రిటైర్డ్‌ ఆర్జేడీ దారుణహత్య | retired rjd vijayalaxmi murder in nellore district | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఆర్జేడీ దారుణహత్య

Published Fri, Jan 6 2017 8:24 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

retired rjd vijayalaxmi murder in nellore district

నెల్లూరు: నెల్లూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న మహిళ గొంతు కోసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలతో పాటు నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

పట్టణంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో నివాసముంటున్న రిటైర్డ్‌ ఆర్జేడీ విజయలక్ష్మీ ఇంట్లోకి గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి.. ఆమెను దారుణంగా హతమార్చారు. ఇంట్లోని నగలు, నగదుతో ఉడాయించారు. శుక్రవారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. తెలిసిన వాళ్ల పనే అయిఉంటుందని అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement