Former CEC
-
మాజీ సీఈసీ గిల్ కన్నుమూత
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) మనోహర్సింగ్ గిల్(86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1958 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిల్ 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు 11వ సీఈసీగా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్ పారీ్టలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో కేంద్ర క్రీడల శాఖ మంత్రి వ్యవహరించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఎస్ గిల్ మృతిపట్ల కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. ఆయన 1998లో 12వ లోక్‌సభకు, 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని కొనియాడింది. -
ఎన్నికల సంస్కర్త ఇకలేరు
సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: దేశ ఎన్నికల ముఖచిత్రంపై తనదైన ముద్రవేసి, కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తిరునెల్లయ్ నారాయణ అయ్యర్ శేషన్ (86) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన ఆదివారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ 1990–96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు. కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించారు. మెట్రోమ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ. శ్రీధరన్ టీఎన్ శేషన్ ఇంటర్మీడియట్ వరకు కలిసి చదువుకున్నారు. వీరిద్దరికీ ఏపీలోని కాకినాడ జేఎన్టీయూలో సీట్లు వచ్చినా శేషన్ మాత్రం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకునేందుకు మొగ్గు చూపారు. శ్రీధరన్ సివిల్ ఇంజినీరింగ్ చదివారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్లపాటు పనిచేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు. తమిళనాడుతోపాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈసీకి ముందు ఆయన అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు. ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్డీ దేవెగౌడ మారారు. శేషన్ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడేవారని పేరు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణన్‌పై ఆయన పోటీ చేశారు. ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు చేసిన కృషికిగాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డును ఆయన అందుకున్నారు. 1959లో ఆయనకు జయలక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు సంతానం లేదు. శేషన్ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆయన్ను లెజెండ్ అని శ్లాఘించారు. నిజాయితీకి నిలువుటద్దం: వైఎస్ జగన్ అమరావతి: శేషన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావం, నిజాయితీ, నిర్భీతికి శేషన్ నిలువుటద్దమని కొనియాడారు. పబ్లిక్ సర్వెంట్‌గా శేషన్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఉన్న శక్తిని ప్రజాస్వామ్య సౌధ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో నిరూపించారని చెప్పారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో శేషన్ పేరు ఎప్పటికీ సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ఎన్నికల్లో శేషన్ సంస్కరణలు డబ్బు, అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో ఆయన సీఈసీ పగ్గాలు చేపట్టారు. అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికలు నిర్వహించి ‘న భూతో న భవిష్యతి’ అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరనేటంత కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేశారు. ఆయన చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురయింది. ఈ రెండు వర్గాలు కలిసి ఆయన్ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలతో అప్పట్లో కొందరు ఎన్నికల కమిషన్‌ను అల్–శేషన్(ఆల్సేషియన్) అనే వారని అంటుంటారు. ఎన్నికల్లో అరికట్టిన అక్రమాలు.. ► ఓటర్లకు లంచాలివ్వడం, ప్రలోభాలకు గురి చేయడం, మద్యం పంపిణీ ► ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం ► కులం, మతం ప్రాతిపదికన ఓట్లు కోరడం ► ప్రచారానికి ప్రార్థనా స్థలాలను వాడుకోవడం ► అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు వాడటం -
‘ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా సమర్ధించారు. ఇతర యంత్రాలతో వాటిని హ్యాక్ చేయడం కానీ, తారుమారు చేయడం కానీ సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈవీఎంలు సీనియర్ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని, అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు. ఈవీఎంలు సమర్ధవంతమైన యంత్రాలనీ వాటిని నిర్వీర్యం చేసే అవకాశాలు లేవని తాను బలంగా నమ్ముతానని చావ్లా పేర్కొన్నారు. ఈవీఎం కేవలం రెండు మూడు విధులను నిర్వర్తించే డెస్క్‌టాప్ కాలిక్యులేటర్ వంటిదని, దీన్ని హ్యాక్ చేయలేరని తాను రాసిన పుస్తకం ’ఎవిరి ఓట్ కౌంట్స్’ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ చావ్లా చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎం చిప్స్‌లను ఎవరైనా ఎలాగైనా మార్చేస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇతర యంత్రాలను ఉపయోగిస్తూ ఏ ఒక్కరూ ఈవీఎం చిప్స్‌లను మార్చలేరని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఈవీఎంకూ వీవీప్యాట్లను అమర్చుతుండటంతో మొత్తం ఈవీఎం వ్యవస్థ మరింత జవాబుదారీగా మారుతుందని చెప్పారు. -
టీఎన్ శేషన్ సతీమణి కన్నుమూత
చెన్నై: కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ టీఎన్ శేషన్‌కు సతీవియోగం కలిగింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శేషన్ భార్య విజయలక్ష్మి శనివారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ప్రఖ్యాత మీడియా సంస్థ ‘మనోరమ’ తెలిపింది. చెన్నైలోని గురుకులం ఓల్డేజ్ హోంలో ఉంటున్న శేషన్ దంపతులకు సంతానం లేరు. విజయలక్ష్మి మరణవార్తను తెలుసుకున్న బంధువులు, అభిమానులు శేషన్‌ను ఓదార్చేయత్నం చేశారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో శేషన్ దంపతులు వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వారి ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. శేషన్ చనిపోయారంటూ..: కాగా, విజయలక్ష్మి మరణవార్తలపై పలు మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. ‘శేషన్ కన్నుమూత’ అంటూ బ్రేకింగ్‌లు ఇచ్చాయి. -
వృద్ధాశ్రమంలో టీఎన్ శేషన్
సాక్షి, చెన్నై : దేశంలో ఎన్నికల సంస్కరణలకు బాటలు వేసిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ప్రస్తుతం చెన్నైలోని వృద్ధాశ్రమంలో శేషజీవితాన్ని గడుపుతున్నారు. నగరంలోని గురుకులం ఓల్డేజ్ హోంలో భార్య జయలక్ష్మితో కలిసి శేషన్ నివసిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శేషన్ దంపతులను చూసేవారు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్నారు. కేరళలోని పాలక్కాడ్‌లో వారికి ఇల్లు ఉన్నా పిల్లలు లేకపోవడంతో వృద్ధాశ్రమంలో నివసించేందుకు మొగ్గుచూపారని తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 15న శేషన్ గురుకులం ఆశ్రమ సహచరులతో తన 85వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. శేషన్ దంపతులు తమ ఆదాయంలో నుంచి ఆశ్రమంలోని సహచరుల వైద్య సేవలు, ఇతర అవసరాలను తీరుస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబా భక్తుడైన శేషన్ బాబా మరణించిన అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో వృద్ధాశ్రమంలో సేదతీరుతున్నారు. కాగా, గతంలో చెన్నై ఆశ్రమంలో మూడేళ్లు గడిపిన శేషన్ మధ్యలో కొంత కాలం ఇంటికి వెళ్లారని ఇటీవల తిరిగి భార్యతో కలిసి వృద్ధాశ్రమానికి వచ్చారని తెలిసింది. ప్రభుత్వంలో అత్యున్నత సేవలు అందించినందుకు గాను 1996లో శేషన్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డు లభించింది.