
కర్ణాటక, యశవంతపుర : ఇటీవల ప్రముఖ నటుడు దర్శన్, అయన భార్య విజయలక్ష్మీ మధ్య మళ్లీ గొడవలు తలెత్తినట్లు పుకార్లు వచ్చాయి. సోమవారం ట్విట్టర్‌లో పరస్పరం అన్‌ఫాలో అయ్యారు. విజయలక్ష్మి దర్శన్ పేరుతో ఉన్న ట్విట్టర్‌లో ఖాతా నుంచి దర్శన్ పదాన్ని తొలగించటంతో ఈ వదంతులకు కారణమైంది. వదంతులను నమ్మవద్దని సోమవారం ఆమె ట్వీట్ చేశారు. అయితే ఇద్దరి మధ్య ఏదో వివాదం జరుగుతోందని ప్రచారం సాగుతోంది. ఇద్దరు వేరువేరుగా నివసిస్తున్నారు. గతంలో ఇద్దరి మధ్య గొడవలు తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఇటీవల విడుదలైన యజమాన సినిమా మేకింగ్ వీడియోలో దంపతులిద్దరూ కనిపించారు. దాంతో ఇద్దరూ సవ్యంగా ఉన్నారని అభిమానులు అనుకునేలోపే మళ్లీ ఏవో బిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య గొడవలను సరిదిద్దడానికి ఓ నటుడు, రాజకీయ నాయకుడు ఒకరు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అన్నా వదిన సంసారం బాగుండాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment