మహిళ మెడలో నగల చోరీ | The woman in the neck jewelry theft | Sakshi
Sakshi News home page

మహిళ మెడలో నగల చోరీ

Published Sun, Mar 29 2015 5:28 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM

The woman in the neck jewelry theft

మట్టెవాడ(వరంగల్): రైలు ప్రయాణికురాలి మెడలోని గొలుసును గుర్తుతెలియని దుండగులు దొంగలించారు. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి వరంగల్ జిల్లా కేసముద్రం రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌లోని న్యూ బోయిన్‌పల్లికి చెందిన తాళ్ళ విజయలక్ష్మి(50) తన కుటుంబ సభ్యులతో కలిసి సికంద్రాబాద్ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం రాత్రి ఖమ్మం జిల్లా భద్రాచలంకు బయలుదేరింది. రైలు వరంగల్ జిల్లా కేసముద్రం స్టేషన్‌లో అర్ధరాత్రి సుమారు 2.00 గంటల సమయంలో కాసేపు ఆగి తిరిగి బయలుదేరింది. ఇంతలో కిటికీ పక్కనే కూర్చున్న విజయలక్ష్మి మెడలోని మూడు తులాల బంగారు గొలుసును దొంగ గట్టిగా లాక్కొని పరారయ్యాడు. క్షణాల్లో జరిగిన ఈ సంఘటనతో అయోమయానికి గురైన విజయలక్ష్మి బోరున విలపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement