Ram Charan And Upasana Daughter Naming Ceremony To Be Held Today, Deets Inside - Sakshi
Sakshi News home page

Ram Charan-Upasana: కూతురి పేరు ఇప్పటికే ఫైనల్‌ కానీ..

Published Fri, Jun 30 2023 8:48 AM | Last Updated on Fri, Jun 30 2023 10:26 AM

Ram Charan And Upasana Daughter Name Reveal Today - Sakshi

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబురాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే  ఉంది.

(ఇదీ చదవండి: కెమెరాల ముందు 30 సెకన్ల పాటు లిప్‌లాక్.. బుర్ర పనిచేస్తుందా?)

తాజాగా ఇదే విషయంపై ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్‌ చేసింది. నేడు (జూన్‌ 30)న తన డార్లింగ్‌కు పేరు పెట్టబోతున్నట్లు తెలిపింది. దీంతో మెగా వారసురాలి బారసాల కార్యక్రమం నేడు ఘనంగా జరగనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న వీడియోను ఆమె షేర్‌ చేసింది. మెగా ప్రిన్సెస్ బారసాల కార్యక్రమంలో మెగా కుటుంబంతో పాటు అల్లు అరవింద్‌ కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. అంతే కాకుండా మెగా  కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉన్నవారికి కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం. అయితే మెగా ప్రిన్సెస్ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కానీ పూజా కార్యక్రమంలో మాత్రమే పేరు రివీల్‌ చేయాలని చిరు సూచించారట. 

(ఇదీ చదవండి: బ్రహ్మానందం కోసం మహేష్‌ బాబు ఏం చేశారంటే..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement