13.5 తులాల బంగారం, 7.5 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెల్లంపల్లి డీఎస్పీ రమణారెడ్డి తెలిపారు.