న్యూఢిల్లీ: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) మనోహర్‌సింగ్ గిల్(86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1958 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన గిల్ 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు 11వ సీఈసీగా సేవలందించారు. అనంతరం కాంగ్రెస్ పారీ్టలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2008లో కేంద్ర క్రీడల శాఖ మంత్రి వ్యవహరించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. గిల్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంఎస్ గిల్ మృతిపట్ల కేంద్ర ఎన్నికల సంఘం విచారం వ్యక్తం చేసింది. ఆయన 1998లో 12వ లోక్‌సభకు, 1999లో 13వ లోక్‌సభకు ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment